Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అచ్చం కపిల్ దేవ్ మాదిరి!: నటరాజ్ షాట్‌లో రణవీర్ సింగ్, సోషల్ మీడియాలో వైరల్

Ranveer Singh as Kapil Dev nails the cricketers iconic Natraj shot in new pic

హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ప్రస్తుతం కబీర్ ఖాన్ డైరెక్షన్‌లో క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్ జీవితచరిత్ర ఆధారంగా నిర్మిస్తోన్న '83' సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ ఒకటి అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఐకానిక్ నటరాజ్ షాట్‌కు సంబంధించిన ఫోటోను రణవీర్ సింగ్ తన ఇనిస్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నాడు. ఈ ఫోటోలో రణవీర్ సింగ్ అచ్చం కపిల్ దేవ్‌ని తలపిస్తోండటం విశేషం. ఈ ఫోటో ని పోస్టు చేసిన రణవీర్ సింగ్ "NATRAJ SHOT 🏏" అంటూ కామెంట్ పెట్టాడు.

6 వికెట్లతో దీపక్ చాహర్ విజృంభణ.. మూడో టీ20లో బంగ్లాపై భారత్ విజయం.. సిరీస్ కైవసం!!

సోషల్ మీడియాలో ఫోటో వైరల్

ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. మరోవైపు '83' సినిమాకు దర్శకత్వం వహిస్తోన్న కబీర్ ఖాన్ సైతం తన ఇనిస్టాగ్రామ్‌లో ఇదే ఫోటోని పోస్టు చేస్తూ "ఈ మ్యాచ్ టీవీలో ప్రసారం కాలేదు.... భారతదేశం ఎప్పుడూ చూడని ప్రపంచ రికార్డ్ ఇన్నింగ్స్ ... తున్‌బ్రిడ్జ్ వెల్స్‌లో చల్లని గాలులతో కూడిన రోజు చరిత్ర ఎలా తయారైందో ఈ ఏప్రిల్‌లో ప్రపంచం చూస్తుంది" అని కామెంట్ పెట్టాడు.

ఫస్ట్ లుక్‌ను ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో

కాగా, ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో రణవీర్ సింగ్ షేర్ చేశాడు. తన సహ నటులతో కలిసి రణవీర్ కనిపించారు. 'ఈ రోజు నుంచి సరిగ్గా సంవత్సరం'... ఇండియా గ్రేటెస్ట్ స్టోరీని ఏప్రిల్ 10, 2020న విడుదల కాబోతోంది' అంటూ రణవీర్ పేర్కొన్నారు. ఈ చిత్రంలో రణవీర్‌తో పాటు ఆర్ బాద్రే, హార్డీ సంధు, చిరాగ్ పాటిల్, సాఖిబ్ సలీమ్, పంకజ్ త్రిపాఠి, తాహిర్ బాసిన్, అమ్మీ విర్క్, సాహిల్ ఖట్టర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

భారతీయ క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండి పోయే ఘట్టం

‘83' సినిమా ద్వారా వెండితెకరపైకి భారతీయులు గర్వించే కథను తేబోతున్నారు దర్శకుడు కబీర్ ఖాన్. ఇప్పటి వరకు వచ్చిన అన్ని క్రికెట్ బేస్డ్ సినిమాల కంటే ఇది టాప్ మూవీ అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే భారతీయ క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండి పోయే ఘట్టం అది. 1983 టీమిండియా తొలిసారి క్రికెట్ వరల్డ్ కప్ గెలుపొందిన సంగతి తెలిసిందే.

ధర్మశాలలో ప్రిపేరేషన్

ఆ స్టోరీని బేస్ చేసుకుని ‘83' చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం రణవీర్ అండ్ టీమ్ ధర్మశాలలో ప్రిపేర్ అవుతున్నారు. ఇక్కడ ట్రైనింగ్ తర్వాత షూటింగ్ మొదలు కానుంది. కొన్ని రోజుల క్రితం రణవీర్ ఈ సినిమా కోసం క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్ సమక్షంలో ప్రిపేర్ అవుతున్న ఫోటో చేశారు. ‘లజెండ్ కపిల్ దేవ్ 83 సినిమా గురించి నన్ను బ్లెస్ చేశారు. జర్నీ మొదలైంది' అంటూ పేర్కొని ఆయనపై తన అభిమానం చాటుకున్నారు.

కపిల్ దేవ్ పాత్రలో కనపించడంపై

ఇంతకు ముందు ఓ ఇంటర్వ్యూలో కపిల్ దేవ్ పాత్రలో కనపించడంపై రణవీర్ సింగ్ స్పందిస్తూ... ‘నేను పుట్టిన సమయంలోనే క్రికెట్ మన దేశంలో పాపులర్. దర్శకుడు కబీర్ ఖాన్ నా వద్దకు వచ్చి 83 సినిమా చేద్దామన్నపుడు చాలా సంతోషించాను. కథ అద్భుతంగా ఉంది. ఇది కేవలం క్రికెట్ గురించే కాదు.. ఇదొక హ్యూమన్ స్టోరీ' అని రణవీర్ సింగ్ తెలిపారు.

43 పరుగుల తేడాతో విజయం

43 పరుగుల తేడాతో విజయం

కాగా, జూన్ 25, 1983లో టీమిండియా లార్డ్స్‌లో చరిత్ర సృష్టించింది. కపిల్ దేవ్ నాయకత్వంలోని టీమిండియా ఈ మ్యాచ్‌లో ప్రపంచకప్ గెలిచి విశ్వవిజేతగా అవతరించింది. కపిల్ డెవిల్స్‌గా పేరుగాంచిన ఈ రోజున వెస్టిండిస్‌పై 43 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా తొలిసారి ప్రపంచకప్ విజేతగా నిలిచింది.

Story first published: Monday, November 11, 2019, 18:57 [IST]
Other articles published on Nov 11, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+