Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నితీష్ కుమార్ రెడ్డి శతకం.. కన్నీటి పర్యంతమైన రవి శాస్త్రి!(వీడియో)

టీమిండియా యువ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి సెంచరీతో చెలరేగాడు. ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో ఈ తెలుగోడు అరంగేట్ర సెంచరీ అందుకున్నాడు. మెల్ బోర్న్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ మూడో రోజు ఆటలో అనేక నాటకీయ పరిణామాల మధ్య సినిమాటిక్ తరహాలో స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో లాంగాన్ దిశగా బౌండరీ బాది సెంచరీ మార్క్ అందుకున్నాడు.

221 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న భారత జట్టును నితీష్ సంచలన బ్యాటింగ్‌తో ఆదుకున్నాడు. వాషింగ్టన్ సుందర్‌(160 బంతుల్లో ఒక్క ఫోర్‌తో 50) కలిసి 8వ వికెట్‌కు 127 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. సుందర్, జస్‌ప్రీత్ బుమ్రా ఔటైనా.. సిరాజ్ సాయంతో సెంచరీ మార్క్ అందుకొని తన కలను సాకారం చేసుకున్నాడు.

Ravi Shastri bursts into tears after Nitish Kumar Reddy smashes maiden Test century

నితీష్ సంచలన శతకంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 116 ఓవర్లలో 9 వికెట్లకు 358 పరుగులు చేసింది. క్రీజులో నితీష్ కుమార్ రెడ్డితో పాటు మహమ్మద్ సిరాజ్(0 బ్యాటింగ్) ఉన్నాడు. భారత్ ఇంకా 116 పరుగుల వెనుకంజలో ఉంది. ఆస్ట్రేలియా బౌలర్లలో ప్యాట్ కమిన్స్, స్కాట్ బోలాండ్ మూడేసి వికెట్లు తీయగా.. నాథన్ లయన్ రెండు వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 474 పరుగుల భారీ స్కోర్ చేసిన విషయం తెలిసిందే.

అయితే నితీష్ కుమార్ రెడ్డి శతకం సాధించిన వెంటనే అతని తండ్రి ముత్యాల రెడ్డి తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ఒక్కసారిగా తన కష్టాలను గుర్తు చేసుకోని కన్నీటి పర్యంతమయ్యాడు. అయితే నితీష్ తండ్రే కాదు.. టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి సైతం భావోద్వేగానికి గురయ్యాడు. కొడుకు సక్సెస్‌ను చూసి భావోద్వేగానికి గురైన తండ్రి చూసి కన్నీటి పర్యంతమయ్యాడు. ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకోలేకపోయాడు.

ఈ మ్యాచ్‌కు కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న రవి శాస్త్రి.. నితీష్ సెంచరీ సమయంలో పఠాన్‌తో కలిసి హిందీ వ్యాఖ్యానం చేశాడు. 'ఇది భావోద్వేగపూరితమైన సందర్భం. అతని తండ్రికే కాదు. ప్రేక్షకుల్లోని ప్రతీ ఒక్కరు కన్నీటిపర్యంతమయ్యారనుకుంటున్నా.'అని శాస్త్రి ఎమోషనల్ అయ్యాడు. ఈ వీడియోను స్టార్ స్పోర్ట్స్ అభిమానులతో పంచుకుంది.

Story first published: Saturday, December 28, 2024, 18:23 [IST]
Other articles published on Dec 28, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+