
అమెరికా తమ సైన్యాన్ని తొలగిస్తుండటంతో
తాలిబన్ల అరాచకత్వంతో ప్రస్తుతం అఫ్గానిస్థాన్ అట్టుడుకుతోంది. అమెరికా తమ సైన్యాన్ని క్రమక్రమంగా తొలగిస్తుండటంతో.. అక్కడ అశాంతి తాండవిస్తోంది. ఇదే అదునుగా తాలిబన్లు ఉగ్రదాడులతో చెలరేగుతున్నారు. దేశంలోని ఒక్కో ప్రాంతాన్ని తాలిబన్లు తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. దీంతో ఆఫ్ఘన్ సైన్యం, తాలిబన్ల మధ్య యుద్ధం సాధారణ ప్రజలను బలి తీసుకుంటోంది. దీంతో పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. హెల్మండ్, కాందహార్, హెరాత్ రాష్ట్రాల్లో నెల రోజుల నుంచి ప్రజలపై దాడులు జరుగుతున్నాయి. మంగళవారం ఒక్కరోజే వెయ్యికి పైగా ప్రజలు మరణించడమో లేదా గాయపడటమో జరిగిందని సమాచారం తెలుస్తోంది.
తట్టుకోలేకపోతున్న రషీద్
మే 1 నుంచి అమెరికా తమ సేనలను వెనక్కి పిలిపిస్తోంది. అప్పట్నుంచి వరుసగా ఉగ్ర దాడులు జరుగుతున్నాయి. అఫ్గాన్‌లోని 400 జిల్లాలను ఇప్పటికే తాలిబన్లు ఆక్రమించారు. అయినప్పటికీ ఆగస్టు 31లోపు ఆ దేశం నుంచి పూర్తిగా సైన్యాన్ని వెనక్కి రప్పించేందుకు అమెరికా నిర్ణయం తీసుకుంది. తమ దేశం రావణకాష్టంగా మారుతుండటాన్ని చూసి తట్టుకోలేకపోతున్న స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్.. తమను ఇలా గందరగోళంలో వదిలేయకండి అని ప్రపంచ నేతలను వేడుకుంటున్నాడు.

నా దేశాన్ని రక్షించండి
'ప్రియమైన ప్రపంచ నాయకులారా.. నా దేశంలో అరాచకత్వం రాజ్యమేలుతోంది. ప్రతిరోజు అమాయకులైన పిల్లలు, మహిళలు సహా పౌరులు వేల సంఖ్యలో మరణిస్తున్నారు. ఇళ్లు, ఆస్తులు ధ్వంసం అవుతున్నాయి. వేల కుటుంబాలు తరలిపోతున్నాయి. మమ్మల్ని అరాచకత్వంలో వదిలేయకండి. అఫ్గాన్ పౌరుల మరణాలు, అఫ్గానిస్థాన్ నాశనాన్ని ఆపేయండి. మాకు శాంతి కావాలి' అని రషీద్ ఖాన్ ట్వీట్ చేశాడు.
అతడి ట్వీట్‌కు ప్రజల నుంచి భారీ మద్దతు లభిస్తోంది. పాకిస్థాన్ ఉగ్రవాదానికి పుట్టినిల్లని, ఉగ్రవాదాన్ని అది పెంచిపోషిస్తోందని విమర్శలు చేస్తున్నారు. రషీద్ అఫ్గాన్ తరఫున 5 టెస్టులు, 74 వన్డేలు, 51 టీ20లు ఆడాడు.
IND vs ENG: భారత్-ఇంగ్లండ్ రెండో టెస్ట్.. డ్రీమ్ 11 ప్రిడిక్షన్స్, కెప్టెన్, వైస్ కెప్టెన్ టిప్స్!!

ఐపీఎల్ 2021లో రాణించాడు
ఐపీఎల్ 2021లో రషీద్ ఖాన్ అద్భుతంగా రాణించాడు. సహచర బౌలర్లు భారీగా పరుగులు ఇచ్చినా.. అతడు మాత్రం ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌ను కట్టడిచేశాడు. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ దారుణంగా విఫలమైంది. 7 మ్యాచ్‌ల్లో కేవలం ఒకే ఒకటి గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది.
బయో బబుల్ మధ్య సజావుగా సాగుతున్న ఐపీఎల్ 2021పై కరోనా కమ్మేసింది. లీగ్ వాయిదా పడే సమయానికి 29 మ్యాచ్‌లు పూర్తవ్వగా.. మరో 31 మ్యాచ్‌లు నిర్వహించాల్సి ఉంది. అయితే సెప్టెంబర్‌లో ఈ క్యాచ్ రిచ్ లీగ్ సెకండ్ ఫేజ్‌ను బీసీసీఐ నిర్వాహ్ణచనుంది. యూఏఈ వేదికగా మ్యాచులు జరగనున్నాయి.

టీ20 కెప్టెన్‌గా రషీద్
స్టార్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ అఫ్ఘానిస్థాన్ టీ20 కెప్టెన్‌గా ఇటీవలే ఎంపికయ్యాడు. టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని రషీద్‌ను కెప్టెన్‌గా నియమించినట్టు అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) అధికారికంగా ప్రకటించింది. రషీద్ చేతికి టీ20 టీమ్ పగ్గాలు అందగా.. వన్డే, టెస్టు జట్టు కెప్టెన్‌గా హస్మతుల్లా షాహిది సెలెక్ట్ అయ్యాడు.
ఈ ఏడాది ఆరంభంలో మూడు ఫార్మాట్లకూ అస్గర్ అఫ్ఘాన్‌ను బాధ్యతల నుంచి తప్పించారు. భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ బీభత్సం సృష్టించిన నేపథ్యంలో టోర్నీ నిర్వహణ వేదికను యూఏఈకి మార్చాల్సి వచ్చింది.
బీసీసీఐ ఆతిథ్యంలోనే ప్రపంచకప్ మొత్తం జరుగనుంది. టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్-బిలో అఫ్గానిస్థాన్ ఉండగా.. ఆ గ్రూప్‌లో భారత్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా జట్లు కూడా ఉన్నాయి. అఫ్గానిస్థాన్ టాప్ జట్లను ఓడించడం కష్టమే.


Click it and Unblock the Notifications












