Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అందుకే కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించాడు: రవి శాస్త్రి

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్‌ అందర్నీ ఆశ్చర్యపరిచింది. ప్రపంచంలోనే అత్యంత ఫిట్టెస్ట్ క్రికెటర్ అయిన విరాట్ కోహ్లీ.. మరో 2-3 ఏళ్లు ఆడుతాడని అంతా అనుకున్నారు. కానీ అతను సడెన్‌గా రిటైర్మెంట్‌ ప్రకటించి అందర్నీ షాక్‌కు గురి చేశాడు. బీసీసీఐ తీరు వల్లే కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించాడని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోహ్లీ రిటైర్మెంట్‌పై అనేక ఊహాగానాలు వెలువడ్డాయి. కానీ అసలు కారణం ఏంటో ఎవరికి తెలియదు.

విరాట్ కోహ్లీకి అత్యంత సన్నిహితంగా ఉండే టీమిండియా మాజీ క్రికెటర్ రవి శాస్త్రి కూడా.. అతని రిటైర్మెంట్‌ షాక్‌కు గురిచేసిందని చెప్పాడు. మరో రెండు మూడేళ్లు ఆడాల్సిన సత్తా కోహ్లీకి ఉన్నా.. మానసికంగా బాగా అలసిపోవడంతో ఆటకు వీడ్కోలు పలికాడని చెప్పాడు. కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటనకు ముందు అతనితో మాట్లాడినట్లు కూడా రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు.

Ravi Shastri Reveals the Reason Behind Virat Kohli s Test Retirement

'కోహ్లీ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించడానికి వారం రోజుల ముందు అతనితో మాట్లాడాడు. ఆటలో రాణించాల్సినంత రాణించాననే స్పష్టతతో కోహ్లీ ఉన్నాడు. రిటైర్మెంట్ ప్రకటించినందుకు కోహ్లీలో ఎలాంటి బాధ లేదు. చాలా సంతోషంగా ఆటకు వీడ్కోలు పలికాడు. అతని నిర్ణయం నన్ను షాక్‌కు గురి చేసింది. అతనిలో మరో రెండు, మూడేళ్లు ఆడే సత్తా ఉంది. శారీరకంగా కూడా ఫిట్‌గా ఉన్నాడు. కానీ మానసికంగా బాగా అలసిపోయాడు.

సాధారణంగా ఓ ఆటగాడు తన బాధ్యతను పూరి చేసి ప్రశాంతంగా ఉంటాడు. కోహ్లీ మాత్రం జట్టు బరిలోకి దిగినప్పుడు.. అన్ని వికెట్లు తానే తీయాలి, అన్ని క్యాచ్‌లు తానే పట్టాలి, అన్ని నిర్ణయాలు తానే తీసుకోవాలి అన్నట్లు వ్యవహరిస్తాడు. ఆట తీవ్రత ఆ స్థాయిలో ఉంటే మానసికంగా అలసిపోక తప్పదు.'అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు.

Story first published: Friday, May 16, 2025, 14:18 [IST]
Other articles published on May 16, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+