Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అచ్చం ధోనీలాగే.. ర‌షీద్ ఖాన్ హెలికాప్టర్‌ షాట్‌ ఇరగదీశాడుగా (వీడియో)

Rashid Khan does an MS Dhoni, pulls off helicopter shot once again

కాబుల్: క్రికెట్‌ చరిత్రలో హెలికాఫ్టర్ షాట్ అనగానే వెంటనే గుర్తొచ్చే పేరు భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ. బ్యాట్‌ను హెలికాఫ్టర్ రెక్కల్లా గుండ్రగా తిప్పుతూ ధోనీ కొట్టే సిక్సులు చాలా ఫేమస్. ధోనీ ఈ షాట్ కొడితే.. కచ్చితంగా బంతి స్టాండ్స్‌లోకి వెళ్లాల్సిందే. ధోనీ ప్రవేశపెట్టిన ఈ షాట్‌ను ఎందరో యువ క్రికెటర్లు ఆడేందుకు ప్రయత్నించారు. వీరిలో కొందరు సఫలమైతే.. మరి కొందరికి మాత్రం పరాభవం తప్పలేదు. హార్డిక్ పాండ్యా సఫలం కాగా.. వెస్టిండీస్ ఆటగాడు కీమో పాల్‌ విఫలమయ్యాడు. తాజాగా ఆఫ్ఘనిస్తాన్ ఆల్ రౌండర్ రషీద్ ఖాన్ కూడా ప్రత్నించాడు.

రషీద్‌ హెలికాప్టర్‌ షాట్:

అచ్చం ఎంఎస్ ధోనీలాగే.. అఫ్గానిస్థాన్‌ స్పిన్నర్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) ఆటగాడు రషీద్‌ ఖాన్‌ హెలికాప్టర్‌ షాట్‌ ఆడి అలరించాడు. కాకపోతే రషీద్‌ ఆడింది క్రికెట్‌ బంతితో కాదు.. టెన్నిస్‌ బంతితో. లో ఫుల్‌టాస్‌ వచ్చిన బంతిని అమాంతం లాంగ్‌ ఆన్‌లోకి బాదాడు. గ్రౌండ్‌లో ప్రాక్టీస్ చేస్తున్న ర‌షీద్.. అఫ్గనిస్తాన్‌ సాంప్రదాయ దుస్తుల్లో కనిపించాడు. ఆ వీడియోను ఎస్‌ఆర్‌హెచ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోగా అభిమానులు తెగ లైక్‌ చేస్తున్నారు.

బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందుకు తీసుకురావాలి:

బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందుకు తీసుకురావాలి:

రషీద్‌ను బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందుకు తీసుకురావాలని, ఈ సారి సన్‌రైజర్స్‌ ఛాంపియన్‌గా నిలుస్తుందని పలువురు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. బౌలింగ్‌తో ఎంత‌టి బ్యాట్స్‌మన్‌ను అయినా తిక‌మ‌క పెట్టే రషీద్‌ ఖాన్‌.. బ్యాటింగ్‌లో కూడా అప్పడప్పుడూ మెరుస్తూ ఉంటాడు. ఆల్ రౌండ‌ర్‌ రషీద్..‌ ఎక్కువగా 6వ‌ స్థానంలో బ్యాటింగ్‌లో దిగినప్ప‌టికీ జ‌ట్టుకు విజ‌యాన్ని అందించిన సందర్భాలు కూడా ఉన్నాయి.

46 మ్యాచ్‌లు.. 55 వికెట్లు:

46 మ్యాచ్‌లు.. 55 వికెట్లు:

2017 ఐపీఎల్లో స‌న్ రైజ‌ర్స్ త‌ర‌ఫున ర‌షీద్ ఖాన్ అరంగేంట్రం చేశాడు. ప్రతీ సీజన్‌లోనూ తనదైన మార్కును చూపెడుతున్న రషీద్‌.. ఇప్ప‌టి వ‌ర‌కూ 46 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి 6.55 ఎకాన‌మీతో 55 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఇన్ని రోజులు కరోనా వైరస్ మహమ్మారి పరిస్థితుల కారణంగా వాయిదా పడ్డ ఐపీఎల్‌ పదమూడో సీజన్‌కు ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. సెప్టెంబర్‌ 19 నుంచి యూఏఈలో నిర్వహించనున్నట్లు ఆ టోర్నీ ఛైర్మన్‌ బ్రిజేశ్‌ పటేల్‌ శుక్రవారం వెల్లడించారు.

ప్రపంచకప్ గెలిచిన తర్వాతే:

ప్రపంచకప్ గెలిచిన తర్వాతే:

అఫ్గాన్ జట్టులో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ అయిన రషీద్‌ను పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ్? అని ఆజాది రేడియో ఇంటర్వ్యూలో ఇటీవల అడగ్గా.. అతడు ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. 'అఫ్గానిస్థాన్ ప్రపంచకప్ గెలిచిన తర్వాతే పెళ్లి చేసుకుంటా' అని బదులిచ్చాడు. ప్రస్తుత శకంలో అద్భుత బౌలర్‌గా కొనసాగుతున్న రషీద్.. పొట్టి ఫార్మాట్‌లో అనేక రికార్డులు కొల్లగొడుతున్నాడు. ఇప్పటికే టీ20 క్రికెట్‌లో 290 వికెట్లు పడగొట్టి తమ దేశం తరఫున ఈ ఘనతను అందుకున్న ఏకైక క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు.

ఎప్పటికీ అదే నా చివరి కోరికగా ఉండాలి: కోహ్లీ

Story first published: Saturday, July 25, 2020, 15:03 [IST]
Other articles published on Jul 25, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+