Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధోనీ, రోహిత్ కాదు.. నేను చూసిన అత్యుత్త కెప్టెన్ అతనే: రవి శాస్త్రి

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి ప్రశంసల జల్లు కురిపించాడు. తాను చూసిన అత్యుత్తమ కెప్టెన్, బ్యాటర్ విరాట్ కోహ్లీనేనని తెలిపాడు. అటు బ్యాటర్‌గా.. ఇటు కెప్టెన్‌గా కోహ్లీ అద్భుతాలు చేశాడని కొనియాడాడు. ధోనీ తర్వాత టీమిండియాను ముందుకు తీసుకెళ్లడంతో కోహ్లీదే కీలక పాత్ర అని చెప్పాడు. ఒక్క ఐసీసీ టైటిల్ గెలవకపోయినా.. సారథిగా విరాట్ కోహ్లీ అసాధారణ విజయాలు అందించాడని గుర్తు చేశాడు.

విరాట్ కోహ్లీ సారథ్యంలో టీమిండియా 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, 2019 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్, డబ్ల్యూటీసీ 2021 ఫైనల్ చేరి తృటిలో టైటిల్ కోల్పోయింది. టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక విజయాలు అందించిన భారత కెప్టెన్‌గా కోహ్లీ చరిత్రకెక్కాడు. అయితే అతని కెప్టెన్సీలో ఐసీసీ టైటిల్ గెలవకపోవడం లోటుగా మిగిలింది. ఈ కారణంతోనే సారథ్య బాధ్యతల నుంచి కోహ్లీ తప్పుకోగా.. రోహిత్ శర్మ కెప్టెన్‌గా టీ20 ప్రపంచకప్ 2024తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టైటిల్ అందించాడు.

Ravi Shastri Names Virat Kohli as the Best Player He Ever Coached Praises His Unbelievable Innings

కోహ్లీ.. అత్యుత్తమ కెప్టెన్

తాజాగా ఓ ఇంటర్వ్యూలో విరాట్ కోహ్లీ గురించి మాట్లాడిన రవి శాస్త్రి అతనిపై ప్రశంసల జల్లు కురిపించాడు. 'విరాట్ కోహ్లీ బ్యాటర్‌గా.. కెప్టెన్‌గా అద్భుతాలు చేశాడు. టీమిండియాను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లాడు. టెస్ట్ ఫార్మాట్ ఐదేళ్ల పాటు టీమిండియా వరల్డ్ నెంబర్ వన్ జట్టుగా ఉందంటే దానికి కోహ్లీ పట్టుదలే కారణం. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ పర్యటనల్లో అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. నేను చూసి అద్భుత సారథుల్లో కోహ్లీ ఒకడు. కోహ్లీతో కలిసి జట్టును నడిపించే అవకాశం నాకువచ్చింది. ధోనీ తర్వాత టీమిండియాను ముందుకు తీసుకెళ్లడంలో కోహ్లీదే కీలక పాత్ర. బ్యాటర్‌గానూ ఆధిపత్యం చెలాయించే అతని సామర్థ్యం, దూకుడుగా ఉండటం, గెలవాలనే కసి, ఆటను ముందుకు తీసుకెళ్లాలనే కోరిక అసాధారణమైనవి.

టైటిల్ గెలవకున్నా..

ఐసీసీ టోర్నీల్లో విజేతగా నిలవనంత మాత్రాన బాధ పడక్కర్లేదు. ఇక్కడ అదృష్టం కూడా కలిసి రావాల్సిన అవసరం ఉంది. ఐసీసీ టైటిల్ గెలిచే సత్తా మా జట్టుకు ఉన్నప్పటికీ మాకు కలిసి రాలేదు. అయినప్పటికీ మేం గొప్ప క్రికెట్ ఆడాం. హెడ్ కోచ్‌గా నాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు'అని రవి శాస్త్రి చెప్పుకొచ్చాడు. బెన్ స్టోక్స్‌కు ప్రత్యర్థిగా ఆడటం తనకు ఇష్టమని రవి శాస్త్రి తెలిపాడు.

ఈ తరంలో ఏ ఆటగాళ్లతో కలిసి ఆడుతారనే ప్రశ్నకు శాస్త్రి ఈ విధంగా బదులిచ్చాడు. ' బెన్ స్టోక్స్‌కు వ్యతిరేకంగా ఆడేందుకు నేను ఇష్టపడతాను. అతను ప్రపంచ స్థాయి ఆల్-రౌండర్. అతనితో పాటు చాలా మంది క్రికెటర్లు ఉన్నారు. మీరు ఆస్ట్రేలియా బౌలింగ్ యూనిట్‌ను చూస్తే - కమిన్స్, హాజిల్‌వుడ్, నాథన్ లయన్. నేను వారితో కలిసి ఎడమచేతి వాటం స్పిన్నర్‌గా ఆడి ఉండేవాడిని.'అని రవి శాస్త్రి చెప్పుకొచ్చాడు.

Story first published: Friday, August 15, 2025, 11:36 [IST]
Other articles published on Aug 15, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+