For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Ravi Ashwin: సూపర్ ఓవర్‌‌కు కోహ్లీనే కారణం!

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసల జల్లు కురిపించాడు. కోహ్లీ సూపర్ ఫీల్డింగ్ కారణంగానే అఫ్గానిస్థాన్‌తో మూడో టీ20లో సూపర్ ఓవర్‌కు దారి తీసిందని చెప్పాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడిన అశ్విన్.. కోహ్లీ, రోహిత్ శర్మలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

టీ20 ప్రపంచకప్ జట్టులో అతని అవసరం టీమిండియాకు ఉందని చెప్పాడు. 'విరాట్ కోహ్లీ స్పైడర్ మ్యాన్‌లా ఎగిరి సిక్సర్‌ను ఆపడంతోనే అఫ్గానిస్థాన్‌తో మూడో టీ20 సూపర్ ఓవర్‌కు దారి తీసింది. వెస్టిండీస్‌ వేదికగా టీ20 ప్రపంచకప్‌ జరగనున్న నేపథ్యంలో విరాట్ కోహ్లీ భారత జట్టులో ఉండటం చాలా కీలకం.

 Ravi Ashwin says Virat Kohli save a Six is reason why this 3rd T20I went to a Super Over vs AFG

వెస్టిండీస్ పిచ్‌లు చెపాక్‌లానే నెమ్మదిగా ఉంటాయి. స్లో, టర్నర్ పిచ్‌లతో తక్కువ స్కోర్లు నమోదవుతాయి. కాబట్టి నిలకడగా బ్యాటింగ్ చేసే కోహ్లీ ఉండటం భారతకు అవసరం. వెస్టిండీస్ పిచ్‌లు భిన్నంగా ఉంటాయి.'అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.

టీ20ల్లో చివరి నాలుగు ఓవర్లలో రోహిత్ శర్మకు బౌలింగ్ చేయడం కష్టమని అశ్విన్ తెలిపాడు. అతనో అసాధారణ బ్యాటరని కొనియాడాడు. అఫ్గానిస్థాన్‌తో రోహిత్ అసాధారణ ప్రదర్శన కనబర్చాడని ప్రశంసించాడు.

'భారత్ వర్సెస్ అఫ్గానిస్థాన్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ బ్యాటింగ్ చర్చించ తగిన అంశం. 30 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును రోహిత్ ఆదుకున్న తీరు అద్భుతం. పరిస్థితులకు తగ్గట్లు ఆడి జట్టుకు భారీ స్కోర్ అందించాడు. ఇంతకు ముందు కూడా రోహిత్ గురించి ఈ మాట చెప్పాను. చివరి 4 ఓవర్లలో రోహిత్ శర్మ బౌలింగ్ చేయడం చాలా కష్టం.

లెంగ్త్ బాల్స్ వేస్తే పుల్ షాట్ ఆడుతాడు. శరీరంపై వేస్తే పికప్ పుల్ షాట్ ఆడుతాడు. షార్ట్ బాల్స్, లిటిల్ ఫుల్లర్, వైడర్ వేస్తే కవర్స్ వైపు ఆడుతాడు. యార్కర్ మిస్ అయితే సిక్సర్ బాదుతాడు. ఈ మూడు మ్యాచ్‌లో సూపర్ ఓవర్ విషయం పక్కనపెడితే.. న్యూజిలాండ్ బౌలర్ టీమ్ సౌథీ బౌలింగ్‌లో అతను సిక్సర్ కొట్టి అసాధారణ విజయాన్ని అందించాడు.'అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.

Story first published: Friday, January 19, 2024, 18:03 [IST]
Other articles published on Jan 19, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+