For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'గత 2-3 నెలల్లో రిషబ్ పంత్ టీమిండియాకు చేసింది.. మిగతా ఆటగాళ్లు లైఫ్ టైంలో చేయలేరు'

Ravi Shastri feels No one would ever do in a lifetime what Rishabh Pant has done for Team India
IND VS ENG : What Rishabh Pant Did For India In Last 2 Months, No One Would Do That In Lifetime

అహ్మదాబాద్: ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీసుల్లో అదరగొట్టిన టీమిండియా యువ వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇప్పటికే భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, హైదరాబాద్ సొగసరి వీవీఎస్‌ లక్ష్మణ్‌.. పంత్‌ను ప్రశంసించారు. తాజాగా ఈ జాబితాలో టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి కూడా చేరిపోయాడు. గత 2-3 నెలల్లో రిషబ్ పంత్ టీమిండియాకు ఎంతో చేశాడని, అది మిగతా ఆటగాళ్లు జీవిత కాలంలో చేయలేరని పేర్కొన్నాడు. 21-23 ఏళ్ల మధ్య తాను కూడా పంత్‌ లాగే విజయం సాధించానని తెలిపాడు.

మిగతా ఆటగాళ్లు లైఫ్ టైంలో చేయలేరు

మిగతా ఆటగాళ్లు లైఫ్ టైంలో చేయలేరు

తాజాగా వర్చువల్ విలేకరుల సమావేశంలో టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి మాట్లాడుతూ... '21, 22, 23 ఏళ్ల మధ్య నేను కూడా రిషబ్ పంత్ ‌లాగే సక్సెస్ అయ్యాను. నేను విదేశాలలో వందల స్కోరు చేశాను. యువతలోని ఉత్సాహాన్ని ఎవరూ దూరం చేయలేరు. పంత్ ఈ 2-3 నెలల్లో అసాధారణ ఆటతీరు కనబర్చాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీసుల్లో అదరగొట్టాడు. ఈ కొద్ది కాలంలో అతడు సాధించిన ఘనతలను మిగతా ఆటగాళ్లు తమ జీవితంలో సాధించలేకపోవచ్చు' అని అన్నాడు.

ఎంతో శ్రమించి బరువు తగ్గాడు

ఎంతో శ్రమించి బరువు తగ్గాడు

'ఐపీఎల్ 2020 సమయంలో రిషబ్ పంత్ బరువు ఎక్కువగా ఉన్నాడు. కానీ ఎంతో శ్రమించి బరువు తగ్గాడు. మిగతా ఆటగాళ్ల కంటే కఠిన సాధన చేశాడు. పంత్ కష్టానికి ఫలితం దక్కింది. అతడి కష్టాన్ని ప్రతిఫలం ఏంటనేది ప్రపంచం మొత్తం చూస్తోంది' అని కోచ్ రవిశాస్త్రి పేర్కొన్నారు. ఐపీఎల్ 2020 సమయంలో పంత్ ఫామ్, ఫిట్‌నెస్‌పై తీవ్రమైన విమర్శలొచ్చాయి. దీంతో కసితో ప్రయత్నించిన పంత్.. ఎంతో కష్టపడ్డాడు. అద్భుతమైన ఆటతీరుతో విమర్శకుల నోళ్లు మూయించాడు. అప్పుడు విమర్శించిన వాళ్లే.. ఇప్పుడు పొగుడుతున్నారు.

పేలవ ఆటతీరుతో

పేలవ ఆటతీరుతో

గతంలో పేలవ ఆటతీరుతో తీవ్ర విమర్శలను ఎదుర్కొన్న రిషబ్ పంత్.. గత రెండు మూడు నెలల్లోనే భారత అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా ఎదిగాడు. ఆస్ట్రేలియా పర్యటనలో సిడ్నీ (97: 118 బంతుల్లో 12x4, 3x6), గబ్బా ‌(89; 138 బంతుల్లో 9x4, 1x6) టెస్టుల్లో రెచ్చిపోయిన పంత్.. టీమిండియాకు చిరస్మరణీయ విజయం అందించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఇంగ్లండ్‌తోనూ జరిగిన చివరి టెస్టులో శతకం (101; 118 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్లు) బాది.. మరోసారి తాను ఎంత విలువైన ఆటగాడో నిరూపించుకున్నాడు.

5 ఇన్నింగ్స్‌లలో 274 పరుగులు

5 ఇన్నింగ్స్‌లలో 274 పరుగులు

రిషబ్ పంత్‌ బోర్డర్‌-గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌లో అద్భుతంగా రాణించాడు. పింక్ బాల్ టెస్టులో వృద్దిమాన్ సాహా విఫలమవడంతో రెండో టెస్ట్ నుంచి పంత్ ఆడాడు. 5 ఇన్నింగ్స్‌లలో 274 పరుగులు చేశాడు. అత్యధిక స్కోర్ 97. అదే విధంగా స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లోనూ మెరిశాడు. నిర్ణయాత్మక ఆఖరి టెస్టులో సెంచరీ చేశాడు. నాలుగు టెస్టుల్లో కలిపి 270 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

'పెద్ద మొత్తంలో డబ్బులొచ్చే ఐపీఎల్‌ను వదిలేయలేం.. కివీస్‌తో టెస్ట్ సిరీస్‌ ఆడకపోవచ్చు'

Story first published: Wednesday, March 10, 2021, 14:24 [IST]
Other articles published on Mar 10, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+