For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'పెద్ద మొత్తంలో డబ్బులొచ్చే ఐపీఎల్‌ను వదిలేయలేం.. కివీస్‌తో టెస్ట్ సిరీస్‌ ఆడకపోవచ్చు'

Jos Buttler says IPL is a huge tournament, We all know the benefits of the tourney

అహ్మదాబాద్: పెద్ద మొత్తంలో డబ్బులొచ్చే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌ను ఊరికే వదిలేయలేం అని ఇంగ్లండ్ వికెట్ కీపర్ జోస్‌ బట్లర్‌ అంటున్నాడు. దేశానికి ఆడటం గర్వకారణమేనని, అయితే ఫ్రాంచైజీలు ప్లేఆఫ్స్‌కు చేరితే న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌ ఆడడం కాస్త కష్టంగా మారుతుందన్నాడు. కొన్నిసార్లు ఐపీఎల్, ఇంగ్లండ్ తరఫున ఆడడం మధ్య సమతూకం కష్టమేనని బట్లర్‌ పేర్కొన్నాడు. రాజస్థాన్‌ రాయల్స్‌కు బట్లర్‌ ఆడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం టీమిండియాతో త్వరలో జరగనున్న టీ20 సిరీస్ కోసం బట్లర్‌ మొతేరా మైదానంలో సాధన చేస్తున్నాడు.

జూన్‌ 2న న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌

జూన్‌ 2న న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌

టీమిండియాతో తొలి టెస్టు తర్వాత జోస్ బట్లర్‌ స్వదేశానికి వెళ్లిపోయాడు. రొటేషన్ పాలసీలో భాగంగా ఇంగ్లండ్ వెళ్లి.. టెస్ట్ సిరీస్‌ పూర్తయ్యాక తిరిగొచ్చాడు. ఇక ఐపీఎల్‌ 2021 ముగిసేంత వరకు భారత్‌లోనే ఉండనున్నాడు. ఇక జూన్‌ 2న న్యూజిలాండ్‌తో ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌ మొదలవుతుంది. మే నెలాఖరుకే ఐపీఎల్‌ లీగ్ దశ మ్యాచులు ముగుస్తున్నా.. ఫ్రాంచైజీలు ప్లేఆఫ్స్‌కు చేరితే కీలక ఆటగాళ్లు వదిలివెళ్లడం కష్టం. అయితే ఇంగ్లీష్ క్రికెటర్లు ఇలా ఐపీఎల్‌ కోసం భారత్‌లో ఉండిపోవడాన్ని బ్రిటిష్‌ మీడియా తీవ్రంగా విమర్శిస్తోంది. ఐపీఎల్‌ కోసం దేశం తరఫున ఆటగాళ్లు ఆడడం లేదంటున్నాయి.

ప్లేఆఫ్స్‌కు చేరుకుంటే

ప్లేఆఫ్స్‌కు చేరుకుంటే

ఐపీఎల్‌ 2021 కోసం కొందరు ఆటగాళ్లు న్యూజిలాండ్‌ టెస్టు సిరీస్‌ నుంచి తప్పుకోవచ్చన్న విమర్శల నేపథ్యంలో జోస్ బట్లర్‌ స్పందించాడు. 'నాతో ఎవరూ అలాంటి చర్చలు జరపలేదు. మిగతా ఆటగాళ్ల సంగతి నాకు ఏమాత్రం తెలియదు. న్యూజిలాండ్‌ టెస్టు సిరీస్‌ ప్రకటించక ముందే ఐపీఎల్‌ భాగస్వామ్యంపై నాకు ఒప్పందం కుదిరింది. ఫ్రాంచైజీలు ప్లేఆఫ్స్‌కు చేరుకుంటే.. టెస్ట్ సిరీస్‌ ఆడని పరిస్థితి రావొచ్చు. ఏదేమైనా కివీస్‌ సిరీస్‌ను షెడ్యూలులో తర్వాత చేర్చారు. కానీ ఇంగ్లండ్ మ్యాచుల్ని ప్రతిసారీ కొందరు ఆటగాళ్లు మిస్సవుతూనే ఉంటారు. ఇది తెలుసుకోవాలి' అని బట్లర్‌ అన్నాడు.

డబ్బులూ భారీగానే

డబ్బులూ భారీగానే

'ఐపీఎల్‌ వల్ల కలిగే ప్రయోజనాలు అన్ని తెలుసు. ఇదో భారీ లీగ్‌. డబ్బులూ భారీగానే అందుతాయి. ఇక్కడి క్రికెట్‌ అనుభవం ఎంతగానో పనికొస్తుంది. ఇంగ్లండ్ క్రికెట్‌కు ఉపయోగపడుతుంది. ఐపీఎల్‌లో భాగస్వాములయ్యే మా క్రికెటర్లందరికీ ఈ ప్రయోజనాలు దక్కుతాయి. షెడ్యూలు కఠినంగా ఉందని తెలుసు. సమతూకం కోసం ఈసీబీ, క్రికెటర్లు ప్రయత్నిస్తున్నారు. చాలామందికి ఐపీఎల్‌ డబ్బులతో ఉపయోగం ఉంటుంది. ఆర్థికపరంగా ఐపీఎల్‌ అతిపెద్ద టోర్నీ. మా కెరీర్లు చిన్నవే కానీ ఇంగ్లండ్‌కు ఆడటాన్ని మేం గౌరవంగా భావిస్తాం. ఈసీబీ మాకు మంచి వేతనాలు ఇస్తోంది' అని జోస్ బట్లర్‌ తెలిపాడు.

మార్చి 12 నుంచి తొలి టీ20

మార్చి 12 నుంచి తొలి టీ20

మార్చి 12 నుంచి అహ్మదాబాద్‌లోని మొతేరా స్టేడియంలో భారత్‌, ఇంగ్లండ్‌ మధ్య తొలి టీ20 ఆరంభంకానున్న విషయం తెలిసిందే. టెస్ట్ సిరీస్ కోల్పోయి వరల్డ్‌‌ టెస్ట్‌‌ చాంపియన్‌‌షిప్‌‌ ఫైనల్ బెర్త్‌ కూడా పోగొట్టుకున్న ఇంగ్లీష్ జట్టు టీ20 పట్టేయాలనే లక్ష్యంతో ఉంది. ఇందుకోసం ఆటగాళ్లు నెట్స్‌లో చెమటోడ్చుతున్నారు. మరోవైపు తొలి టీ20కి మరో రెండు రోజుల సమయం మాత్రమే ఉండడంతో టీమిండియా కూడా జోరుగా ప్రాక్టీస్ చేస్తోంది.

స్మృతి మంధాన అరుదైన రికార్డు.. 'ఛేజింగ్ కింగ్' విరాట్ కోహ్లీకి కూడా ఆ ఘనత లేదు!!

Story first published: Wednesday, March 10, 2021, 13:32 [IST]
Other articles published on Mar 10, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+