
పెద్ద లక్ష్యాలు లేవు..
'వాస్తవానికి మేం ఐపీఎల్‌లో ఎలాంటి గోల్స్ పెట్టుకోకుండానే బరిలోకి దిగుతుంటాం. ఎక్కడివరకు ఆడుతా.. ఆటను ఎలా ఫినిష్ చేయాలి అనే ఆలోచనలు మా మనసులోకి రానివ్వం. ఒకవేళ పెద్ద గోల్స్ ఏమైనా పెట్టుకొని సిద్ధమైతే మ్యాచ్ వరకు వచ్చేసరికి అమలు చేయడం కష్టమవుతుంది. అలాంటి ఆలోచనలు వస్తే మా ప్లాన్స్ దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి
ఇదే మా టీమ్‌లోని గొప్ప విషయం. మేం ఇప్పటికే చాలా ప్లే ఆఫ్స్ ఆడాం. ఎందుకంటే మేం ఎప్పుడూ దాని గురించి ఆలోచించలేదు. కానీ ప్రతీ మ్యాచ్‌ను ఎలా గెలవాలి, ప్రత్యర్థిని ఎలా ఓడించాలనేదానిపైనే ఫోకస్ చేస్తాం.

ఒకరికొకరం..
ఇక మా కెప్టెన్ డేవిడ్ వార్నర్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగి బౌలర్‌గా మా పనిని మరింత సులువు చేస్తాడు. గొప్ప విషయం ఏంటంటే జట్టులోని ప్రతీ ఒక్కరు తమ వంతుగా రాణిస్తూ ఇతరుల పనని సులభతరం చేసే ప్రయత్నం చేస్తారు. బౌలింగ్ విభాగానికి కూడా ఇది వర్తిస్తుంది. నట్టూ వచ్చి వికెట్ తీసుకున్నాడంటే మా పని సులువవుతుంది. అలాగే సందీప్, భువీ వికెట్లు తీస్తే.. నాకు సులువు అవుతుంది. ఎందుకంటే నేను బౌలింగ్‌కు వచ్చేసరికి బ్యాట్స్‌మన్ ఒత్తిడిలో ఉంటారు.'అని రషీద్ ఖాన్ చెప్పుకొచ్చాడు. ఈ సీజన్‌లో రషీద్‌పై సన్‌రైజర్స్, ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఏం చేస్తాడో.

అతి తక్కువ రన్స్ ఇచ్చిన బౌలర్..
2017లో ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేసిన ఈ అఫ్గాన్ స్టార్ అనతి కాలంలో వరల్డ్ క్లాస్ బౌలర్‌గా ఎదిగాడు. పొట్టి ఫార్మాట్‌లో తనదైన బౌలింగ్‌తో యావత్ క్రికెట్ ప్రపంచాన్ని మైమరిపిస్తున్నాడు. 2017 నుంచి ఇప్పటి వరకు మొత్తం 62 మ్యాచ్‌లు ఆడిన రషీద్ ఖాన్.. 6.24 ఎకానమీతో పొదుపుగా బౌలింగ్ చేశాడు. అంటే ఓవర్‌కు 6కు మించి పరుగులివ్వలేదన్నమాట. దాంతో కనీసం 100 ఓవర్లు బౌలింగ్ చేసిన ఆటగాళ్ల బెస్ట్ ఎకానమీ జాబితాలో రషీద్ అగ్రస్థానంలో ఉన్నాడు. యూఏఈ వేదికగా జరిగిన గత సీజన్‌లో అయితే రషీద్ 16 మ్యాచ్‌ల్లో 5.37 ఎకానమీతోనే పరుగులిచ్చాడు. 2019లో 6.28, 2018లో 6.73, 2017లో 6.62 ఎకానమీతో బౌలింగ్ చేశాడు. నాలుగు సీజన్లలో కలిపి మొత్తం 62 మ్యాచ్‌ల్లో 75 వికెట్లు పడగొట్టాడు.


Click it and Unblock the Notifications












