For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

6 బంతుల్లో 6 సిక్స్‌లు.. భారత బౌలర్ చెత్త రికార్డ్! (వీడియో)

టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప చెత్త రికార్డ్ నమోదు చేశాడు. 6 బంతుల్లో 6 సిక్స్‌లు సమర్పించుకొని అత్యధిక పరుగులిచ్చిన బౌలర్‌గా నిలిచాడు. 6 సిక్స్‌లతో పాటు ఓ వైడ్ కూడా వేయడంతో ఈ ఓవర్‌లో ఊతప్ప 37 పరుగులు ఇచ్చుకున్నాడు. హాంకాంగ్ సిక్సెస్ టోర్నీలో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఊతప్ప ఈ చెత్త రికార్డ్‌ను మూటగట్టుకున్నాడు.

ప్రస్తుతం రవి బోపారా 6 సిక్స్‌లకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ రవి బొపారా ఊతప్ప బౌలింగ్‌లో వరుసగా 6 సిక్స్‌లు బాదాడు. ఈ మ్యాచ్‌లో 14 బంతులాడిన బొపరా 53 పరుగులు చేశాడు. దాంతో ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 15 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Ravi Bopara Slams Robin Uthappa For 6 Sixes In One Over Video Goes Viral

శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 6 ఓవర్లలో వికెట్ నష్టానికి 120 పరుగులు చేసింది. కెప్టెన్ రవి బోపారా(14 బంతుల్లో 8 సిక్స్‌లతో 53), సమిత్ పటేల్(18 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 51) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లు ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు.

అనంతరం టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 105 పరుగులే చేసి ఓటమిపాలైంది. కేదార్ జాదవ్(15 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 48 నాటౌట్) రాణించినా ఫలితం లేకపోయింది. ఇంగ్లండ్ బౌలర్లలో రవి బోపారా 2 వికెట్లు తీయగా.. జోర్డాన్ ఓ వికెట్ తీసాడు.

యూఏఈతో జరిగిన మరో మ్యాచ్‌లోనూ టీమిండియా ఒక్క పరుగు తేడాతో ఓటమిపాలైంది. ఆఖరి ఓవర్‌లో భారత్ విజయానికి 32 పరుగులు అవసరమవ్వగా.. స్టువర్ట్ బిన్నీ వరుసగా 4, వైడ్, 6, 6, 6, 6, 1 బాదాడు. ఆఖరి బంతికి క్విక్ డబుల్ తీసే ప్రయత్నంలో రనౌటయ్యాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన యూఏఈ నిర్ణీత 6 ఓవర్లలో 5 వికెట్లకు 130 పరుగులు చేసింది. ఖలిద్ షా(10 బంతుల్లో ఫోర్, 6 సిక్స్‌లతో 42), జహూర్ ఖాన్(11 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 37 నాటౌట్) రాణించారు. భారత్ బౌలర్లలో స్టువర్ట్ బిన్నీ(3/31)నే మూడు వికెట్లు తీసాడు. భరత్ చిప్లి, షెహ్‌బాజ్ నదీమ్‌‌కు ఓ వికెట్ దక్కింది.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 6 ఓవర్లలో 4 వికెట్లకు 129 పరుగులే చేసింది. కెప్టెన్ రాబిన్ ఊతప్ప(10 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 43), స్టువర్ట్ బిన్నీ రాణించినా ఫలితం లేకపోయింది. యూఏఈ బౌలర్లలో అకిఫ్ రాజా, సంచిత్ శర్మ, ముహమ్మద్ జుహైబ్ తలో వికెట్ తీసారు.

ఏడేళ్ల తర్వాత మళ్లీ మొదలైన హాంకాంగ్ క్రికెట్ సిక్సెస్ టోర్నీలో మొత్తం 12 జట్లు పాల్గొంటున్నాయి. ఈ టోర్నీలో ప్రతి జట్టులో ఆరుగురు ప్లేయర్లే ఉంటారు. ఓ మ్యాచ్‌లో ప్రతి జట్టు ఆరు ఓవర్లు ఆడుతుంది.

Story first published: Saturday, November 2, 2024, 14:33 [IST]
Other articles published on Nov 2, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+