'విరామం తీసుకోవడం మంచిదే.. ధోనీ ఆడాలనుకుంటే ఎవరూ ఆపలేరు'

చెన్నై: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ క్రికెట్ ఆట నుంచి విరామం తీసుకోవడం మంచిదే. విరామం తర్వాత అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు అతడి శరీరం సహకరిస్తుందో లేదో ఆయనకే తెలుసు. ఒకవేళ ధోనీ ఆడాలనుకుంటే ఎవరూ ఆపలేరు అని టీమిండియా కోచ్ రవిశాస్త్రి అన్నారు. తాజాగా ఇండియా టుడే కార్యక్రమం 'ఇన్‌స్పైర్'లో రవిశాస్త్రి మాట్లాడారు. బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ మధ్య సత్సంబంధాలు లేవన్న వార్తలను ఆయన తోసిపుచ్చారు.

విరామం మంచిదే
రవిశాస్త్రి మాట్లాడుతూ... ''ధోనీ క్రికెట్ నుండి విరామం తీసుకోవడం మంచిదే. ఐపీఎల్ సమయానికి తిరిగి బ్యాట్ పట్టుకుంటాడు. వన్డేలపై మహీకి ఆసక్తి లేదని నా అభిప్రాయం. టెస్టు క్రికెట్‌కు ఎప్పుడో వీడ్కోలు పలికాడు. ఇక టీ20లే అవకాశం. విరామం తర్వాత క్రికెట్ ఆడేందుకు అతడి శరీరం సహకరిస్తుందో లేదో మహీకే తెలుసు' అని అన్నారు.

ఆడాలనుకుంటే ఎవరూ ఆపలేరు
'ఏ ఆటగాడు అయినా.. విశ్రాంతి వల్ల శారీరకంగా, మానసికంగా మెరుగవుతారు. మానసిక అలసట దూరం అవుతుంది. ధోనీ 2020 ఐపీఎలో ఆడుతాడు. ధోనీ ప్రశాంత మనస్సుతో సాధన చేస్తే రాబోయే టీ20 వరల్డ్‌కప్‌లో అతన్ని ఎవరూ ఆపలేరు' అని రవిశాస్త్రి స్పష్టం చేశారు. ధోనీ 2019 ప్రపంచకప్ సెమీఫైనల్‌లో ఓటమి తర్వాత ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు. రెండు వారాల పాటు మిలిటరీలో శిక్షణ తీసుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

గంగూలీ అంటే గౌరవం
'భారత జట్టుకు గంగూలీ చేసిన సేవ కారణంగా అతడిపై నాకు ఎంతో గౌరవం ఉంది. ఫిక్సింగ్ ఉదంతంతో జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో సారథ్యం చేపట్టాడు. గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడు అయిన వార్తను చూసిన క్షణం ఎంతో సంతోషించా. గంగూలీ అంటే గౌరవం, ఇది అర్థం చేసుకోలేని వాళ్లను పట్టించుకోను' అని రవిశాస్త్రి పేర్కొన్నారు.
టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ.. రాహుల్, కోహ్లీ ఔట్!!

పని లేని వాళ్లే ఎక్కువ మాట్లాడుతుంటారు
'నేనేం చేసేందుకు ఇక్కడ ఉన్నానో అదే చేస్తున్నా. నా అభిమానులకు అదే చెప్పాలనుకుంటున్నా. విమర్శలు చేసే వాళ్లు ఎప్పుడూ ఊరికే ఉండలేదు. పని లేని వాళ్లే ఎక్కువ మాట్లాడుతుంటారు' అని శాస్త్రి చెప్పుకొచ్చారు. 2016లో టీమిండియా కోచ్ ఎంపిక సమయంలో అప్పటి సీఏసీ సభ్యుడు గంగూలీకి, పదవికి దరఖాస్తు చేసుకున్న రవిశాస్త్రికి మధ్య వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications