Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అతనికి బౌలింగ్ చేయడం కష్టం: రషీద్ ఖాన్

 Rashid Khan says Indian Youngster Whom He Finds Hard To Bowl To

న్యూఢిల్లీ: తన స్పిన్ మాయాజాలంతో దిగ్గజ బ్యాటర్లను గజ గజ వణికించిన అఫ్గానిస్థాన్ సంచలనం, గుజరాత్ టైటాన్స్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌కు యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌కు చేయడం కష్టమట. ఈ విషయాన్ని అతనే వెల్లడించాడు. గిల్ అద్భుతమైన బ్యాట్స్‌మన్ అని చెప్పిన రషీద్.. అదృష్టవశాత్తు ఒకే జట్టులో ఉండటంతో అతనికి బౌలింగ్ చేసే అవకాశం తప్పిందన్నాడు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'శుభ్‌మన్ గిల్‌తో ఇక్కడ ఉన్నందుకు చాలా గర్వంగా ఉంది. అతను చాలా కష్టపడే వ్యక్తి. జట్టులో ఆటగాళ్లలో ఉత్సాహం నింపుతాడు. అతని వద్ద ఉన్నందుకు సంతోషంగా ఉంది. టోర్నీలో శుభ్‌మన్ గిల్ ఆడిన తీరు నమ్మశక్యంగా లేదు. మ్యాచ్ జరుగుతున్నప్పుడు అతినికి బౌలింగ్ చేయడం కష్టం. కానీ అదృష్టవశాత్తు ఇద్దరం ఒకే జట్టులో ఉన్నాం'అని రషీద్ ఖాన్ చెప్పుకొచ్చాడు.

ఐపీఎల్ 2022 సీజన్‌లో గిల్ 16 మ్యాచ్‌ల్లో 34.50 సగటుతో 365 పరుగులు చేశాడు. ఫైనల్లో సిక్స్ కొట్టి గుజరాత్‌కు విజయాన్ని అందించాడు. మరోవైపు రషీద్ ఖాన్ 16 మ్యాచ్‌ల్లో 6.59 ఎకానమీతో 19 వికెట్లు పడగొట్టి గుజరాత్ కప్పు కొట్టడంలో కీలక పాత్ర పోషించాడు.

Story first published: Wednesday, June 1, 2022, 22:58 [IST]
Other articles published on Jun 1, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+