Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Ranji Trophy: ఎగిరిన మిడిల్ స్టంప్.. బిత్తరపోయిన సూరీడు! (వీడియో)

టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పేలవ ఫామ్ కొనసాగుతోంది. ఇటీవలే ఇంగ్లండ్‌తో ముగిసిన ఐదు టీ20ల సిరీస్‌లో దారుణంగా విఫలమైన సూరీడు.. ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీ 2024-25లోనూ అదే వైఫల్యాన్ని కొనసాగించాడు. కోల్‌కతా వేదికగా శనివారం హర్యానాతో ప్రారంభమైన క్వార్టర్ ఫైనల్లో సూర్యకుమార్ యాదవ్ 5 బంతుల్లో 2 ఫోర్ల సాయంతో 9 పరుగులు చేసి క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

ఎగిరిన మిడిల్ స్టంప్..
హర్యానా పేసర్ సుమిత్ కుమార్ స్టన్నింగ్ డెలివరీతో సూర్యకుమార్ యాదవ్‌ను ఔట్ చేశాడు. అతను వేసిన 8వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. సుమిత్ కుమార్ వేసిన ఇన్‌స్వింగర్‌ను అంచనా వేయడంలో విఫలమైన సూర్య.. మిడ్ వికెట్ దిశగా ఆడబోయి మూల్యం చెల్లించుకున్నాడు.

Ranji Trophy Suryakumar Yadav s Poor Run Continues After He Falls Cheaply

అద్భుతంగా టర్న్ అయిన బంతి సూర్య బ్యాట్, ప్యాడ్ గ్యాప్ నుంచి దూసుకెళ్లి మిడిల్ స్టంప్‌ను లేపిసింది. ఈ బంతి వేగానికి మిడిల్ స్టంప్ గాల్లో చక్కర్లు కొట్టింది. ఈ స్టన్నింగ్ డెలివరీకి సూర్యకుమార్ యాదవ్ బిత్తరపోయాడు. ప్రస్తుతం ఈ వికెట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

కష్టాల్లో ముంబై..
సూర్యకుమార్ యాదవ్‌తో పాటు ముంబై టాపార్డర్ కుప్పకూలింది. ఓపెనర్లు ఆయుష్ మాత్రే(0), ఆకాశ్ ఆనంద్(10)లతో పాటు మిడిలార్డర్ బ్యాటర్లు సిద్దేశ్ లాండ్(4) దారుణంగా విపలమవ్వడంతో 25 పరుగులకే ముంబై నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో శివమ్ దూబే(28), కెప్టెన్ అజింక్యా రహానే(31) జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. కానీ శివమ్ దూబేను అజిత్ చాహల్ ఔట్ చేయడంతో ఐదో వికెట్‌ను నమోదైన 45 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

ఆ కాసేపటికే రహానేను అన్షఉల్ కంబోజ్ ఔట్ చేయడంతో ముంబై 94 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. క్రీజులో శార్దూల్ ఠాకూర్(6 బ్యాటింగ్), షామ్స్ ములాని(12 బ్యాటింగ్) ఉన్నారు. హర్యానా బౌలర్లలో అన్షుల్ కంబోజ్ మూడు వికెట్లు తీయగా.. సుమిత్ కుమార్ రెండు, అజిత్ చాహల్ ఒక వికెట్ పడగొట్టారు.

కష్టాల్లో సూరీడు..
పేలవ బ్యాటింగ్‌తో సతమతమవుతున్న సూర్యకుమార్ యాదవ్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంగ్లండ్‌తో ఐదో టీ20ల సిరీస్‌లో సూర్య 0, 12, 14, 0, 2 ఐదు ఇన్నింగ్స్‌ల్లో 28 పరుగులే చేశాడు. ఈ ఐదు ఇన్నింగ్స్‌ల్లో ఒకే తరహా బంతులు, షాట్స్‌తో ఔటవ్వడం తీవ్ర చర్చనీయాంశమైంది. వినూత్న షాట్స్ ఆడే సూర్యను ఇంగ్లండ్ బౌలర్లు నెమ్మదైన బంతులతో బోల్తా కొట్టించారు. తాజాగా రంజీ ట్రోఫీలోనూ విఫలమవ్వడంతో సూర్య‌ను నెటిజన్లు హెచ్చరిస్తున్నారు.

Story first published: Saturday, February 8, 2025, 12:04 [IST]
Other articles published on Feb 8, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+