For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ లేకున్నా.. రహానెపై ఎలాంటి ఒత్తిడి ఉండదు: గవాస్కర్

Sunil Gavaskar said Ajinkya Rahane both times led Team India, there will be no pressure on him
Ind vs Aus 2020 :'There Will Be No Pressure Of Captaincy On Ajinkya Rahane'- Sunil Gavaskar

సిడ్నీ: తొలి టెస్టు తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లీ వెళ్లిపోయినా.. మిగతా మూడు టెస్టులలో టీమిండియాను నడిపించే అజింక్య రహానెపై ఎలాంటి ఒత్తిడి ఉండదని భారత బ్యాటింగ్‌ దిగ్గజం సునీల్‌ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. రహానె ఇంతకుముందే రెండుసార్లు టెస్టు మ్యాచ్‌లకు సారథ్య బాధ్యతలు చేపట్టాడని, వాటిల్లో భారత్‌ను విజేతగా నిలిపాడని సన్నీ గుర్తుచేశాడు. సుదీర్ఘ పర్యటనలో భాగంగా టీమిండియా ఆసీస్ గడ్డపై ఉన్న విషయం తెలిసిందే. వన్డే, టీ20 సిరీస్‌ను ముగించుకుని.. ప్రస్తుతం టెస్ట్ సిరీస్ కోసం సిద్ధమవుతోంది. డిసెంబరు 17 నుంచి నాలుగు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది.

స్టార్ స్పోర్ట్స్ షో 'గేమ్ ప్లాన్'లో సునీల్‌ గవాస్కర్ మాట్లాడుతూ... 'నిజానికి ప్టెన్సీ విషయంలో అజింక్య రహానెపై ఎలాంటి ఒత్తిడి ఉండదు. ఎందుకంటే అతడు ఇంతకుముందే రెండుసార్లు టెస్టు మ్యాచ్‌లకు సారథ్య బాధ్యతలు చేపట్టాడు. అంతేకాదు వాటిల్లో భారత్‌ను విజేతగా నిలిపాడు. ధర్మశాలలో ఆస్ట్రేలియాపై ఒకసారి, అఫ్గానిస్థాన్‌పై ఒకసారి రహానె టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్నాడు. ఈ నేపథ్యంలో అతడిపై ఎలాంటి ఒత్తిడి ఉండదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో విరాట్ కోహ్లీ వెళ్లిపోయాక తనే కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాలనే విషయం రహానెకు తెలుసు' అని అన్నాడు.

'ప్రస్తుతం అజింక్య రహానె 3 టెస్ట్ మ్యాచులకు మాత్రమే కెప్టెన్. కాబట్టి కెప్టెన్‌గా ఉండడం లేదా కెప్టెన్‌గా కొనసాగడం అనే వాస్తవం అతని బాగా తెలుసు. ఈ విషయంపై అసలు రహానె ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఒక ఆటగాడిగా ఎంత నిబద్ధతతో ఉంటాడో కెప్టెన్‌గానూ అంతే కచ్చితత్వంతో ఉంటాడు. టెస్ట్ స్పెసలిస్ట్ చటేశ్వర్ పుజారాతో కలిసి అతడు ఆస్ట్రేలియాపై ఆధిపత్యం చెలాయిస్తాడు అని గట్టిగా నమ్ముతున్నా. పుజారా అండతో రహానె బాగా ఆడతాడు' అని భారత బ్యాటింగ్‌ దిగ్గజం సునీల్‌ గవాస్కర్ ధీమా వ్యక్తం చేశాడు.

గత పర్యటనలో రెచ్చిపోయిన పుజారా ఈసారి కూడా అలాంటి ప్రదర్శనే చేయాలని సునీల్‌ గవాస్కర్ ఆకాంక్షించాడు. క్రీజులో ఎక్కువ సేపు నిలదొక్కుకోవాలన్నాడు. ఇటీవలి కాలంలో పుజారా క్రికెట్‌ ఆడినా, ఆడకపోయినా దాని ప్రభావం ఉండదన్నాడు. ఎందుకంటే అతడు మానసికంగా చాలా దృఢంగా ఉన్నట్లు సన్నీ చెప్పుకొచ్చాడు. గత రెండేళ్లుగా పుజారా ఎంతో మెరుగయ్యాడని, షాట్లు కూడా కచ్చితత్వంతో కొడుతున్నాడని సన్నీ చెప్పుకొచ్చాడు. కోహ్లీ సతీమణి అనుష్క శర్మ జనవరిలో తల్లి కాబోతున్న సందర్భంగా అతడు ఆస్ట్రేలియా పర్యటన నుంచి తొలి టెస్టు తర్వాత వైదొలుగుతున్న సంగతి తెలిసిందే.

Story first published: Monday, December 14, 2020, 17:12 [IST]
Other articles published on Dec 14, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+