
కలవరపెడుతోన్న కోహ్లీ, పుజారా ఫామ్
తొలి టెస్ట్ అనంతరం కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ తాము మిగతా నాలుగు టెస్ట్‌ల్లోనూ నలుగురు పేసర్లు, ఓ స్పిన్నర్ ఫార్మూలానే కొనసాగిస్తామన్నాడు. తుది జట్టులో పెద్దగా మార్పులు ఉండవనే హింట్ ఇచ్చాడు. మొదటి ఫస్ట్ టెస్ట్‌లో ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఫర్వాలేదనిపించారు. రెండు ఇన్నింగ్స్‌ల్లో శుభారంభాన్ని అందించారు.
అయితే రోహిత్ భారీ స్కోర్ బాకీ ఉన్నాడు. కోహ్లీ గోల్డెన్ డక్‌తో తీవ్రంగా నిరాశపరిచాడు. అతను తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. చతేశ్వర్ పుజారా తన వైఫల్యాన్ని కొనసాగిస్తుండగా.. అజింక్య రహానే తడబడుతున్నాడు. రిషభ్ పంత్ కూడా ఆకట్టుకోలేకపోయాడు. వీరు ఫామ్ అందుకుంటే భారత బ్యాటింగ్ విభాగం బలోపేతం కానుంది.

శార్దూల్ ఠాకూర్/ఇషాంత్ శర్మ
ఏకైక స్పిన్నర్‌గా బ్యాటింగ్ సామర్థ్యం కలిగిన రవీంద్ర జడేజాకే మరోసారి అవకాశం దక్కనుంది. ఫస్ట్ టెస్ట్‌లో జడేజా బౌలర్‌గా రాణించకపోయినా.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు. దాంతో స్పెషలిస్ట్ స్పిన్నర్ అయిన రవిచంద్రన్ అశ్విన్ మరోసారి బెంచ్‌కే పరిమితం కావాల్సి ఉంటుంది. పేసర్లుగా జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్‌కు అవకాశం దక్కనుంది.
ఈ నలుగురు ఫస్ట్ టెస్ట్‌లో దుమ్ములేపారు. అయితే శార్దూల్ పిక్క కండరాల గాయంతో బాధపడుతున్నాడట. రెండో టెస్ట్ కోసం మంగళవారం సాధన చేసేటప్పుడు అతడి కండరాలు పట్టేశాయి. శార్దూల్ గాయం తీవ్రతపై ఇప్పటి వరకు స్పష్టమైన సమాచారమైతే లేదు. ఆడలేని పరిస్థితిలో ఉంటే మాత్రం సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ రెండో టెస్ట్ ఆడనున్నాడు.
IND vs ENG: భారత్, ఇంగ్లండ్ జట్లకు షాక్.. డబ్ల్యూటీసీ పాయింట్లలో కోత! కారణం ఏంటంటే?

బ్రాడ్ స్థానంలో మార్క్ వుడ్
తొలి టెస్టులో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ మినహా మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ రాణించకపోవడంతో ఆల్‌రౌండర్ జాబితాలో మోయిన్ అలీని తిరిగి జాతీయ జట్టుకు పిలిపించినట్లు తెలుస్తోంది. ఆటగాళ్లంతా ఇలాగే సరైన ప్రదర్శన చేయకపోతే కచ్చితంగా జట్టులో మార్పు ఉంటుందని కోచ్ సిల్వర్‌వుడ్ ఇదివరకే స్పష్టం చేశాడు.
తొలి టెస్టులో డేనియల్ లారెన్స్ మోస్తరు ప్రదర్శనకే పరిమితమయ్యాడు. 0, 25 రన్స్ చేసిన అతడి స్థానంలో అలీ ఆడే అవకాశాలు ఉన్నాయి. ఇక జాక్ క్రాలీ కూడా నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 27 రన్స్ చేయగా.. రెండో ఇన్నింగ్స్‌లో 6 పరుగులు మాత్రమే చేశాడు. అంతేకాదు గత 7 టెస్టులో అతడి యావరేజ్ 11 మాత్రమే ఉంది. దీంతో క్రాలీపై వేటు పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అతడి స్థానంలో హసీబ్ హమీద్ జట్టులోకి రానున్నాడు. ఇక స్టార్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ గాయపడ్డాడు. మంగళవారం సాధన చేస్తుండగా స్టువర్ట్ బ్రాడ్ కాలి మడమ మలుచుకుందని అంటున్నారు. బ్రాడ్ స్థానంలో మార్క్ వుడ్ ఆడనున్నాడు.

తుది జట్లు (అంచనా)
భారత్: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్యా రహానే (వైస్ కెప్టెన్), రిషభ్ పంత్ (కీపర్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్/ఇషాంత్ శర్మ, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా.
ఇంగ్లండ్: రోరి బర్న్స్, డామ్ సిబ్లే, జాక్ క్రాలీ/హసీబ్ హమీద్, జో రూట్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, డేనియల్ లారెన్స్/మొయిన్ అలీ, జొస్ బట్లర్ (కీపర్), సామ్ కరన్, ఓలీ రాబిన్‌సన్, స్టువర్ట్ బ్రాడ్/మార్క్ వుడ్, జేమ్స్ ఆండర్సన్.

డ్రీమ్ 11 టీమ్:
కేఎల్ రాహుల్, జానీ బెయిర్‌స్టో, జో రూట్ (కెప్టెన్), అజింక్యా రహానే, రిషభ్ పంత్ (కీపర్), రవీంద్ర జడేజా, సామ్ కరన్, మొయిన్ అలీ, జేమ్స్ ఆండర్సన్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ.


Click it and Unblock the Notifications












