టీ20 ప్రపంచకప్‌లో ఆ సన్‌రైజర్స్ బౌలర్ సేవలను కోల్పోయాం.. లేకుంటే.. : రవిశాస్త్రి

న్యూఢిల్లీ: సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ పేసర్ టీ నటరాజన్‌పై టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ప్రశంసల జల్లు కురిపించాడు. అతను యార్కర్ల స్పెషలిస్ట్ అని కొనియాడాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో నటరాజన్ అద్భుత ప్రదర్శన కనబర్చిన విషయం తెలిసిందే. అద్భుత బౌలింగ్‌తో రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలోనే ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్‌ఫోతో మాట్లాడిన రవిశాస్త్రి నట్టూను ప్రత్యేకంగా అభినందించాడు. టీ20 ప్రపంచకప్‌లో నటరాజన్ సేవలను భారత జట్టు కోల్పోయిందని లేకుంటే ఫలితాలు మరోలా ఉండేవని చెప్పుకొచ్చాడు.

నట్టూ ఉంటెనా.?
'టీ20 ప్రపంచకప్‌లో నటరాజన్ సేవలను కోల్పోయాం. అతడు ఫిట్‌గా ఉంటే ఖచ్చితంగా జట్టులో ఉండేవాడు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో నటరాజన్ గాయపడ్డాడు. అతను స్పెషలిస్ట్ డెత్ బౌలర్. యార్కర్లను అద్భుతంగా వేయగలడు. అతను తన పేస్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లకు ముప్ప తిప్పలు పెడతాడు. నేను అతన్ని ఎంపిక చేసిన ప్రతీ మ్యాచ్‌లోనూ భారత్ విజయం సాధించింది. అతని అరంగేట్ర టీ20 మ్యాచ్‌లోను భారత్ గెలుపొందింది. అదే విధంగా అతపి టెస్టు అరంగేట్రంలోను టీమిండియా విజయం సాధించింది. నటరాజన్ నెట్ బౌలర్ నుంచి ఈ స్థాయికి ఎదగడం నిజంగా గర్వించ దగ్గ విషయం" అని రవిశాస్త్రి ప్రశంసించా

ఫామ్‌లోకి వచ్చిన యార్కర్ల కింగ్..
గతేడాది స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో నటరాజన్ మోకాలికి గాయమైంది. దాంతో టీ20 ప్రపంచకప్‌కు నటరాజన్ దూరమయ్యాడు. అయితే అతను ప్రస్తుతం పూర్తి ఫిట్‌నెస్ సాధించి ఐపీఎల్‌లో అడుగుపెట్టాడు. రాజస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో తేలిపోయిన ఈ తమిళనాడు స్టార్.. లక్నోతో జరిగిన తాజా మ్యాచ్‌లో సత్తా చాటాడు. రెండు కీలక వికెట్లతో పాటు పొదుపుగా బౌలింగ్ చేశాడు. అయితే పేలవ బ్యాటింగ్ కారణంగా ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌కు ఓటమి తప్పలేదు.

చెలరేగాలి...
రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌కు ముందు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి రవిశాస్త్రి కీలక సలహాలిచ్చాడు. స్పిన్నర్లు అయిన అశ్విన్, చాహల్ బౌలింగ్‌లో దూకుడుగా ఆడాలని చెప్పాడు. స్పిన్నర్లపై పైచేయి సాధించేందుకు కోహ్లీ స్విప్ షాట్లు ఆడాలన్నాడు. కోహ్లీ స్వీప్ షాట్లు ఆడలేడనే ఉద్దేశంతో దానికి తగ్గట్లు ఫీల్డ్ పెడతారని అభిఫ్రాయపడ్డాడు. కానీ ఒక్క సారి స్వీప్ షాట్లు ఆడడం మొదలు పెడితే బౌలర్ ఎవరనే సంగతి అవసరం లేకుండా చెలరేగవచ్చని కోహ్లీకి సలహా ఇచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications