Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆశ్చర్యపరిచిందా?: రషీద్ మెరుపు ఇన్నింగ్స్‌పై యూసఫ్ పఠాన్

Rashid blitz was not a surprise: Yusuf

హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా శుక్రవారం రాత్రి కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన రెండో క్వాలిఫియర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు బ్యాట్‌తో చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు 18.1 ఓవర్లు ముగిసే సమయానికి 138/7తో నిలిచి తక్కువ స్కోరుకే పరిమితమయ్యేలా కనిపించినప్పటికీ, చివర్లో వరుస సిక్సర్లతో రషీద్ ఖాన్ చెలరేగడంతో హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

మ్యాచ్ అనంతరం రషీద్ ఖాన్ బ్యాటింగ్ ప్రదర్శన మిమ్మల్ని ఆశ్చర్యపరిచిందా? అని యూసఫ్ పఠాన్‌ని ప్రశ్నించగా ఎంతమాత‍్రం ఆశ్చర్యపరచలేదని తెలిపాడు. ఈ సందర్భంగా యూసఫ్ పఠాన్ మాట్లాడుతూ 'రషీద్ ఖాన్ చాలా ప్రతిభ ఉన్న క్రికెటర్. రషీద్‌ బ్యాట్‌తో మెరుపులు మెరిపించడం మమ్మల్ని ఆశ్చర్య పరచలేదు. అతను చాలా సందర్భాల్లో సిక్సర్లు, బౌండరీలతో విరుచుకుపడ్డాడు' అని అన్నాడు.

ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్

| సన్‌రైజర్స్ హైదరాబాద్ పూర్తి షెడ్యూల్

'బిగ్‌బాష్, ఇతర విదేశీ లీగ్స్‌లో రషీద్ మెరుగ్గా బ్యాటింగ్ చేస్తుంటాడు. అతని సామర్థ్యంపై మాకు నమ్మకం ఉంది. అందుకే అతన్ని ఒక స్థానం ముందుకు ప‍్రమోట్‌ చేశాం. ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లోనూ అతను రెండు చూడచక్కని సిక్సర్లు బాదాడు. అతడి ఆ హిట్టింగ్‌ మమ్మల్ని ఏమీ ఆశ్చర్యపరచలేదు. సన్‌రైజర్స్‌ పెట్టుకున్న నమ్మకాన్ని రషీద్‌ నిలబెట్టాడు' అని పఠాన్ వెల్లడించాడు.

ఈ మ్యాచ్‌లో రషీద్ ఖాన్ (34 నాటౌట్: 10 బంతుల్లో 2 ఫోర్లు, 4 ఫోర్లు) చివర్లో చెలరేగడంతో 174 పరుగుల భారీ స్కోరు అందించాడు. మ్యాచ్‌లో ఇదే కీలక మలుపు కాగా, బంతితోనూ రషీద్ ఖాన్ (3/19)తో అద్భుత ప్రదర్శన చేశాడు. దీంతో కోల్‌కతాపై 13 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. ఆదివారం వాంఖడె వేదికగా చెన్నైతో ఫైనల్లో తలపడనుంది.

Story first published: Saturday, May 26, 2018, 17:32 [IST]
Other articles published on May 26, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+