Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అది చూసి నా దిమ్మతిరిగింది.. నిజంగా ఆ రోజు మరవలేనిది: రషీద్ ఖాన్

Rashid Khan Says My brother messaged me that Mumbai Indians will pick me in IPL 2017 Auction

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2017 సీజన్ వేలంలో తనను రూ.4 కోట్లకు కొనుగోలు చేయడంతో తన మైండ్ బ్లాంక్ అయిందని అఫ్గానిస్థాన్ యువ సంచలనం రషీద్ ఖాన్ తెలిపాడు. తాను అంత ధర పలుకుతానని అస్సలు ఊహించలేదని ఈ వరల్డ్ బెస్ట్ లెగ్ స్పిన్నర్ చెప్పుకొచ్చాడు. అసలు తనను ఎవరూ కోనుగోలు చేయరని భావించానని చెప్పుకొచ్చాడు. తాజాగా ఓ ఇండియన్ టీవీ జర్నలిస్ట్‌తో ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో పాల్గొన్న రషీద్ ఖాన్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

టీ20 ప్రపంచకప్‌లో మెరిసి..

టీ20 ప్రపంచకప్‌లో మెరిసి..

భారత్ వేదికగా జరిగిన 2016 టీ20 ప్రపంచకప్‌లో అద్బుత ప్రదర్శన కనబర్చిన రషీద్.. అప్పుడే ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించాడు. ఆ మెగా టోర్నీలో 7 మ్యాచ్‌లు ఆడిన ఈ లెగ్ స్పిన్నర్ 6.53 ఎకానమీతో 11 వికెట్లు పడగొట్టాడు. అఫ్గాన్ లీగ్ దశ ధాటకపోయినా.. ఆ మెగా టోర్నీ చాంపియన్ అయి వెస్టిండీస్‌ను ఓడించి అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ విజయంలో రషీద్(2/26) కీలక పాత్ర పోషించాడు.

ఆ ట్వీట్స్ రోజు చదువుతా..

ఆ ట్వీట్స్ రోజు చదువుతా..

ప్రపంచకప్ టోర్నీ జరుగుతుండగా తన ప్రతిభను గుర్తిస్తూ భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ చేసిన ట్వీట్లను తాను ఇప్పటికి పదిలంగా ఉంచుకున్నానని, ప్రతీ రోజు వాటిని చదువుతానని రషీద్ ఖాన్ ఈ ఇన్‌స్టా లైవ్ సెషన్‌లో వెల్లడించాడు.‘యంగ్ రషీద్ ఖాన్ అద్భుత బౌలర్. ఐపీఎల్ జట్లు అతన్ని గమనిస్తున్నాయని ఆశిస్తున్నా.'అని ఆకాష్ చోప్రా ట్వీట్ చేయగా.. ‘అఫ్గానిస్థాన్‌కు చెందిన రషీద్ ఖాన్‌ను మరిచిపోవద్దు'అని మైకెల్ వాన్ ట్వీట్ చేశాడు.

‘ఆ రెండు ట్వీట్లను నేను సేవ్ చేసుకున్నాను. ప్రతీ రోజు వాటిని చదువుతుంటా. ఐపీఎల్ 2017 వేలం సమయంలో నేను జింబాబ్వే పర్యటనలో ఉన్నా. అప్పుడు అక్కడ ఉదయం 5 అయిందనుకుంటా.'అని తెలిపాడు.

తాహీర్ అమ్ముడు పోకపోవడంతో..

తాహీర్ అమ్ముడు పోకపోవడంతో..

స్పిన్నర్ పూల్‌లో ఇమ్రాన్ తాహీర్‌ను కొనుగోలు చేయకపోవడంతో తనను కూడా ఎవరు తీసుకోరనుకున్నానని, ఎన్నో అనుమానాలు వచ్చాయన్నాడు. తాహిర్ వంటి బెస్ట్ స్పిన్నర్‌కే అవకాశం దక్కనప్పుడు తనకు కష్టమేనని భావించానన్నాడు. కానీ తన సోదరుడు నుంచి ముంబై ఇండియన్స్ తన కోసం బిడ్ దాఖలు చేసినట్లు మెసేజ్ వచ్చిందన్నాడు. ముంబై ఇండియన్స్ కోచ్ మహేలా జయవర్దనే తన కోసం ఆసక్తి కనబర్చినట్లు చెప్పాడు. ఇక అంతకుముందు బీపీఎల్‌లో జయవర్దనే, సంగక్కరలను తాను ఔట్ చేసినట్లు ఈ లెగ్ స్పిన్నర్ గుర్తు చేసుకున్నాడు.

ఎవరూ తీసుకోరనుకున్నా..

ఎవరూ తీసుకోరనుకున్నా..

అనంతరం తన కోసం ఫ్రాంచైజీలు పోటీపడ్డాయని చివరకు సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.4 కోట్లకు కోనుగోలుచేసిందని నాటి క్షణాలను రషీద్ నెమరవేసుకున్నాడు. ‘ఆ సమయంలో టాప్ స్పిన్నర్‌గా ఉన్న ఇమ్రాన్ తాహిర్ కోసం ఎవరు బిడ్ దాఖలు చేయలేదు. చివరకు అతను అమ్ముడుపోలేదు. దీంతో స్పిన్నర్లపై ఆ సీజన్‌లో ఫ్రాంచైజీలు ఆసక్తికనబరుస్తలేవనుకున్నా. నన్ను కూడా ఎవరు తీసుకోరనుకున్నా. కానీ నా సోదరుడు ముంబై ఇండియన్స్ కోచ్ మహేళ జయవర్దనే నాపై బిడ్ దాఖలు చేసినట్లు మెసేజ్ చేశాడు.

ఎందుకంటే నేను బీపీఎల్‌లో అతన్ని ఔట్ చేశాను. దీంతో నన్ను తీసుకోవాలని భావించాడు. నా బిడ్ ప్రారంభం కాగానే నేను షాక్‌కు గురయ్యాను. ఆశ్చర్యపోయాను. ఫ్రాంచైజీల పోటీ చూసి నా మైండ్ బ్లాంక్ అయింది. అది నా జీవితంలోనే మరిచిపోలేని రోజు'అని రషీద్ చెప్పుకొచ్చాడు.

Story first published: Thursday, May 14, 2020, 20:10 [IST]
Other articles published on May 14, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+