టెస్ట్ క్రికెట్‌లో టీమిండియా అత్యుత్తమ ఓపెనర్ ఎవరా? అని ప్రశ్నిస్తే ఎక్కువగా చెప్పే పేర్లు సునీల్ గవాస్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ. సునీల్ గవాస్కర్ టీమిండియా టెస్ట్ ఓపెనర్‌గా 34 శతకాలు నమోదు చేయడంతో పాటు 10,122 పరుగులు చేశాడు. దాంతో ఆయన్ని ఆల్‌టైమ్ టీమిండియా బెస్ట్ టెస్ట్ ఓపెనర్‌గా పరిగణిస్తారు.
ఆయన తర్వాత డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ను బెస్ట్ ఓపెనర్‌గా పేర్కొంటారు. ఎందుకంటే టెస్ట్‌ల్లో దూకుడుగా ఆడిన ఏకైక ఓపెనర్ అతనే. సిక్సర్లతో సెంచరీ, డబుల్ సెంచరీ, ట్రిపుల్ సెంచరీ సాధించిన ఏకైక బ్యాటర్ కూడా వీరేంద్ర సెహ్వాగే. అంతేకాకుండా అతను రెండు ట్రిపుల్ సెంచరీలు నమోదు చేశాడు.

ఈ తరం క్రికెట్‌లో రోహిత్ శర్మనే అత్యుత్త టెస్ట్ ఓపెనర్ అంటారు. సెహ్వాగ్ తరహాలో దూకుడుగా బ్యాటింగే చేసే రోహిత్ శైలిని అందరూ ఇష్టపడుతారు. సెహ్వాగ్, గవాస్కర్‌లా రోహిత్‌కు మెరుగైన రికార్డు లేకపోయినా.. వారికంటే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ అతనికి ఉంది.
అయితే రవి శాస్త్రి మాత్రం సునీల్ గవాస్కర్ తర్వాత టీమిండియా అత్యుత్తమ ఓపెనర్ మరళీ విజయ్ అని తరుచూ చెప్పేవాడని మాజీ బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ గుర్తు చేసుకున్నాడు. తాజాగా ఓ క్రికెట్ వైబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భరత్ అరుణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
'నన్ను ఆకట్టుకున్న యంగ్ బ్యాటర్ మురళీ విజయ్. చాలా చిన్న వయసు నుంచే మురళీ విజయ్ తెలుసు. నేను మొదటిసారిగా అతన్ని మా కాలేజీలో చూసాను. అతని ఆట నచ్చి ఓ డివిజన్ టీమ్‌కు కూడా నేను రికమెండ్ చేశాను. అప్పుడే క్రికెటర్‌గా అతని ప్రయాణం మొదలైంది. రవి శాస్త్రి సైతం సునీల్ గవాస్కర్ తర్వాత టీమిండియా అత్యుత్తమ టెస్ట్ ఓపెనర్ మురళీ విజయ్ అని తరుచూ చెప్పేవాడు.
ఇప్పటి వరకు అతనికి వచ్చిన అతి పెద్ద కాంప్లిమెంట్ ఇదే. నా ఫేవరేట్ ఆటగాళ్లలో మురళీ విజయ్ ఒకడు.'అని భరత్ అరుణ్ చెప్పుకొచ్చాడు. టీమిండియా హెడ్ కోచ్‌గా రవి శాస్త్రి ఉన్నప్పుడు భరత్ అరుణ్ బౌలింగ్ కోచ్‌గా పనిచేశాడు. భరత్ అరుణ్ కారణంగానే హైదరాబాద్ పేసర్ మహమ్మద్ సిరాజ్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చాడు.
ఇక మురళీ విజయ్ భారత్ తరఫున 61 టెస్ట్‌లు ఆడి 3982 పరుగులు చేశాడు. ఇందులో 12 శతకాలు ఉన్నాయి. భారత ఓపెనర్ల పరుగుల జాబితాలో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. చివరి టెస్ట్‌ను 2015లో జింబాబ్వేతో ఆడాడు. ఐపీఎల్‌లో సీఎస్‌కేకు ప్రాతినిథ్యం వహించాడు. స్నేహితుడైన దినేశ్ కార్తీక్ మొదటి భార్యను మురళీ విజయ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దాంతో అతన్ని చాలా మంది చీటర్‌గా పరిగణిస్తారు.