
గుండుతో షాకిచ్చాడు..
అయితే ఈ అద్భుతాన్ని నెమరువేసుకున్న అప్పటి టీమిండియా మేనేజర్ రంజీబ్ బిస్వాల్ ఎఎన్‌ఐతో మాట్లాడుతూ.. ధోనీ గురించి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. విజయ సంబరాల్లో మునిగి తేలిన తమకు ఉదయం ధోనీ గుండుతో కనిపించి భారీ షాకిచ్చాడని తెలిపాడు. 'మ్యాచ్ గెలిచిన తర్వాత ఉదయం 4:30 గంటలకు వరకు జట్టులోని ఆటగాళ్లందరూ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ తర్వాత ఎవరి గదుల్లోకి వారు వెళ్లిపోయారు. అయితే ఉదయం లేచి చూసేసరికి ధోనీ గుండుతో కనిపించాడు. దానికి కారణం తెలియనప్పటికీ.. ఆ సంఘటన మాత్రం మాతో ఎప్పటికీ నిలిచిపోతుంది" అని బిస్వాల్ చెప్పుకొచ్చాడు.

భారత్- పాక్ మ్యాచ్..
ఇక ధోనీ తన భావోద్వేగాలన్నిటిని గుండెల్లోనే దాచుకున్నాడని బిస్వాల్ చెప్పుకొచ్చాడు. ఫైనల్లో సూపర్ బ్యాటింగ్‌తో అదరగొట్టి అద్భుత విజయాన్నందించాడని కొనియాడాడు. అయితే ఈ టోర్నీలో బిగ్గెస్ట్ మ్యాచ్ మాత్రం పాకిస్థాన్‌తో జరిగిన సెమీఫైనేలనన్నాడు. ఆ మ్యాచ్‌లో ఇరు దేశాల అభిమానుల భావోద్వేగాలు తారాస్థాయికి చేరాయని, అలే ఆటగాళ్లపై కూడా తీవ్ర ఒత్తిడి ఉందని గుర్తు చేసుకున్నాడు. ఆ మ్యాచ్ సందర్భంగా తమ పరిస్థితి ప్రెజర్ కుక్కర్‌లో వేసినట్లే అనిపించిందన్నాడు. అయితే కోచ్ గ్యార కిర్‌స్టన్, కెప్టెన్ ధోనీ ఆ ఒత్తిడిని ఆటగాళ్ల దరిచేరనివ్వకుండా.. గేమ్‌పై ఫోకస్ పెట్టేలా చేశారన్నాడు.

మీడియా నుంచి ఒత్తిడి..
టీమ్ మేనేజర్‌గా తన పాత్రను గుర్తు చేసుకున్న బిస్వాల్.. ఇంటర్వ్యూలు ఇప్పించమని మీడియా తనపై ఒత్తిడి చేసిందని గుర్తు చేసుకున్నాడు. ఆటపై ఫోకస్ పెట్టి, విజయం సాధించడమే తమ లక్ష్యమని, ఈ సమయంలో ఆటగాళ్లతో ఇంటర్వ్యూలకు అనుమతించలేమని స్పష్టం చేశానన్నాడు. అలాగే మ్యాచ్ టికెట్ల కోసం కూడా చాలా మంది రిక్వెస్ట్ చేసేవారని, కానీ మెగా ఈవెంట్ టైమ్‌లో ఏం చేయలేని పరిస్థితని చెప్పేవాడనన్నాడు. ఇక ఫైనల్లో గెలిచిన అనంతరం వాంఖడేలోని క్షణాలు తలుచుకుంటే ఇప్పటికీ రోమాలు నిక్కబొడుస్తాయన్నాడు.

అదరగొట్టిన గంభీర్, ధోనీ
టైటిల్ ఫైట్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో 6 వికెట్లకు 274 పరుగులు చేసింది. కెప్టెన్ మహేల జయవర్దనె ( 88 బంతుల్లో 13 ఫోర్లతో 103 నాటౌట్) అజేయ సెంచరీతో చెలరేగాడు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన భారత్.. వీరేంద్ర సెహ్వాగ్ (0), సచిన్ టెండూల్కర్ (18) వికెట్లను ప్రారంభంలోనే కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో గౌతమ్ గంభీర్ ( 122 బంతుల్లో 9 ఫోర్లు 97), నాటి యువ ప్లేయర్ విరాట్ కోహ్లీ (35)తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. కోహ్లీ ఔటైనా.. ధోనీతో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. నాలుగో వికెట్‌కి 109 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. గంభీర్ ఔటైనా.. యువరాజ్‌తో కలిసి ధోనీ ( 79 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 91 నాటౌట్) 48.2 ఓవర్లలోనే 277/4తో మ్యాచ్‌ను ముగించాడు.


Click it and Unblock the Notifications
