Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Asia Cup 2025: కొంపముంచిన రషీద్ ఖాన్.. గెలిచే మ్యాచ్‌లో ఓడిన అఫ్గాన్!

ఆసియా కప్ 2025 టోర్నీలో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ విజయం సాధించింది. అఫ్గానిస్థాన్‌తో మంగళవారం జరిగిన డూఆర్‌డై మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన బంగ్లాదేశ్.. 8 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో సూపర్-4 అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో ముస్తాఫిజుర్ రెహ్మాన్(3/28) అద్భుత బౌలింగ్‌తో బంగ్లాదేశ్‌ ఓటమి నుంచి గట్టెక్కింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 154 పరుగులు చేసింది. ఓపెనర్ తంజిద్ హసన్(31 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 52) హాఫ్ సెంచరీతో రాణించగా..సైఫ్ హసన్(28 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 30), టౌహిడ్ హృదయ్(20 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 26) విలువైన పరుగులు చేశారు. అఫ్గాన్ బౌలర్లలో రషీద్ ఖాన్(2/26), నూర్ అహ్మద్(2/23) రెండేసి వికెట్లు తీయగా..అజ్మతుల్లా ఒమర్జాయ్ ఒక వికెట్ పడగొట్టాడు.

Rashid Khan s Dismissal Proves Costly as Afghanistan Lose to Bangladesh in Asia Cup 2025 Thriller

అనంతరం అఫ్గానిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటైంది. రెహ్మనుల్లా గుర్బాజ్(31 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 35), అజ్మతుల్లా ఒమర్జాయ్(16 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 30), రషీద్ ఖాన్(11 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 20) టాప్ స్కోరర్లుగా నిలవగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. బంగ్లాదేశ్ బౌలర్లలో ముస్తాఫిజుర్ రెహ్మాన్(3/28) మూడు వికెట్లు తీయగా.. నాసుమ్ అహ్మద్, టస్కిన్ అహ్మద్, రిషద్ హొస్సేన్ రెండేసి వికెట్లు పడగొట్టారు.

కొంప ముంచిన రషీద్ ఖాన్..

చివరి 2 ఓవర్లలో అఫ్గాన్ విజయానికి 27 పరుగులు అవసరమయ్యాయి. క్రీజులో రషీద్ ఖాన్ ఉండటంతో లక్ష్యాన్ని చేధిస్తుందని అంతా అనుకున్నారు. అందుకు తగ్గట్లుగానే ముస్తాఫిజుర్ వేసిన 19వ ఓవర్‌లో తొలి బంతినే రషీద్ ఖాన్ బౌండరీ బాదాడు. కానీ ఆ మరుసటి బంతికే అతను క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఇదే అఫ్గాన్ కొంపముంచింది. రషీద్ ఖాన్ ఔటవ్వకపోయి ఉంటే ఈ మ్యాచ్‌లో అఫ్గాన్ గెలిచేది. ఆ మరుసటి బంతికే మరో బ్యాటర్‌ను ఔట్ చేసిన ముస్తాఫిజుర్.. తర్వాతి మూడు బంతుల్లో ఒకే ఒక్క పరుగు ఇచ్చాడు. దాంతో ఈ ఓవర్‌లో 5 పరుగులే వచ్చాయి. ఆఖరి ఓవర్‌లో 22 పరుగులు అవసరం కాగా.. నూర్ అహ్మద్ రెండు సిక్స్‌లు బాది ఔటయ్యాడు.

సూపర్ 4 రేసు సంక్లిష్టం..

బంగ్లాదేశ్ విజయంతో గ్రూప్-బీ సూపర్-4 రేసు సంక్లిష్టంగా మారింది. వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచిన శ్రీలంక టాప్‌లో ఉండగా.. ఒక మ్యాచ్ ఓడి రెండు గెలిచిన బంగ్లాదేశ్ రెండో స్థానంలో నిలిచింది. ఒకటి గెలిచి, మరొకటి ఓడిన బంగ్లాదేశ్ మూడో స్థానంలో ఉండగా.. హాంగ్ కాంగ్ ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించింది. శ్రీలంకతో జరిగే ఆఖరి మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ మెరుగైన రన్‌రేట్‌తో గెలిస్తే టోర్నీలో ముందడుగు వేస్తోంది. ఓడితే మాత్రం ఇంటిదారి పడుతోంది.

Story first published: Wednesday, September 17, 2025, 0:15 [IST]
Other articles published on Sep 17, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+