Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అశ్విన్‌కు అంత సీన్ లేదు.. రోహిత్ నోరు జారాడు: పాక్ క్రికెటర్

 Rashid Latif disagrees with Rohits Ashwin is an all-time great statement
IND VS SL: Rohit Sharma's Slip of Tongue - Pakistan Former Cricketer Slams | Oneindia Telugu

న్యూఢిల్లీ: టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ ఆల్‌టైమ్ గ్రేట్ స్పిన్నర్‌‌ అంటూ కెప్టెన్ రోహిత్ శర్మ అభివర్ణించడాన్ని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ తప్పుబట్టాడు. అశ్విన్‌కు అంత సీన్‌ లేదన్నాడు. అతను గొప్ప బౌలరే కానీ.. ఇంకా ఆల్‌టైమ్ గ్రేట్ జాబితాలోకి చేరలేదని చెప్పుకొచ్చాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన ఫస్ట్ టెస్ట్‌లో అశ్విన్ 6 వికెట్లతో సత్తా చాటాడు. తద్వారా భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా గుర్తింపు పొందాడు. ఈ క్రమంలో దిగ్గజ పేసర్ కపిల్ దేవ్(434)ను అశ్విన్(434) అధిగమించాడు.

ఈ నేపథ్యంలోనే రవిచంద్రన్ అశ్విన్‌పై రోహిత్ శర్మ ప్రశంసల జల్లు కురిపించాడు. అతను ఆల్‌టైమ్ గ్రేట్ స్పిన్నర్ అంటూ కొనియాడాడు. ఈ వ్యాఖ్యలపై రషీద్ లతీఫ్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. కెప్టెన్‌గా తన బౌలర్‌ను ప్రోత్సహించే ఉద్దేశంలో రోహిత్ అలా నోరు జారడని చెప్పుకొచ్చాడు.

అశ్విన్‌కు అంత సీన్ లేదు..

అశ్విన్‌కు అంత సీన్ లేదు..

‘అశ్విన్ గొప్ప బౌలర్. ఇందులో ఎటువంటి సందేహం లేదు. అతను బౌలింగ్‌లో మంచి వైవిధ్యం ఉంది. స్వదేశీ పిచ్‌లపై అతని రికార్డును పరిశీలిస్తే భారత్‌లో అతనే అత్యుత్తమ స్పిన్నర్. రోహిత్ శర్మ చెప్పినట్టుగా అశ్విన్ ఆల్‌టైమ్ గ్రేట్ కాదు. విదేశీ పిచ్‌లపై అశ్విన్ ప్రభావం చూపలేదు. అతని కంటే అనిల్ కుంబ్లే, బిషన్ సింగ్ బేడీ మెరుగ్గా రాణించారు. ప్రస్తుతం ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అద్భుతంగా రాణిస్తున్నాడు. అశ్విన్ విషయంలో రోహిత్ శర్మ వ్యాఖ్యలతో నేను ఏకీభవించను. నాకు తెలిసి రోహిత్ నోరు జారాడు. ఆటగాళ్లను ప్రోత్సహించడానికి ఇదో మార్గం'అని రషీద్ లతీఫ్ వివరించాడు.

 రోహిత్.. నువ్వు గోప్పోడివి..

రోహిత్.. నువ్వు గోప్పోడివి..

కెప్టెన్ రోహిత్ శ‌ర్మ త‌న‌ను ప్రశంసించడంపై ఎలా స్పందించాలో అర్థం కాలేద‌ని అశ్విన్ తెలిపాడు. ఎవ‌రైనా త‌న‌పై ప్ర‌శంస‌లు కురిపిస్తే వాటిని స‌రిగ్గా స్వీక‌రించ‌లేనంటూ చెప్పుకొచ్చాడు. కెప్టెన్ మాట‌ల‌కు ఎలా స్పందించాలో త‌నకు తెలియ‌లేద‌ని, కొన్ని సార్లు భావోద్వేగంతో మాట‌లు రావన్నాడు. ఈ రోజు ఉద‌యం వ‌ర‌కు కూడా రోహిత్‌కు ఏం చెప్పాలో త‌న‌కు తెలియ‌లేద‌న్నాడు. అయితే ఉద‌యం టిఫిన్ స‌మ‌యంలో నువ్వు చాలా మంచి మ‌న‌సు ఉన్నవాడివ‌ని చెప్పిన‌ట్లు అశ్విన్ పేర్కొన్నాడు.

 అశ్విన్ సూపర్ బౌలర్..

అశ్విన్ సూపర్ బౌలర్..

ఇక ఫస్ట్ విజయానంతరం రోహిత్ మాట్లాడుతూ అశ్విన్‌ను ప్రత్యేకంగా కొనియాడాడు. భారత్ తరఫు అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా అశ్విన్ ఈ రికార్డు సాధించ‌డం గొప్ప విష‌యం అని, అత‌న్ని చాలా ఏళ్లుగా గ‌మ‌నిస్తున్నాన‌ని, ప్ర‌తిసారి మెరుగ‌వుతూనే ఉన్నాడ‌ని హిట్‌మ్యాన్ చెప్పుకొచ్చాడు. వ్య‌క్తిగ‌తంగానే కాకుండా జ‌ట్టుకు కూడా రికార్డులు అందించే స‌త్తా అశ్విన్‌లో ఉంద‌ని రోహిత్ ప్రశంసించాడు. అశ్విన్ చాలా ఏళ్లుగా జ‌ట్టు కోసం ఆడుతూ అనేక విజ‌యాల‌ను అందించాడ‌ని గుర్తు చేశాడు. అలాగే వందో టెస్ట్ ఆడుతున్న విరాట్ కోహ్లీ కోస‌మే ఈ మ్యాచ్ గెల‌వాల‌నుకున్నామ‌ని రోహిత్ తెలిపాడు.

మూడు రోజుల్లో ముగుస్తుందనుకోలేదు..

మూడు రోజుల్లో ముగుస్తుందనుకోలేదు..

ఆట‌గాళ్ల ప్ర‌ద‌ర్వ‌న సంతోషాన్నిచ్చింద‌ని, ఇది మంచి ప్రారంభం అని రోహిత్ శ‌ర్మ చెప్పాడు. ముందుగా అనుకున్న‌ట్లు తాము అన్ని విభాగాల్లో రాణించామ‌ని అన్నాడు. అయితే తొలి టెస్ట్ మ్యాచ్ 3 రోజుల్లోనే ముగుస్తుంది తాను అనుకోలేద‌ని తెలిపాడు. త‌మ బౌల‌ర్లు స‌మిష్టిగా రాణించి శ్రీ‌లంక బ్యాట‌ర్ల‌పై ఒత్తిడి పెంచార‌ని అన్నాడు. అలాగే మ్యాచ్‌లో గొప్ప‌గా ఆడి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజాపై కూడా రోహిత్ ప్ర‌శంస‌లు కురిపించాడు. జ‌డేజా వ్య‌క్తిగ‌తంగా డ‌బుల్ సెంచ‌రీకి చేరువ‌లో ఉన్నప్పుడు జ‌ట్టు కోసం నిస్వార్థంగా స్కోర్‌ను డిక్లేర్ చేద్దామ‌ని చెప్పాడ‌ని రోహిత్ శ‌ర్మ తెలిపాడు.

Story first published: Friday, March 11, 2022, 18:20 [IST]
Other articles published on Mar 11, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+