ఆ ఒక్కసారే కోహ్లీని మందలించాను: రవి శాస్త్రి (వీడియో)
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి గాడ్ ఫాదర్ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 2014లో మొదలైన ఈ ఇద్దరి బంధం 2021 టీ20 ప్రపంచకప్ ఓటమి వరకు కొనసాగింది. టీమ్ మేనేజర్‌గా.. హెడ్ కోచ్‌గా విరాట్ కోహ్లీకి రవిశాస్త్రి అండగా నిలిచాడు.
అయితే ఈ ఏడేళ్ల వ్యవధిలో తాను విరాట్ కోహ్లీని ఒకే ఒక్కసారి మందలించానని తాజాగా రవి శాస్త్రి చెప్పుకొచ్చాడు. 2014 ఆస్ట్రేలియా పర్యటనలోని బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో గొడవపడకుండా బ్యాటింగ్‌పై ఫోకస్ పెట్టాలని చెప్పినట్లు తాజాగా గుర్తు చేసుకున్నాడు.
బ్యాట్‌తోనే బదులిచ్చాడు..
విరాట్ కోహ్లీకి ఆస్ట్రేలియా ఆటగాళ్లతో తెలియని శతృత్వం ఉంటుంది. వారి స్లెడ్జింగ్‌ను ఏ మాత్రం సహించని కోహ్లీ అదే స్థాయిలో తిప్పికొడుతాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026 సీజన్‌లో ఆస్ట్రేలియా క్రికెటర్ ట్రావిస్ హెడ్‌తోనూ వాగ్వాదం జరగ్గా.. కోహ్లీ ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు.
అయితే మైదానంలో జరిగే ఘర్షణలను కోహ్లీ ఎప్పుడూ తన బ్యాటింగ్‌కు ఇంధనంగా మార్చుకున్నాడు. ప్రత్యర్థి ఆటగాళ్లు రెచ్చగొట్టిన ప్రతీసారి విధ్వంసకర బ్యాటింగ్‌తో బదులిచ్చాడు.

ఒక్కసారే అడ్డుకున్నా..
2014-15 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మిచెల్ జాన్సన్‌తో జరిగిన గొడవలో విరాట్ కోహ్లీ శృతి మించకుండా తాను జోక్యం చేసుకున్నానని రవిశాస్త్రి గుర్తు చేసుకున్నాడు. విరాట్ కోహ్లీకి చెందిన లైఫ్‌స్టైల్ బ్రాండ్ 'వన్8' కోసం నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో రవిశాస్త్రి ఈ విషయాన్ని వెల్లడించాడు. ఈ పాడ్‌కాస్ట్‌లో కోహ్లీ కూడా పాల్గొనగా.. రవి శాస్త్రి వ్యాఖ్యలకు అతను చిరునవ్వులు చిందించాడు.
'విరాట్ కోహ్లీ ఆన్‌ఫీల్డ్ వార్స్‌లో నేనెప్పుడూ జోక్యం చేసుకోలేదు. కానీ ఒకే ఒక్కసారి కోహ్లీని అడ్డుకున్నాను. అది మెల్‌బోర్న్ టెస్ట్ అనుకుంటా. ఆ మ్యాచ్‌లో కోహ్లీ ఎదుర్కొన్న తొలి బంతికే మిచెల్ జాన్సన్ బౌన్సర్‌తో తలకి కొట్టాడు. దాంతో ఇద్దరి మధ్య మాటల యుద్దం నడిచింది.
లంచ్ సమయానికి కోహ్లీ మంచి ఫామ్‌లోకి వచ్చాడు. ఇద్దరూ ఒకరినొకరు దూషించుకుంటూనే ఉన్నారు. కోహ్లీ డ్రెస్సింగ్ రూమ్‌లోకి వస్తూ కూడా మిచెల్ జాన్సన్‌వైపు అలాగే కోపంగా చూస్తూ కనిపించాడు. అప్పుడు నేను అతడిని.. ఇక్కడికి రా.. నీ బ్యాటింగ్‌పై దృష్టి పెట్టు అని చెప్పాల్సి వచ్చింది. ఆ రోజులను తలచుకుంటే ఇప్పటికీ కొన్నిసార్లు ఒళ్ళు గగుర్పొడుస్తుంది.'అని రవి శాస్త్రి వివరించగా కోహ్లీ నవ్వేశాడు.
కోహ్లీ కెరీర్‌లోనే అత్యుత్తమ సిరీస్..
ఆ బోర్డర్-గవాస్కర్ సిరీస్ కోహ్లీ కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన టెస్ట్ పర్యటనల్లో ఒకటిగా నిలిచింది. ఆ సిరీస్‌ను ఆస్ట్రేలియా గెలుచుకున్నప్పటికీ.. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్‌గా విరాట్ కోహ్లీకి గుర్తింపు దక్కింది. భారత భవిష్యత్తు సారథిగా కోహ్లీ ఎదగడానికి ఈ పర్యటనే పునాది వేసింది.
ఆ పర్యటనలో నాలుగు టెస్ట్‌ల్లో విరాట్ కోహ్లీ 86.50 సగటుతో 692 పరుగులు చేశాడు. 8 ఇన్నింగ్స్‌ల్లో 169 పరుగుల అత్యధిక స్కోర్‌తో సహా నాలుగు సెంచరీలు బాదాడు. ఆస్ట్రేలియా పర్యటన అంటేనే కోహ్లీకి పునకాలు వస్తాయి. అక్కడి అభిమానులు, ఆటగాళ్లతో ఉన్న శత్రుత్వం విరాట్ కోహ్లీ అత్యుత్తమ ఆటను బయటకు తీయడానికి ఉపయోగపడ్డాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

