Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ ఇద్దరు డేంజరస్ బ్యాటర్లు: రవి శాస్త్రి

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్‌లు అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్లు అని మాజీ హెడ్ కోచ్ రవి శాస్రి అన్నాడు. ప్రస్తుతం ఈ ఇద్దరూ పరుగుల దాహంతో ఉన్నారని, క్రీజులో 40 నిమిషాలు ఉంటే భారీ ఇన్నింగ్స్‌లు ఆడేయగలరని అభిప్రాయపడ్డాడు.

భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో స్మిత్, విరాట్ కోహ్లీ నిలకడలేమి ప్రదర్శన కనబరుస్తున్నారు. ఈ ఇద్దరూ ఇప్పటికే ఈ సిరీస్‌లో చెరొక శతకం సాధించారు. గురువారం నుంచి ఇరు జట్ల మధ్య మెల్ బోర్న్ వేదికగా నాలుగో టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్ రాణిస్తారని రవి శాస్త్రి ఆశాభావం వ్యక్తం చేశాడు.

Ravi Shastri Says Kohli And Smith Have Slipped Down The Ranks but They ll Be Dangerous

'ప్రస్తుతం విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్ నిలకడలేమి ఫామ్‌తో ర్యాంకులు కోల్పోయారు. జో రూట్, విలియమ్సన్, బ్రూక్ అద్భుతంగా రాణిస్తున్నారు. కుర్రాళ్లు ఫ్యాబ్ 4లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. సీనియర్ క్లాస్ బ్యాటర్లకు గట్టి పోటీనిస్తున్నారు. మరోవైపు విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్ పరుగుల దాహంతో ఉన్నారు.

ఈ ఇద్దరు చాలా ప్రమాదకరమైన బ్యాటర్లు. ఒక్కసారి సెట్ అయ్యారంటే ఏ మాత్రం వెనక్కి చూడకుండా చెలరేగుతారు. క్రీజులో 40 నిమిషాల పాటు గడిపారంటే ఈ ఇద్దరూ భారీ ఇన్నింగ్స్‌లు ఆడేయగలరు.'అని రవి శాస్త్రి చెప్పుకొచ్చాడు.

పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ సెంచరీతో సత్తా చాటాడు. కానీ అడిలైడ్, గబ్బా వేదికగా జరిగిన మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమయ్యారు. ముఖ్యంగా ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్‌ను వెంటాడి మూల్యం చెల్లించుకుంటున్నాడు. మరోవైపు స్టీవ్ స్మిత్ పరిస్థితి కూడా ఇలానే ఉంది. ఫ్యాబ్-4 జాబితాలో మిగతా ఇద్దరూ శతకాలతో చెలరేగుతున్నారు. ఐసీసీ టెస్ట్ ర్యాకింగ్స్ ప్రకారం కోహ్లీ, రోహిత్ ర్యాంకు చాలా దిగజారింది.

ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్‌ను వదిలేయాలని విరాట్ కోహ్లీకి మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. ఈ విషయంలో సచిన్‌ను ఆదర్శంగా తీసుకోవాలని కోహ్లీకి ఆసీస్ మాజీ క్రికెటర్ మాథ్యూ హెడెన్ సూచించాడు. 'విరాట్ కోహ్లీ ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడాడు. పేస్, స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కొన్నాడు. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు కోహ్లీ బ్యాటింగ్‌కు ప్రతికూలంగా ఉండే పిచ్‌లపై మాత్రంమే ఆడాడు.

మెల్ బోర్న్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. క్రీజులో పాతుకుపోతే పరుగులు చేయడం పెద్ద కష్టమేం కాదు. కానీ ఆఫ్ సైడ్ బంతులను వెంటాడి మూల్యం చెల్లించుకున్న కోహ్లీ.. ఈ విషయంలో చాలా జగ్రత్తగా ఉండాలి. కవర్ డ్రైవ్ షాట్స్ ఆడకుండా తనను తాను నియంత్రించుకోవాలి. గతంలో సచిన్ టెండూల్కర్ కూడా ఈ సమస్యను ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత అతను ఆఫ్ సైడ్ కవర్ డ్రైవ్ షాట్ ఆడటాన్ని మానేసాడు. ఇప్పుడు కోహ్లీ కూడా అదే బాటలో నడవాలి.'అని మాథ్యూ హెడెన్ చెప్పుకొచ్చాడు.

Story first published: Wednesday, December 25, 2024, 14:57 [IST]
Other articles published on Dec 25, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+