Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రషీద్‌ ఖాన్‌ 'సూపర్' క్యాచ్.. బౌండరీ లైన్ వద్ద ఏమా బ్యాలెన్స్‌!! చూస్తే వావ్ అంటారు (వీడియో)

Rashid Khan takes stunning catch at the boundary line in BBL 10

హైదరాబాద్: క్రికెట్‌లో అప్పుడప్పుడూ కొన్ని అరుదైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. దాంతో ఎవరూ ఊహించని రీతిలో బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌ బాట పడుతుంటారు. ఎక్కువ శాతం ఫీల్డర్లు తమ విన్యాసాలతో అద్భుతమైన క్యాచ్‌లు పడుతుంటారు. యూఏఈ వేదికగా ముగిసిన ఐపీఎల్ 2020లో ఇలాంటివి చాలానే చూశాం. ఇక ఆసీస్ గడ్డపై ఐపీఎల్ త‌ర‌హాలోనే సాగుతున్న బిగ్‌బాష్‌ (బీబీఎల్) లీగ్‌లో ఓ అద్భుత‌మైన ఫీల్డింగ్ ఫీట్ చోటుచేసుకున్న‌ది. అఫ్గానిస్థాన్‌ స్టార్ స్పిన్నర్‌ రషీద్ ‌ఖాన్‌ తాజాగా పట్టిన ఓ క్యాచ్‌ క్రికెట్‌ ప్రేమికుల్ని ఔరా అనిపించింది.

వెనక్కి పరుగెడుతూ

వెనక్కి పరుగెడుతూ

ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ప్రతిష్ఠాత్మక బిగ్ ‌బాష్‌ లీగ్‌ జరుగుతోన్న సంగతి తెలిసిందే. లీగ్‌లో భాగంగా ఆదివారం అడిలైడ్‌ స్ట్రైకర్స్‌, హోబార్ట్‌ హరీకేన్స్‌ జట్లు తలపడ్డాయి. అడిలైడ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న రషీద్ ఖాన్‌.. హోబార్ట్‌ టీమ్‌ తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేస్తుండగా 16వ ఓవర్‌లో లాంగ్‌ఆన్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్నాడు. అదే సమయంలో హోబార్ట్‌ బ్యాట్స్‌మన్‌ ఇన్‌గ్రామ్ ‌(25) పరుగుల వద్ద బ్యాటింగ్‌ చేస్తుండగా.. ఐదో బంతికి భారీ షాట్‌ ఆడాడు. బంతి లాంగ్‌ఆన్‌ దిశగా సిక్సర్‌ వెళ్లే క్రమంలో రషీద్‌ బౌండరీ వద్ద అద్భుత క్యాచ్‌ అందుకున్నాడు. రెప్పపాటులో బంతి బౌండరీ దాటుతుందనుకునే వేళ వెనక్కి పరుగెడుతూ క్యాచ్‌ పట్టాడు.

పలుమార్లు పట్టు కోల్పోయినా

బౌండరీ లైన్‌ వద్ద వెనక్కి పరుగెడుతూ క్యాచ్‌ పట్టడంతో రషీద్ ఖాన్‌ అదుపు తప్పాడు. అలాంటి స్థితిలో ఒక్క కాలితోనే బౌండరీ లైన్‌కు ఇంచ్‌ దూరంలో పలుమార్లు పట్టు కోల్పోయాడు. అయినా బంతిని అలాగే పట్టుకొని ఉన్నాడు. చివరికి బంతిని గాల్లోకి వదిలేసి బౌండరీ దాటి మళ్లీ తిరిగొచ్చి దాన్ని ఒడిసిపట్టాడు. దీంతో ఇన్‌గ్రామ్‌ షాక్ అయ్యాడు. దీనికి సంబందించిన వీడియోను క్రికెట్‌.కామ్‌.ఏయూ అనే ఆస్ట్రేలియా క్రికెట్‌ వెబ్‌సైట్‌ ట్విటర్‌లో పోస్టు చేసింది. ఈ వీడియో ప్రస్తుతం ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది.

రషీద్ సూపర్ క్యాచ్

రషీద్ సూపర్ క్యాచ్

రషీద్ ఖాన్‌ పట్టిన క్యాచ్‌కు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియో చూసిన అభిమానులు అతడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 'రషీద్ సూపర్ క్యాచ్' అని ఓ ఒకరు ట్వీట్ చేయగా.. 'స్టన్నింగ్‌ క్యాచ్' అని మరొకరు ట్వీట్ చేశారు. బీబీఎల్ టోర్నమెంట్‌లోనే ఇది అత్యుత్తమ క్యాచ్‌ అని ఇంకొందరు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో ఫీల్డింగ్‌తో శభాష్‌ అనిపించుకున్న రషీద్‌.. ఆ తర్వాత బౌలింగ్‌, బ్యాటింగ్‌ విభాగాల్లో మాత్రం విఫలమయ్యాడు. హోబార్ట్‌ తొలుత ఐదు వికెట్ల నష్టానికి 174 స్కోర్‌ చేయగా.. ఛేదనలో అడిలైడ్‌ 9 వికెట్లను 163 పరుగులకే పరిమితమైంది. దీంతో అడిలైడ్‌ ‌11 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

కోహ్లీ లేకున్నా.. రహానెపై ఎలాంటి ఒత్తిడి ఉండదు: గవాస్కర్

Story first published: Monday, December 14, 2020, 18:17 [IST]
Other articles published on Dec 14, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+