Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బాబర్ ఆజామ్.. ఓ డమ్మీ కెప్టెన్! వారి చేతిలో కీలు బొమ్మ : పాక్ మాజీ క్రికెటర్

పాకిస్థాన్ టెస్ట్ కెప్టెన్ బాబర్ ఆజామ్‌పై ఆ జట్టు మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. బాబర్ ఆజామ్ ఓ డమ్మీ కెప్టెన్ అని, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చేతిలో కీలు బొమ్మగా మారాడని మండిపడ్డాడు. ఇంగ్లండ్‌ గడ్డపై పాకిస్థాన్ ఘోర పరాజయాలను మూటగట్టుకుంది. మూడు టెస్ట్‌ల సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది.

ENG vs PAK: ఒరేయ్ ఆజామూ.. ఏమీరా నీ వల్ల ఉపయోగం!

ENG vs PAK: ఒరేయ్ ఆజామూ.. ఏమీరా నీ వల్ల ఉపయోగం!

ఈ పరాజయాలను సీరియస్‌గా తీసుకున్న పీసీబీ కఠిన నిర్ణయాలను తీసుకుంది. ఏకంగా ఏడుగురు ఆటగాళ్లపై వేటు వేసింది. తొలి టెస్ట్‌లో జట్టును నడిపించిన సల్మాన్ అఘాతో పాటు మహమ్మద్ రిజ్వాన్, ఇమామ్ ఉల్ హక్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. అంతేకాకుండా పాకిస్థాన్ టెస్ట్ టీమ్ హెడ్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్‌తో పాటు సపోర్ట్ స్టాఫ్ మెంబర్ ఉమర్ గుల్‌పై కూడా పీసీబీ వేటు వేసింది. మైక్ హెస్సెన్ పాకిస్థాన్ టెస్ట్ టీమ్ హెడ్ కోచ్‌గా ఎంపికవ్వగా.. అష్లే నోఫ్కే అతనికి అసిస్టెంట్‌గా వ్యవహరించనున్నాడు.

Rashid Latif Slams Babar Azam Calls Him a Dummy Captain Says He Should Have Resigned

నేను తప్పుకునేవాడిని..

అయితే ఈ నిర్ణయాలను రషీద్ లతీఫ్ తప్పుబట్టాడు. ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోకుండా అడ్డుకోవడంలో కెప్టెన్‌గా బాబర్ ఆజామ్ విఫలమయ్యాడని మండిపడ్డాడు. తన ఆటగాళ్లను కాపాడుకోలేని వాడు ఏం నాయకుడని ప్రశ్నించాడు. 'బాబర్ ఆజామ్ కూడా రాజీనామా చేసి ఉండాల్సింది. జట్టులో సగం మందిని ఇంటికి పంపించేశారు. నేను అతని స్థానంలో ఉంటే.. కెప్టెన్సీ వదులుకునేవాడిని. బాబర్ ఆజామ్ డమ్మీ కెప్టెన్ అయిపోయాడు. నాయకుడికి, కెప్టెన్‌కు చాలా తేడా ఉంది.

ఏడుగురు ఆటగాళ్లను జట్టు నుంచి తప్పించారు. ఇమామ్‌కు గాయమైంది కాబట్టి అతన్ని తప్పించడం సరైందే. కానీ మిగతా ఆరుగురు ఆటగాళ్లతో పాటు కోచ్‌, మెంటార్‌ను కూడా వెనక్కిపంపారు. ఛాంపియన్స్ ట్రోఫీ గెలిపించిన కోచ్‌తో పాటు ఉమర్ గుల్‌ను కూడా పంపించేసారు. కెప్టెన్‌గా బాబర్ ఆజామ్.. తన జట్టుకు అండగా నిలవలేదు. కోచ్‌ను పక్కన పెట్టినా.. నోరు మెదపలేదు. పీసీబీకి ఎప్పుడూ ఒక డమ్మీ కెప్టెన్ అసరమనే విషయాన్ని ఇది తెలియజేస్తోంది.'అని రషీద్ లతీఫ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

IND vs ENG: వైభవ్ సూర్యవంశీ కొంపముంచిన ఐపీఎల్!

Also Read

IND vs ENG: వైభవ్ సూర్యవంశీ కొంపముంచిన ఐపీఎల్!

2018 నుంచి ఒక్క మ్యాచ్ గెలవలేదు..

2018 నుంచి సెనా(సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో పాకిస్థాన్ టెస్ట్‌ల్లో విజయం సాధించలేదు. ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్‌లో ఇన్నింగ్స్ 103 పరుగుల తేడాతో ఓడిన ఇంగ్లండ్.. టెస్ట్‌లో 194 పరుగుల తేడాతో చిత్తయ్యింది. దాంతో ఇంగ్లండ్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. మూడో టెస్ట్ బర్మింగ్‌హామ్ వేదికగా సెప్టెంబర్ 9-13 మధ్య జరగనుంది.

Story first published: Wednesday, September 2, 2026, 11:39 [IST]
Other articles published on Sep 2, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+