For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

6 వికెట్లతో దీపక్ చాహర్ విజృంభణ.. మూడో టీ20లో బంగ్లాపై భారత్ విజయం.. సిరీస్ కైవసం!!

India vs Bangladesh 3rd T20 Match Highlights || India Won The Bangladesh Series || Oneindia Telugu
India vs Bangladesh 3rd T20I: Hat-trick man Deepak Chahar help India clinch series 2-1

నాగ్‌పూర్: విదర్భ క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీస్ డిసైడర్ మూడో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. భారత పేసర్ దీపక్ చాహర్ 6 వికెట్లతో చెలరేగడంతో 175 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లా 19.2 ఓవర్లలో 144 పరుగులకు ఆలౌట్ అయింది. చాహర్ హ్యాట్రిక్ కూడా నమోదు చేసాడు. మొహమ్మద్ నైమ్ ఒంటరి పోరాటం చేసినా జట్టును గెలిపంచలేకపోయాడు. చివరి టీ20లో 30 పరుగులతో గెలిచిన భారత్ మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది.

ఆదిలోనే భారీ షాక్:

ఆదిలోనే భారీ షాక్:

175 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌కు దీపక్ భారీ షాక్ ఇచ్చాడు. వరుస బంతుల్లో ఓపెనర్ లిటన్ దాస్ (9), సౌమ్య సర్కార్‌ (0)లను వెనక్కి పంపాడు. చాహర్ వేసిన మూడో ఓవర్ నాలుగో బంతిని లిటన్ భారీ షాట్ ఆడే ప్రయత్నంలో వాషింగ్టన్ సుందర్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆ తర్వాతి బంతికే సౌమ్య సర్కార్‌ గోల్డెన్ డక్‌ అయ్యాడు.

చాహర్ హ్యాట్రిక్:

12 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన దశలో మొహమ్మద్ నైమ్ (81), మొహమ్మద్ మిథున్‌ (27) లు జోరు పెంచారు. భారత బౌలర్లకు చిక్కకుండా స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలో నైమ్ 7 ఫోర్లు, సిక్సర్ సాయంతో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే ఒకే స్కోర్ వద్ద మిథున్, రహీమ్ (0) ఔట్ అవ్వడంతో బంగ్లాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆపై నైమ్ కూడా పెవిలియన్ చేరడంతో బంగ్లా వికెట్ల పతనం ఆగలేదు. చహల్, దూబేలకు తోడు ఇన్నింగ్స్ చివరలో చాహర్ హ్యాట్రిక్ నమోదు చేయడంతో బంగ్లా ఆలౌట్ అయింది.

నిరాశపరిచిన రోహిత్:

నిరాశపరిచిన రోహిత్:

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్ షఫియుల్ ఆదిలోనే భారీ షాక్ ఇచ్చాడు. రెండు పరుగులకే ఓపెనర్ రోహిత్‌ శర్మను పెవిలియన్ పంపాడు. జట్టు స్కోర్ 35 పరుగుల వద్ద మరో ఓపెనర్ శిఖర్ ధవన్ (19)ను ఔట్ చేశాడు. దీంతో ఓపెనర్లను కోల్పోయిన భారత జట్టు కష్టాల్లో పడింది. అయితే లోకేశ్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్‌లు ఆచితూచి ఆడి వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు.

చెలరేగిన శ్రేయాస్:

చెలరేగిన శ్రేయాస్:

క్రీజులో కుదురుకున్న అనంతరం దూకుడు పెంచిన రాహుల్, శ్రేయాస్ ఎడాపెడా ఫోర్లు కొడుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపారు. ఇద్దరూ కలిసి 41 బంతుల్లోనే 59 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఇక అర్ధ సెంచరీ పూర్తిచేసుకున్న వెంటనే లోకేశ్ రాహుల్ పెవిలియన్ చేరాడు. ఒకవైపు రిషబ్ పంత్ (6) తడబడినా.. శ్రేయాస్ శివమెత్తాడు. అఫిఫ్ హొసైన్ బౌలింగ్‌లో వరుస సిక్సర్లతో విరుచుకుపడ్డాడు.

మనీశ్ పాండే మెరుపులు:

మనీశ్ పాండే మెరుపులు:

శ్రేయాస్ ధాటిగా ఆడుతూ కేవలం 27 బంతుల్లో 5 సిక్సర్లు, ఒక ఫోర్‌తో టీ20ల్లో తొలి అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. స్కోర్ వేగం పెరిగే క్రమంలో పంత్ నిష్క్రమించాడు. ఆ వెంబడే 17వ ఓవర్లో శ్రేయాస్ కూడా ఔట్ అయ్యాడు. అయితే ఇన్నింగ్స్ చివరలో మనీశ్ పాండే 13 బంతుల్లో మూడు ఫోర్ల సాయంతో 22 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో షఫియుల్ ఇస్లాం, సౌమ్య సర్కార్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. అల్ అమిన్ హొసైన్క ఓ వికెట్ తీసాడు.

Story first published: Sunday, November 10, 2019, 23:20 [IST]
Other articles published on Nov 10, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+