Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ.. రాహుల్, కోహ్లీ ఔట్!!

India vs West Indies: Kohli-Rahul Out, Sheldon Cottrell strikes twice to hurt India

చెన్నై: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియంలో భారత్‌-వెస్టిండీస్‌ జట్ల మధ్య మొదటి వన్డే ప్రారంభం అయింది. ఈ వన్డేలో టీమిండియాకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్ బౌలర్ షెల్డాన్‌ కాట్రెల్‌.. ఆదిలోనే కీలక బ్యాట్స్‌మెన్‌ను పెవిలియన్ చేర్చి టీమిండియాను భారీ దెబ్బ కొట్టాడు.

ఏడో ఓవర్ మూడో బంతికి ఓపెనర్ కేఎల్ రాహుల్ (6) పెవిలియన్ చేరాడు. బంతిని అంచనా వేయడంలో విఫలమయిన రాహుల్.. షిమ్రాన్‌ హెట్‌మెయిర్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ (4) కూడా త్వరగానే పెవిలియన్ చేరాడు. ఓ బౌండరీ బాది జోరుమీద కనిపించిన కోహ్లీ బోల్డ్ అయ్యాడు. ఏడో ఓవర్ చివరి బంతి కోహ్లీ బ్యాట్ ఎడ్జ్ తీసుకుని వికెట్లను గిరాటేసింది. దీంతో కీలక రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా కష్టాలో పడింది.

మరో ఓపెనర్ రోహిత్ శర్మ మాత్రం నిలకడగా ఆడుతున్నాడు. శ్రేయస్‌ అయ్యర్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నిర్మించేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. రోహిత్ నాలుగు బౌండరీలు బాది విండీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటున్నాడు. మరోవైపు క్రీజులోకి వచ్చిన అయ్యర్‌ కుదురుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. భారత్ 12 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 46 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ (21), శ్రేయస్‌ అయ్యర్‌ (11)లు ఉన్నారు. విండీస్ బౌలర్ కాట్రెల్ రెండు వికెట్లను తీసుకున్నాడు.

టాస్ గెలిచిన విండీస్ కెప్టెన్ కీరన్‌ పొలార్డ్‌ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం​ చేసిన యువ ఆల్‌ రౌండర్‌ శివం దూబే.. వెస్టిండీస్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌ ద్వారా ఈ ఫార్మాట్‌లో అరంగేట్రం చేశాడు. విండీస్‌తో టీ20 సిరీస్‌లో దూబే ఆకట్టుకోవడంతో వన్డేల్లో ఎంపికకు మార్గం సుగమం అయ్యింది. ఇక మయాంక్‌ అగర్వాల్‌కు అవకాశం ఇవ్వని మేనేజ్‌మెంట్‌ కేఎల్‌ రాహుల్‌ను జట్టులోకి తీసుకుంది.

Story first published: Sunday, December 15, 2019, 14:41 [IST]
Other articles published on Dec 15, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+