For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

SA vs AFG: ఆ ఒక్క తప్పిదమే మా ఓటమిని శాసించింది: రషీద్ ఖాన్

పవర్ ప్లేలో వరుసగా వికెట్లు కోల్పోవడం తమ ఓటమిని శాసించిందని అఫ్గానిస్థాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ అన్నాడు. ఓపెనర్ రెహ్మానుల్లా గుర్బాజ్ అద్భుతంగా ఆడాడని చెప్పిన రషీద్ ఖాన్.. సూపర్ ఓవర్‌లో కాస్త తెలివిగా బ్యాటింగ్ చేయాల్సిందని అభిప్రాయపడ్డాడు.

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా సౌతాఫ్రికాతో బుధవారం ఉత్కంఠగా సాగిన తమ రెండో మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ డబుల్ సూపర్ ఓవర్‌లో ఓటమిపాలైంది. సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్‌ను అఫ్గానిస్థాన్ చేజార్చుకుంది. టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే డబుల్ సూపర్ ఓవర్‌లో గెలిచిన తొలి జట్టుగా సౌతాఫ్రికా చరిత్ర సృష్టించింది.

పవర్ ప్లేలో వికెట్లు కోల్పోవడం..

ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన రషీద్ ఖాన్.. తమ ఆటగాళ్ల ప్రదర్శనను కొనియాడాడు. 'మా బౌలర్లు అసాధారణ ప్రదర్శన కనబర్చారు. 10 ఓవర్లలోనే 100 పరుగులు చేసిన సౌతాఫ్రికా‌ను 190 పరుగుల లోపు కట్టడి చేయడం మాములు విషయం కాదు. మా బౌలర్లు అద్భుతమైన పోరాట పటిమను కనబర్చారు.

గుర్బాజ్ తనదైన శైలిలో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. మాకు గొప్ప ఆరంభాన్ని ఇచ్చాడు. పవర్‌ప్లే చివర్లో వరుసగా మూడు వికెట్లు కోల్పోవడం మమ్మల్ని వెనక్కి నెట్టింది. దాంతో గుర్బాజ్ కూడా కాస్త ఒత్తిడికి గురై నెమ్మదించాల్సి వచ్చింది. అయినప్పటికీ సూపర్ ఓవర్‌లో 3 సిక్సర్లు కొట్టి మ్యాచ్‌ను చివరి వరకు తీసుకెళ్లడం అద్భుతం.

Rashid Khan Blames Powerplay Collapse After South Africa Win in Historic Double Super Over in T20 World Cup 2026

ఇజ్జత్ కోసం ఆడుతాం..

సూపర్ ఓవర్‌లో మేం కాస్త తెలివిగా బ్యాటింగ్ చేయాల్సింది. మాకు విజయవకాశాలు లభించాయి. కానీ బ్యాటింగ్ చేసేటప్పుడు ఇంకాస్త తెలివిగా వ్యవహరించి ఉండాల్సింది. ఒక మంచి డైవ్ లేదా ఒక మంచి బంతి.. ఫలితాన్ని మార్చేసేవి. 1 బంతికి 5 పరుగులు అంటే అది ఎవరికైనా సాధ్యమే. ఈ మ్యాచ్ నుంచి మేం నేర్చుకోవాల్సింది చాలా ఉంది.

గత ఏడాదిన్నర కాలంగా ఈ ఒక్క మ్యాచ్ గెలిచి తదుపరి రౌండ్‌కు వెళ్లాలని కష్టపడ్డాం. ఇది చాలా నిరాశ కలిగించే విషయం. కుర్రాళ్ళను మళ్ళీ మానసికంగా సిద్ధం చేయడం కష్టం. కానీ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు ఆత్మగౌరవం కోసం ఆడాలి. మా దేశ ప్రజలు మా నుంచి విజయాలను కోరుకుంటున్నారు. వచ్చే మ్యాచ్‌లో మరింత దృఢమైన మనస్తత్వంతో..గొప్ప ప్రణాళికలతో బరిలోకి దిగుతాం.'అని రషీద్ ఖాన్ చెప్పుకొచ్చాడు.

ఉత్కంఠకే ఊపిరి అందని మ్యాచ్..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 187 పరుగులు చేయగా.. అనంతరం అఫ్గానిస్థాన్ 19.4 ఓవర్లలో 187 పరుగులకే ఆలౌటైంది. తొలి సూపర్ ఓవర్‌లో అఫ్గాన్ 17 పరుగులు చేయగా.. సౌతాఫ్రికా కూడా సరిగ్గా 17 పరుగులే చేసింది. రెండో సూపర్ ఓవర్‌లో సౌతాఫ్రికా 23 పరుగులు చేయగా.. అఫ్గానిస్థాన్ 19 పరుగులే చేసి ఓటమిపాలైంది. సూపర్ ఓవర్‌లో ఆఖరి బంతికి 5 పరుగులు చేయాల్సిన స్థితిలో గుర్బాజ్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.

Story first published: Wednesday, February 11, 2026, 18:09 [IST]
Other articles published on Feb 11, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+