For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Ravi Bishnoi: ఆ ప్లాన్‌తోనే సూపర్ ఓవర్‌లో భారత్‌ను గెలిపించా

బ్యాక్ ఆఫ్ లెంగ్త్ బాల్స్‌తోనే సూపర్ ఓవర్‌లో అఫ్గానిస్థాన్ బ్యాటర్లను కట్టడి చేశానని టీమిండియా యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్ తెలిపాడు. అఫ్గానిస్థాన్‌తో బుధవారం జరిగిన మూడో టీ20 డబుల్ సూపర్ ఓవర్‌కు దారి తీయగా.. రవి బిష్ణోయ్ సంచలన బౌలింగ్‌తో టీమిండియా గెలుపొందింది. రెండో సూపర్ ఓవర్‌లో భారత్ నమోదు చేసిన 11 పరుగులను రవి బిష్ణోయ్ డిఫెండ్ చేశాడు.

మూడు బంతుల్లో 1 పరుగు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీసాడు. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్‌ను రోహిత్ సేన 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఈ విజయానంతరం మాట్లాడిన రవి బిష్ణోయ్.. తీవ్ర ఒత్తిడి మధ్య సూపర్ ఓవర్‌లో బౌలింగ్ చేశానని తెలిపాడు. 'తీవ్ర ఒత్తిడి మధ్య సూపర్ ఓవర్‌ వేసాను. నా గుండె చాలా వేగంగా కొట్టుకుంది. కానీ జట్టును గెలిపించగలననే ఆత్మవిశ్వాసంతోనే బౌలింగ్ చేశాను. రెండో సూపర్ ఓవర్‌ నేనే బౌలింగ్ చేయాలని కెప్టెన్ చెప్పాడు.

Ravi Bishnoi reveals his secret in India’s double Super Over win vs Afghanistan in 3rd T20I

బ్యాక్ ఆఫ్ లెంగ్త్ బాల్ వేస్తే అఫ్గాన్ బ్యాటర్లు ఇబ్బంది పడుతారని నాకు తెలుసు. బ్యాక్ ఫుట్‌లో భారీ షాట్ల ఆడటం చాలా కష్టంగా ఉంటుంది. సూపర్ ఓవర్స్‌లో డిఫెండ్ చేయడం చాలా సంతోషాన్ని ఇస్తోంది. నేను వేసిన బంతుల పట్ల చాలా సంతోషంగా ఉన్నా. నా ఆలోచన ఒక్కటే.. బ్యాటర్లకు ఒకే రకమైన బంతులు పడకుండా చూసుకోవాలి. ఇందు కోసం నేను దేశవాళీ క్రికెట్‌, నెట్స్‌లో లెగ్ స్పిన్‌‌ను ప్రాక్టీస్ చేశాను.'అని రవి బిష్ణోయ్ చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 212 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(69 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సర్లతో 121 నాటౌట్) రికార్డ్ సెంచరీతో చెలరేగగా.. రింకూ సింగ్(39 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్‌లతో 69 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు.

ఈ ఇద్దరూ ఐదో వికెట్‌కు అజేయంగా 190 పరుగుల రికార్డ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అఫ్గాన్ బౌలర్లలో ఫరీద్ అహ్మద్ 3 వికెట్లు తీయగా.. అజ్మతుల్లా ఒమర్జాయ్ ఓ వికెట్ తీసాడు.

Ravi Bishnoi reveals his secret in India’s double Super Over win vs Afghanistan in 3rd T20I

అనంతరం లక్ష్యచేధనకు దిగిన అఫ్గాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 212 పరుగులు చేసింది. దాంతో మ్యాచ్ టై అయ్యి సూపర్ ఓవర్‌కు దారి తీసింది. అఫ్గాన్ టాప్-3 బ్యాటర్లు రెహ్మనుల్లా గుల్బాదిన్(32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 50), ఇబ్రహీమ్ జడ్రాన్(41 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 50), గుల్బాదిన్ నైబ్(23 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 55 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు.

భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్(3/18) మూడు వికెట్లు తీయగా.. ఆవేశ్ ఖాన్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీసారు. తొలి సూపర్ ఓవర్‌లో అఫ్గాన్ 16 పరుగులు చేయగా.. భారత్ కూడా 16 పరుగులే చేసింది. రెండో సూపర్ ఓవర్‌లో భారత్ 11 పరుగులు చేయగా.. అఫ్గాన్ మూడు బంతుల్లో 1 పరుగు మాత్రమే చేసి ఆలౌటైంది.

Story first published: Thursday, January 18, 2024, 7:20 [IST]
Other articles published on Jan 18, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+