Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS: బీసీసీఐ తొండాట.. డ్రా కోసం 22 రోజుల పిచ్! రవిశాస్త్రి అదిరిపోయే కౌంటర్!

 Ravi Shastri asks pitch critics to ‘So what do you want, this kind of a pitch or the other pitches’

అహ్మదాబాద్: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్- ఆస్ట్రేలియా మధ్య అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్ డ్రా దిశగా సాగుతోంది. పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలమైన వికెట్‌పై ఇరు జట్లు భారీ స్కోర్‌లు నమోదు చేయడంతో ఫలితం తేలకుండానే ఈ మ్యాచ్ ముగియనున్నది. అయితే ఈ సిరీస్‌లోని గత మూడు మ్యాచ్‌లు రెండున్నర రోజుల్లోనే ముగిసాయి. టర్నింగ్ ట్రాక్స్‌పై బ్యాటర్లు ఆడలేకపోయారు. తొలి రెండు టెస్ట్‌లకు సంబంధించిన పిచ్‌కు ఐసీసీ యావరేజ్ రేటింగ్ ఇచ్చింది. కానీ ఇండోర్ వేదికగా జరిగిన మూడో టెస్ట్‌కు మాత్రం పూర్ రేటింగ్ ఇవ్వడంతో పాటు మూడు డీమెరిట్ పాయింట్స్ కేటాయించింది. దాంతో బీసీసీఐ.. అహ్మదాబాద్ వికెట్‌ను బ్యాటింగ్‌కు అనుకూలంగా తయారు చేసింది.

22 రోజుల పిచ్..

22 రోజుల పిచ్..

అయితే సిరీస్ గెలవాలనే ఉద్దేశంతోనే బీసీసీఐ ఫ్లాట్ వికెట్‌తో చీటింగ్‌కు తెరలేపిందని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మార్క్‌వా ఆరోపించాడు. ఈ మ్యాచ్‌కు కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న ఆయన.. అహ్మదాబాద్ టెస్ట్ వికెట్‌ ఐదు రోజుల పిచ్ కాదని, 22 రోజుల పిచ్ అని వ్యంగ్యస్త్రాలు సంధించాడు. 'గత మూడు టెస్టులకు ఉపయోగించిన పిచ్‌లు కేవలం రెండున్నర రోజుల పిచ్‌లు మాత్రమే. కానీ అహ్మదాబాద్ వికెట్ మాత్రం ఐదు రోజుల పిచ్ కాదు, 22 రోజుల పిచ్. ఇది ఏ మాత్రం సరైన పద్దతి కాదు.

 ఫలితాన్ని ఆశిస్తే..

ఫలితాన్ని ఆశిస్తే..

సిరీస్ గెలవాలనే ఉద్దేశంతోనే బ్యాటింగ్‌ పిచ్‌ను సిద్దం చేశారు. చివరి టెస్ట్‌లో ఫలితం వస్తుందని మేమంతా ఆశించాం. ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఆసీస్ ఆడింది. అయితే ఇలాంటి పేలవ పిచ్‌లపై ఫలితాలు రావడం అసాధ్యం. తొలి మూడు టెస్ట్‌ల్లో ఏడు రోజుల్లోనే 91 వికెట్లు పడితే.. చివరి టెస్ట్‌లో నాలుగు రోజుల్లో 15 వికెట్లు మాత్రమే పడ్డాయి 'అని మార్క్ వా అసహనం వ్యక్తం చేశాడు. మార్క్ వా వ్యాఖ్యలకు సహచర కామెంటేటర్లు దినేశ్ కార్తీక్, రవి శాస్త్రి తమదైన శైలిలో బదులిచ్చారు. ఆసీస్ మీడియా, మాజీ క్రికెటర్లు కోరుకున్నది ఈ తరహా పిచ్ కదా? అని ప్రశ్నించారు.

 మళ్లీ ఏడుపే..

మళ్లీ ఏడుపే..

'స్పిన్ వికెట్లు అంటూ భారత పిచ్‌లపై గగ్గోలు పెట్టిన వారంత ఇప్పుడు సంతోషంగా ఉంటారనుకుంటా. వారు ఎలాంటి పిచ్‌ను ఆశించారో అలాంటిదే దొరికింది. స్పిన్‌ను ఆడేందుకు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఫలితం వచ్చినా రాకపోయినా పోయేదేం లేదు. ఫ్లాట్ వికెట్‌పైన కూడా ఏడుస్తున్నారు. అసలు మీకు ఎలాంటి పిచ్ కావాలి? ఇలా బ్యాటింగ్‌కు అనుకూలమైన వికెటా? లేక మూడు రోజుల్లో ముగిసిపోయే స్పిన్ పిచ్ ఆ?'అని రవిశాస్త్రి ప్రశ్నించాడు.

 కావాలనే స్లో బ్యాటింగ్

కావాలనే స్లో బ్యాటింగ్

మరో ఆసీస్ మాజీ క్రికెటర్ బ్రాడ్ హాడిన్ మాట్లాడుతూ.. టీమిండియా ఉద్దేశ పూర్వకంగానే స్లోగా బ్యాటింగ్ చేసిందని విమర్శించాడు. 'మ్యాచ్‌ను డ్రా చేయాలనే ఉద్దేశంతోనే టీమిండియా స్లోగా ఆడింది. కావాలనే రెండు రోజుల పాటు బ్యాటింగ్ చేసింది. వాళ్లు వేగంగా ఆడాలనుకుంటే ఇంకా చాలా ముందే ఇండియా ఇన్నింగ్స్ ముగిసేది. కానీ డ్రా చేసుకోవాలనే ఉద్దేశంతోనే బ్యాటర్లు నెమ్మదిగా బ్యాటింగ్ చేశారు. ఓవర్లు, సమయాన్ని వృథా చేశారు. ఆస్ట్రేలియా బ్యాటింగ్‌కు వచ్చేసరికి పిచ్ బ్యాటింగ్‌కు సహకరించకూడదని ప్లాన్ వేశారు.' అంటూ బ్రాడ్ హాడిన్ ఆరోపించారు.

Story first published: Monday, March 13, 2023, 14:00 [IST]
Other articles published on Mar 13, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+