రోహిత్ శర్మకు రెస్ట్ ఎందుకు? అతను ఏం ఆడాడని: రవిశాస్త్రి

ముంబై: సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ నుంచి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు విరామం ఇవ్వడాన్ని మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి తప్పుబట్టాడు. విశ్రాంతి ఇవ్వాల్సినంత క్రికెట్ హిట్ మ్యాన్ ఆడలేదని, అతనికి రెస్ట్ అవసరం లేదని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ 2022 సీజన్ ముగిసిన వెంటనే సొంతగడ్డపై సౌతాఫ్రికాతో జరగనున్న ఐదు టీ20ల సిరీస్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) 18 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది. ఈ జట్టు వివరాలను చేతన్ శర్మ నేతృత్వంలోని భారత సెలెక్షన్ కమిటీ ఆదివారం వెల్లడించింది. జమ్ముకశ్మీర్ పేస్ బౌలింగ్ సంచలనం ఉమ్రాన్ మాలిక్, పంజాబ్ కింగ్స్ డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ అర్షదీప్ సింగ్‌కు అవకాశం దక్కగా.. రోహిత్ శర్మతో పాటు సీనియర్ ఆటగాళ్లందరికి విశ్రాంతి పేరిట ఈ సిరీస్‌కు ఎంపిక చేయలేదు.

గాయాలతో జట్టుకు దూరంగా ఉన్నాడు..
ఇక ఐపీఎల్ 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ దారుణంగా విఫలమయ్యాడు. కనీసం తన స్థాయికి తగ్గ ప్రదర్శన కూడా చేయలేదు.
అతను ఆడిన 14 మ్యాచ్‌ల్లో కేవలం 19.14 సగటుతో 268 పరుగులే చేశాడు. అందులో ఒక్క అర్ధశకతం కూడా లేదు. ఇక అత్యుత్తమ స్కోర్ 48 పరుగులే. ఈ నేపథ్యంలోనే రోహిత్‌పై స్పందించిన రవిశాస్త్రి.. హిట్‌మ్యాన్‌కు విరామం ఇవ్వాల్సిది కాదన్నాడు. 'రోహిత్‌కు విరామం అవసరం లేదు. మరోవైపు కోహ్లీ విషయానికి వస్తే.. అతను ఏడాదిన్నరకుపైగా ఫార్మాట్లకు అతీతంగా క్రికెట్ ఆడుతున్నాడు.

కోహ్లీకి రెస్ట్ అవసరం..
రోహిత్ గాయాల కారణంగా కొన్ని సందర్భాల్లో భారత జట్టుకు దూరంగా ఉన్నాడు. గతేడాది టీ20 ప్రపంచకప్ తర్వాత అతను ఆస్ట్రేలియా పర్యటనకు సగంలోనే వెళ్లాడు. ఆ తర్వాత సౌతాఫ్రికా పర్యటనకు మొత్తానికే దూరమయ్యాడు. కోహ్లీ విషయంలో అలా జరగలేదు. ముంబై ప్లేఆఫ్స్ నుంచి నిష్క్రమించాక సుమారు రెండు వారాలు సమయం ఉంటుంది. ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లేముందు అతనికి ఈ విరామం చాలు' అని రవిశాస్త్రి ఓ స్పోర్ట్స్ చానెల్‌తో చెప్పాడు. కాగా, ఇదే ఐపీఎల్ 2022 సీజన్ కోహ్లీ ఫామ్‌లో లేక ఇబ్బందులు పడుతున్న వేళ శాస్త్రి స్పందిస్తూ.. అతనికి కొద్ది కాలం విశ్రాంతి అవసరమని చెప్పిన విషయం తెలిసిందే.

కెప్టెన్‌గా రాహుల్..
కెప్టెన్ రోహిత్ శర్మ ఈ సిరీస్‌కు విశ్రాంతి తీసుకోవడంతో కేఎల్ రాహుల్ జట్టును నడిపించనున్నాడు. పూర్తి ఫిట్‌నెస్ సాధించి ఐపీఎల్‌లో రాణిస్తోన్న ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తిరిగి జట్టులోకి రాగా.. ఈ సీజన్‌లో తన ఫినిషింగ్ నైపుణ్యంతో ఆకట్టుకున్న వెటరన్ ప్లేయర్ దినేశ్ కార్తీక్ 36 ఏళ్ల వయసులో పునరాగమనం చేశాడు.
సౌతాఫ్రికాతో బరిలోకి దిగే టీ20 జట్టు: కేఎల్ రాహుల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, వెంకటేశ్ అయ్యర్, యుజ్వేంద్ర చాహల్, కుల్‌దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్, హర్షల్ పటేల్, అవేష్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications