Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ ఆర్‌సీబీ హిట్టర్‌‌కు భారత టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు ఖాయం: రవి శాస్త్రి

Ravi Shastri says Dinesh Karthik Will Make A Great Comeback In India’s T20 World Cup Team

న్యూఢిల్లీ: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) నయా ఫినిషర్, టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్‌పై మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ప్రశంసల జల్లు కురిపించాడు. ఐపీఎల్ 2022 సీజన్‌లో దినేశ్ కార్తీక్.. ఆర్‌సీబీ తరఫున అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడని కొనియాడాడు. ఈ ఫామ్ ఇలానే కొనసాగితే అతను టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదన్నాడు. ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది చివర్లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో మ్యాచ్‌ ఫినిషర్‌ పాత్రలో దినేశ్ కార్తీక్ టీమిండియాకు ఎంపికవుతాడని అభిప్రాయపడ్డాడు.

ధోనీ స్థానం ఖాళీ ఉండటంతో...

ధోనీ స్థానం ఖాళీ ఉండటంతో...

టీమిండియాలో ధోనీ తర్వాత ఆ స్థాయి ఫినిషర్‌ కనబడలేదని, దినేశ్‌ కార్తీక్‌ ధోనీలా ఫినిషర్‌ పాత్రను తప్పక న్యాయం చేస్తాడని అభిప్రాయపడ్డాడు. అయితే జట్టులోని యువ వికెట్ కీపర్ల నుంచి అతనికి తీవ్ర పోటీ ఎదురవుతుందన్నాడు.'ప్రస్తుతం టీమిండియా సీనియర్ ప్లేయర్ దినేశ్ కార్తీక్ అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. ప్రస్తుత టీ20 లీగ్‌లో గొప్పగా రాణిస్తున్నాడు. క్రీజులోకి వచ్చిన వెంటనే ఎదురుదాడికి దిగుతున్నాడు. అతనికున్న అనుభవాన్ని అంతా కూడగట్టి అలవోకగా షాట్లు ఆడుతున్నాడు. మేటి ఫినిషర్‌‌గా పేరున్న ధోనీ కూడా ప్రస్తుతం జట్టులో లేడు.

యువ ఆటగాళ్ల నుంచి తీవ్ర పోటీ..

యువ ఆటగాళ్ల నుంచి తీవ్ర పోటీ..

ధోనీ అంతర్జాతీ క్రికెట్ నుంచి తప్పుకొన్నప్పటి నుంచి ఆ స్థానం ఖాళీగానే ఉంది. అందుకే, మ్యాచ్ ఫినిషర్‌గా దినేశ్ కార్తిక్‌ను జట్టులోకి తీసుకోవాలి. కానీ, అదే సమయంలో జట్టులో ఎంత మంది కీపర్లు ఉన్నారనే విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఇప్పటికే రిషభ్ పంత్, ఇషాన్ కిషన్ వంటి యువ వికెట్ కీపర్లు అందుబాటులో ఉన్నారు. ప్రస్తుతం కార్తిక్ కూడా వారికి పోటీ ఇస్తున్నాడు. వీరిద్దరిలో ఎవరైనా గాయపడి జట్టుకు దూరమైతే.. అప్పుడు కార్తిక్‌కు అవకాశం దొరుతకుంది.'అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.

సూపర్ బ్యాటింగ్‌తో కార్తీక్..

సూపర్ బ్యాటింగ్‌తో కార్తీక్..

సంజూ శాంసన్ కూడా రాణిస్తున్న నేపథ్యంలో భాతర జట్టులో ఎవరికి చోటుదక్కుతుందో చూడాలన్నాడు. ఈ సీజన్‌లో ఆర్‌సీబీకి ఆడుతున్న దినేశ్ కార్తీక్ అద్భుత బ్యాటింగ్‌తో చెలరేగుతున్నాడు. ఈ జట్టు తరఫున ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచుల్లో.. 44 బంతులు ఎదుర్కొన్న కార్తిక్ 204.5 స్ట్రైక్‌రేట్‌తో 90 పరుగులు చేశాడు. తొలి మ్యాచ్‌లో 14 బంతుల్లో 32, రెండో మ్యాచ్‌లో 7 బంతుల్లో 14, మూడో మ్యాచ్‌లో 23 బంతుల్లో 44 పరుగులు చేసిన విషయం తెలిసిందే.

Story first published: Saturday, April 9, 2022, 18:15 [IST]
Other articles published on Apr 9, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+