కోహ్లీ ఒక్కడే కాదు.. గంగూలీ, ద్రవిడ్ కూడా ప్రపంచకప్ గెలవలేదు!రవిశాస్త్రి వివాదాస్పద వ్యాఖ్యలు!

న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)పై టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఓ ఆటగాడి సామర్థ్యాన్ని అతని ఆటను బట్టి లెక్కించాలి గానీ, ప్రపంచకప్‌లతో కాదన్నాడు. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ఆరు ప్రపంచకప్‌ల తర్వాత మెగా టోర్నీ టైటిల్ అందుకున్నాడని, భారత దిగ్గజ క్రికెటర్లుగా చెప్పుకునే సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్ అసలు ప్రపంచకప్‌లే గెలవలేదన్నాడు. అంతమాత్రాన వాళ్లు చెత్త ఆటగాళ్లు అవుతారా? అని ప్రశ్నించాడు. టీమిండియా తరఫున ప్రపంచకప్ గెలిచిన సారథులు ఇద్దరే ఉన్నారని గుర్తు చేశాడు.
ఇక టీమిండియా హెడ్ కోచ్‌గా రెండు పర్యాయాలు పనిచేసిన రవిశాస్త్రి, కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి ఒక్క ఐసీసీ టైటిల్ కూడా గెలవలేకపోయాడు.
ఒక్క ఐసీసీ టైటిల్ లేదు..
2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్థాన్ చేతిలో ఓడిన భారత్.. 2019 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఖంగుతిన్నది. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లో బ్లాక్ క్యాప్స్ చేతిలోనే ఓటమిపాలైంది. ఇక ఎన్నో అంచనాల మధ్య 2021 టీ20 ప్రపంచకప్ బరిలోకి దిగిన టీమిండియా.. కనీసం సెమీస్ చేరకుండా ఇంటిదారిపట్టింది. దాంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న విరాట్ కోహ్లీ.. మెగా టోర్నీకి ముందే టీ20 సారథ్య బాధ్యతలను వదులుకోగా.. ఇద్దరు కెప్టెన్లు అవసరం లేదని బీసీసీఐ వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించింది. సౌతాఫ్రికా గడ్డపై టెస్ట్ సిరీస్ ఓటమితో సుదీర్ఘ ఫార్మాట్ సారథ్య బాధ్యతలను కూడా విరాట్ వదులుకున్నాడు.

తాత్కలికమే..
దాంతో కోహ్లీ ఏడేళ్ల సారథ్యం ఒక్క ఐసీసీ టైటిల్ లేకుండానే ముగిసింది. ఇక ఐసీసీ టైటిల్ గెలవకపోవడంతోనే కోహ్లీని వన్డే సారథ్య బాధ్యతల నుంచి బీసీసీఐ తప్పించిందనే ప్రచారం జరిగింది. ఇదే విషయాన్ని శాస్త్రి ముందు ప్రస్తావించగా.. అతను ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రపంచకప్‌లు గెలిస్తేనే మేటీ కెప్టెన్ కాదని చురకలంటించాడు. సౌతాఫ్రికా పర్యటనలో టీమిండియా పేలవ ప్రదర్శనపై కూడా రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశాడు. అన్ని మ్యాచ్‌లు గెలవలేమని, భారత జట్టులో ఇప్పుడున్న పరిస్థితి తాత్కాలికమేనన్నాడు. "మనం ఒక్కసిరీస్ కోల్పోయినా ప్రజలు విమర్శలు చేస్తూనే ఉంటారు. మనం ప్రతి మ్యాచ్ గెలవలేం. ఆటలో గెలుపు ఓటమి సహజం." 'అని చెప్పుకొచ్చాడు.

నెంబర్ వన్ టీమ్..
గత ఐదేళ్లుగా టీమిండియా నెంబర్ 1గా కొనసాగుతూనే ఉందని, జట్టు ప్రమాణాలు ఏమాత్రం తగ్గలేదని రవిశాస్త్రి పేర్కొన్నాడు. ప్రస్తుతం టీమిండియా ప్రదర్శనపై ఏమాత్రం సందేహం వద్దన్నాడు.'భారత జట్టు గత ఐదేళ్ల నుంచి 65 శాతం విన్నింగ్ రేట్‌తో ఉంది. అలాంటప్పుడు మనం ఎందుకు భయపడాలి. ప్రత్యర్థి జట్లు భయపడాలి." అని శాస్త్రి చెప్పుకొచ్చాడు. కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విరాట్ కోహ్లీ నిర్ణయాన్ని గౌరవించాలని చెప్పిన రవిశాస్త్రి.. రోహిత్ శర్మను తదుపరి కెప్టెన్‌గా ఎంపికచేయాలన్నాడు.

రోహిత్ శర్మకే కెప్టెన్సీ..
'రోహిత్ శర్మ ఫిట్‌గా ఉంటే.. టెస్టు ఫార్మాట్‌కు కూడా అతన్నే ఎందుకు పూర్తి స్థాయి కెప్టెన్‌గా నియమించకూడదు.? ఇప్పటికే వైస్ కెప్టెన్‌గా ఉన్న అతన్ని.. కెప్టెన్‌గా ఎందుకు ప్రమోట్ చేయకూడదు. రిషభ్ పంత్ కూడా అద్భుతమైన ఆటగాడు. ఒక కోచ్‌గా అతని ఆట తీరు పట్ల గర్వపడుతున్నాను. ఆట పట్ల అతని దృక్పథం చాలా గొప్పగా ఉంటుంది. చాలా మంది అతను నిర్లక్ష్యంగా ఆడి వికెట్ పారేసుకుంటాడని చెబుతుంటారు. అందులో వాస్తవం లేదు. అతను ఆటను బాగా అర్థం చేసుకుంటాడు." అని రవిశాస్త్రి తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications