
కీలక బౌలర్‌గా
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఏబీ డివిలియర్స్, శిఖర్ ధావన్, రిషబ్ పంత్, ఎంఎస్ ధోనీ, సురేష్ రైనా, ఫాఫ్ డుప్లెసిస్, క్రిస్ గేల్, ఆండ్రీ రసెల్, ఇయాన్ మోర్గాన్, జొస్ బట్లర్, స్టీవ్ స్మిత్ లాంటి స్టార్ ఆటగాళ్లను సైతం రషీద్ ఖాన్ బౌలింగ్‌లో ఆచితూచి ఆడుతారు. అయితే ఇంతలా తన బౌలింగ్ మెరుగవ్వడానికి సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టే కారణం అని అతడు చెప్పాడు.
2017లో ఎస్‌ఆర్‌హెచ్ జట్టులో రషీద్ చేరాడు. అప్పటినుంచి అదే జట్టులో కొనసాగుతున్నాడు. అంచలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం కీలక బౌలర్‌గా మారాడు. విదేశీ కోటాలో రషీద్ కచ్చితంగా తుది జట్టులో ఉండేలా మేనేజ్మెంట్ చూసుకుంటోంది అంటే.. అతడి ప్రభావం ఎంతలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

ఇదంతా ఎస్‌ఆర్‌హెచ్ వల్లే
తాజాగా క్రిక్‌బజ్‌లో రషీద్ ఖాన్ మాట్లాడుతూ... '2017లో నేను సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్)లో చేరాను. ఆ తర్వాతే నా బౌలింగ్ పూర్తిగా మారిపోయింది. ఫిట్‌నెస్, నైపుణ్యాలు అన్ని ఎంతో మెరుగయ్యాయి. మానసికంగా కూడా చాలా బలంగా మారాను. డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, శిఖర్ ధావన్ మరియు భువనేశ్వర్ కుమార్ భాయ్ చాలా మెళుకువలు చెప్పారు.
నా బౌలింగ్ గురించి చాలాసార్లు మాట్లాడారు. అది నా ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది. ప్రస్తుతం టీ20ల్లో నంబర్‌వన్ బౌలర్‌గా ఉండడానికి కారణం ఎస్‌ఆర్‌హెచ్ అని కచ్చితంగా చెప్పగలను. ఎస్‌ఆర్‌హెచ్ వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను' అని తెలిపాడు.
WTC Final 2021: విరాట్ కోహ్లీని అందుకే కౌగిలించుకున్నా: కేన్ మామ

ఎన్నో మరపురాని వికెట్లు
'నిజం చెప్పాలంటే నాకెన్నో మరపురాని వికెట్లున్నాయి. కానీ టీ20ల్లో నా ఉత్తమమైన మూడు వికెట్లు ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ మాత్రమే. ఈ ముగ్గురికి నేను బౌలింగ్ చేశా. చాలా సార్లు వీరిని ఔట్ చేశా. కొన్నిసార్లు క్యాచ్‌లు, మరికొన్ని సార్లు ఎల్బీడబ్ల్యూల రూపంలో పెవిలియన్‌కు పంపించాను. ఇలాంటి దిగ్గజాలకు బౌలింగ్ చేయడం నాకు దక్కిన పెద్ద ఘనత. వీరికి బౌలింగ్ చేయడం చాలా కష్టమైన పని. ఈ ముగ్గురిని ఔట్ చేసిన విషయాన్ని నా మదిలో ఎప్పటికీ గుర్తుంచుకుంటా' అని తాజాగా రషీద్ చెప్పాడు. రషీద్ అఫ్గాన్ తరఫున 5 టెస్టులు, 74 వన్డేలు, 51 టీ20లు ఆడాడు.

పలు రికార్డులు
22 ఏళ్ల రషీద్ ఖాన్ ఇప్పటికే పలు రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. ప్రస్తుత తరంలో ఎవరికీ సాధ్యంకాని ఓ అరుదైన ఘనతను అతడు సొంతం చేసుకున్నాడు. 21వ శతాబ్దంలో ఒకే టెస్ట్‌లో అత్యధిక ఓవర్లు వేసిన బౌలర్‌గా రషీద్ రికార్డు నెలకొల్పాడు. గత మార్చిలో జింబాబ్వేతో జరిగిన టెస్ట్‌లో రషీద్ 99.2 ఓవర్లు వేసి చరిత్ర సృష్టించాడు.
తొలి ఇన్నింగ్స్‌లో 36.3 ఓవర్లు వేసి 4 వికెట్లు తీసిన రషీద్.. రెండో ఇన్నింగ్స్‌లో 62.5 ఓవర్లు బౌలింగ్ చేసి 7 వికెట్లు పడగొట్టాడు. 2002లో కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఓ టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ 98 ఓవర్లు వేశాడు. ఆ రికార్డును రషీద్ బ్రేక్ చేశాడు. అయితే ఒక టెస్టులో అత్యధిక ఓవర్లు వేసిన ఘనత మాత్రం శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ పేరిట ఉంది. 1998లో ఓవల్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో మురళీధరన్ 113.5 ఓవర్లు బౌల్ చేశాడు.


Click it and Unblock the Notifications












