For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

PAK vs BAN: ఆ చెత్త నిర్ణయమే పాకిస్థాన్ కొంపముంచింది: మాజీ క్రికెటర్

పాకిస్థాన్ తమ తొలి ఇన్నింగ్స్‌ను త్వరగా డిక్లేర్ చేయడమే అత్యంత చెత్త నిర్ణయమని ఆ జట్టు మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ మండిపడ్డాడు. ఈ అనాలోచిత నిర్ణయమే పాకిస్థాన్ ఓటమికి కారణమైందన్నాడు. సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో పాకిస్థాన్‌ 10 వికెట్ల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే పాకిస్థాన్‌పై బంగ్లాదేశ్‌కు ఇదే తొలి విజయం.

సొంతగడ్డపై పసికూన బంగ్లాదేశ్ చేతిలో ఓటమిపాలవ్వడంతో పాకిస్థాన్ జట్టపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. తాజాగా రషీద్ లతీఫ్ పాకిస్థాన్ పరాజయంపై స్పందిస్తూ కెప్టెన్ షాన్‌ మసూద్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ అందుకున్న 117 పరుగుల ఆధిక్యం పాకిస్థాన్ పతనాన్ని శాసించిందన్నాడు.

Rashid Latif slams Pakistan s declaration move in first Test against Bangladesh

448/6 స్కోర్‌తో మెరుగైన స్థితిలో ఉండగా.. డిక్లేర్ చేయడం పాక్ విజయవకాశాలను దెబ్బతీసిందన్నాడు. 'తొలి ఇన్నింగ్స్‌లో ప్రత్యర్థికి లభించిన 100 ప్లస్ రన్స్ ఆధిక్యం పాకిస్థాన్‌ పతనాన్ని శాసించాయి. పిచ్ కండిషన్స్‌ను బాగా పసిగట్టిన బంగ్లాదేశ్.. అందుకు తగ్గట్లు బ్యాటింగ్‌ చేసి చారిత్రాత్మక విజయాన్నందుకుంది. ముఖ్యంగా పాకిస్థాన్ బౌలర్లపై బంగ్లా బ్యాటర్లు పూర్తి ఆధిపత్యం చెలాయించారు.

డిక్లేర్ చేయాలనే ఆలోచన కూడా చేయలేదు. 550 పరుగులు లక్ష్యంగా పెట్టుకొని బ్యాటింగ్ చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో అదనంగా లభించిన 100 పరుగులు.. ఫలితంపై ప్రభావం చూపాయి. మహమ్మద్ రిజ్వాన్ 171 పరుగులతో అజేయంగా ఉన్నప్పుడు.. మరోవైపు షాహిన్ షా అఫ్రిది(30 నాటౌట్) నిలకడగా ఆడుతున్నప్పుడు.. డిక్లేర్ చేయాల్సిన అవసరం ఏం ఉంది..?'అని రషీద్ లతీఫ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

పిచ్ కండిషన్స్‌కు తగిన కాంబినేషన్ లేకుండా బరిలోకి దిగడం కూడా పాకిస్థాన్ కొంపముంచిందని రషీద్ లతీఫ్ తెలిపాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్ లేకుండా.. నలుగురు పేసర్లతో బరిలోకి దిగి పాక్ మూల్యం చెల్లించుకుంది.

'ఇక్కడి పరిస్థితుల గురించి ఇక్కడివారికే బాగా తెలుస్తోంది. అసిస్టెంట్ కోచ్ అజార్ మహమూద్ ఎక్స్‌పర్ట్ అయినా.. ప్రస్తుతం అతను లండన్‌లో నివసిస్తున్నాడు. షాన్ మసూద్, బాబర్ ఆజామ్.. ఇక్కడ ఎంతో క్రికెట్ ఆడారు. వారికి ఇక్కడి పరిస్థితుల గురించి బాగా తెలుసుండాలి. అయితే పచ్చ గడ్డి పిచ్‌తో ఏదో చేయబోయారు. కానీ అది బెడిసికొట్టింది. జాసన్ గిలెస్పీ మంచి కోచ్. అతనికి మంచి అనుభవం కూడా ఉంది. కానీ ఉపఖండ పిచ్‌లను రీడ్ చేయడం విదేశీ ఆటగాళ్లకు అంత సులువైన పనికాదు.'అని లతీఫ్ చెప్పుకొచ్చాడు.

Story first published: Monday, August 26, 2024, 19:07 [IST]
Other articles published on Aug 26, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+