Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీకి అహంకారం ఎక్కువ: రవిశాస్త్రి

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రిల బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రవిశాస్త్రి మేనేజర్‌గా ఉన్న సమయంలోనే విరాట్ కోహ్లీ టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. ఆ తర్వాత హెడ్ కోచ్‌గా కూడా కొనసాగాడు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో టీమిండియా టెస్ట్ ఫార్మాట్‌లో అద్భుతమైన విజయాలు సాధించింది.

IND vs AFG: గాయంతో కోహ్లీ ఔట్.. ఆ ముగ్గురిలో ఒకరికి ఛాన్స్!

IND vs AFG: గాయంతో కోహ్లీ ఔట్.. ఆ ముగ్గురిలో ఒకరికి ఛాన్స్!

అయితే తాజాగా విరాట్ కోహ్లీపై రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీ అహంకారి, అతి గారాబంతో పెరిగిన పిల్లాడు అంటూ పెట్టిన ఓ పోస్ట్‌పై రవిశాస్త్రి తనదైన శైలిలో స్పందించాడు. విరాట్ కోహ్లీ అహంకారేనని అంగీకరించిన రవిశాస్త్రి.. అది మైదానం వరకేనని స్పష్టం చేశాడు. ఆఫ్‌ది ఫీల్డ్‌లో విరాట్ కోహ్లీ భిన్నంగా ఉంటాడని చెప్పాడు.

Ravi Shastri Reveals the Only Situation Where Virat Kohli Displays Extreme Arrogance

'అవును.. విరాట్ కోహ్లీ అహంకారి. అతి గారాబంగా పెరిగిన పిల్లాడు. మితిమీరిన ప్రవర్తన కలిగిన వ్యక్తి. ఉద్రేకంగా ఉంటాడు. ఇవన్నీ నిజమే. కానీ, ఇలా ఉండేది మాత్రం మైదానంలోనే. ఒక్కసారి గేమ్ నుంచి బయటకు వచ్చాక పూర్తి భిన్నంగా ఉంటాడు. మైదానంలో దూకుడుగా ఉండి.. బయట సాధారణంగా ఉండే వ్యక్తులంటే నాకు చాలా ఇష్టం.'అని రవిశాస్త్రి తెలిపాడు.

ఐపీఎల్ 2026 సీజన్‌ ఫైనల్లో తొడ కండరాల గాయానికి గురైన విరాట్ కోహ్లీ.. అఫ్గానిస్థాన్‌తో మూడు వన్డేల సిరీస్‌కు దూరమయ్యాడు. గాయంతోనే ఐపీఎల్ ఫైనల్లో విరాట్ కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు. గాయం నుంచి వేగంగా కోలుకుంటున్న కోహ్లీ.. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. టీ20, టెస్ట్ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లీ.. కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్నాడు. వన్డే ప్రపంచకప్ 2027 ఆడటమే లక్ష్యంగా పెట్టుకున్నాడు.

కేన్ మామ రిటైర్మెంట్.. విరాట్ కోహ్లీ భావోద్వేగం

కేన్ మామ రిటైర్మెంట్.. విరాట్ కోహ్లీ భావోద్వేగం
Story first published: Monday, June 15, 2026, 16:48 [IST]
Other articles published on Jun 15, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+