Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆసీస్‌ను క్లీన్ స్వీప్ చేస్తే.. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ భారత్‌దే: రవి శాస్త్రి

Ravi Shastri says A 4-0 Win Will Have An Impact Against Australia In WTC Final

న్యూఢిల్లీ: సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని టీమిండియా 4-0తో క్లీన్ స్వీప్ చేస్తే వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను కూడా అందుకుంటుందని మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి అన్నాడు. ఇంగ్లండ్ పరిస్థితులు ఆస్ట్రేలియాకు అనుకూలంగా ఉన్నా.. భారత ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం ముందు అది పనికిరాదన్నాడు. రవి శాస్త్రి పర్యవేక్షణలోని టీమిండియా మొట్టమొదటి టెస్టు ఛాంపియన్‌ షిప్ టైటిల్‌ను తృటిలో చేజార్చుకున్న విషయం తెలిసిందే. ఇంగ్లండ్ వేదికగా జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్‌ చేతిలో భారత్ ఓడింది. మరోసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌ చేరే అవకాశం టీమిండియాకు లభించింది.

బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో ఇప్పటికే వరుసగా రెండు టెస్టుల్లో విజయం సాధించిన భారత్.. మరో మ్యాచ్‌లో విజయం సాధించినా.. చివరి రెండు టెస్ట్‌లను డ్రా చేసుకున్నా డబ్ల్యూటీసీ ఫైనల్‌ బెర్త్ ఖరారు చేసుకుంటుంది. ఈ క్రమంలోనే డబ్ల్యూటీసీ ఫైనల్ ఫలితంపై రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
బోర్డర్-గవాస్కర్‌ ట్రోఫీని టీమిండియా 4-0 తేడాతో క్లీన్‌స్వీప్‌ చేస్తే డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆసీస్‌తో తలపడినా భారత్‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని జోస్యం చెప్పాడు.

'బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీని టీమిండియా 4-0 తేడాతో క్లీన్‌స్వీప్‌ చేస్తే అది ప్రత్యర్థిపై మానసికంగా తీవ్ర ప్రభావం చూపుతుంది. కానీ, ఇంగ్లండ్‌లో పరిస్థితులు టీమిండియాకు అనుకూలంగా ఉండవు. అక్కడి పరిస్థితులు ఆసీస్‌కు అనుకూలంగా ఉంటాయి. ఎందుకంటే గాయాలపాలై జట్టుకు దూరమైన ఆస్ట్రేలియా ఫాస్ట్‌బౌలర్లు జట్టుకు అందుబాటులోకి వస్తారు. కానీ, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ క్లీన్‌స్వీప్‌ విజయం ఇంగ్లండ్‌ వంటి కఠిన పరిస్థితుల్లో కూడా ఆసీస్‌ను ఓడించగలమనే ఆత్మవిశ్వాసం భారత్‌కు ఇస్తుంది.' అని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు.

జూన్‌లో లండన్‌లోని ఓవల్ మైదానం వేదికగా డబ్ల్యూటీసీ ఫైనల్‌ జరగనుంది. ప్రస్తుత పాయింట్స్ టేబుల్ ప్రకారం ఫైనల్లో ఆసీస్, భారత్ మాత్రమే తలపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ ఆసీస్ భారత్‌తో చివరి రెండు టెస్ట్‌లు ఓడి.. శ్రీలంక న్యూజిలాండ్ జరిగే సిరీస్‌ను 2-0తో గెలిస్తే ఆ జట్టుకు అవకాశం ఉంటుంది. బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ సైతం.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని టీమిండియా 4-0తో గెలుస్తుందని చెప్పాడు. సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం ఆసీస్ వల్ల కాదన్నాడు.

Story first published: Sunday, February 26, 2023, 12:26 [IST]
Other articles published on Feb 26, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+