పాకిస్థాన్ జట్టులో ఇండియన్ ఏజెంట్: మాజీ క్రికెటర్
..పాకిస్థాన్ హెడ్ కోచ్ మైక్ హెస్సన్‌పై ఆ దేశ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. మైక్ హెస్సన్ ఇండియన్ ఏజెంట్ అని సందేహం వ్యక్తం చేశాడు. పాకిస్థాన్ క్రికెట్‌ను నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాడని తెలిపాడు.
ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న పాకిస్థాన్ టీమ్ తమ పేలవ ప్రదర్శనను కొనసాగిస్తోంది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విఫలమవడంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) సంచలన నిర్ణయాలు తీసుకుంది. పాకిస్థాన్ టెస్ట్ టీమ్ హెడ్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్‌తో పాటు బౌలింగ్ కోచ్ ఉమర్ గుల్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పించింది. ఏడుగురు ఆటగాళ్లపై వేటు వేసి ఆఖరి టెస్ట్‌కు యువ ఆటగాళ్లను ఎంపిక చేసింది.
వైట్ బాల్ హెడ్ కోచ్ మైక్ హెస్సన్‌ను తాత్కలిక టెస్ట్ టీమ్ హెడ్ కోచ్‌గా నియమించింది. ఇన్ని చర్యలు తీసుకున్నా.. పాకిస్థాన్ ఆట మాత్రం ఏం మారలేదు. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 133 పరుగులకు ఆలౌటైన పాకిస్థాన్.. ఇంగ్లండ్‌కు 453 పరుగుల సమర్పించుకుంది. రెండో ఇన్నింగ్స్‌లోనూ ఆలౌట్ దిశగా సాగుతోంది.

విదేశీ కోచ్‌ల విషయంలో..
మూడో టెస్ట్‌లో పాక్ ప్రదర్శనపై తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన రషీద్ లతీఫ్.. మైక్ హెస్సన్ ఐపీఎల్ కనెక్షన్‌ను పరోక్షంగా ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించాడు. 'విదేశీ కోచ్‌ల విషయంలో విశ్వసనీయత అనేది చాలా ముఖ్యం. బాబ్ వూల్మర్ నుంచి మిక్కీ ఆర్థర్ వరకు ఎంతో విధేయతతో పాకిస్థాన్ క్రికెట్‌కు తమ సేవలను అందించారు.
నేను ఎవర్ని తప్పుబట్టడం లేదు. కానీ ఐపీఎల్‌లో పనిచేసి మన టీమ్ సపోర్ట్ స్టాఫ్‌లో చేరిన ప్రతీ ఒక్కరిపై ఎప్పుడూ అనుమానం ఉంటుంది. మనం భారత్‌ను అడ్డుకోవాలని చూస్తుంటే.. వారు లోపల నుంచి మనల్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారనే భావన నాకు ఎప్పుడూ కలుగుతోంది. నేను అనవసరంగా ఎవరిపై నిందలు వేయడం లేదు. కానీ ఎవరినైనా కోచ్‌లుగా నియమించుకునే ముందు వారి బ్యాక్ గ్రౌండ్‌ను సరిగ్గా పరిశీలించాలి.
ఐపీఎల్ కోచ్‌లను నమ్మవద్దు..
వారికి భారత్‌తో ఏదో ఒక సంబంధం ఉండి ఉండవచ్చు. మనం భారత క్రికెట్‌కు ఎలాంటి హానీ చేయలేదు. కానీ ఐపీఎల్ నుంచి వచ్చే ఎవరైనా మన క్రికెట్‌ను నాశనం చేసే అవకాశం ఉంది. ఈ విధంగానే కోచ్‌లు, ఇతర సభ్యులు ఏజెంట్లుగా మారుతారు. గతంలో పెద్ద పెద్ద ఫొటోగ్రాఫర్లు, కోచ్‌లు కూడా పాకిస్థాన్ క్రికెట్ వ్యవస్థలోకి చొరబడ్డారు.'అని రషీద్ లతీఫ్ చెప్పుకొచ్చాడు. న్యూజిలాండ్‌కు చెందిన మైఖేల్ హెస్సన్..గతంలో ఆర్‌సీబీ జట్టుకు డైరక్టర్ ఆఫ్ క్రికెట్ ఆపరేషన్స్‌గా సుదీర్ఘ కాలం పని చేశారు. విరాట్ కోహ్లీతో అతనికి మంచి అనుబంధం ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


