Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Ranji Trophy: శార్దూల్ ఠాకూర్ సంచలన బ్యాటింగ్.. సిక్సర్‌తో సెంచరీ!(వీడియో)

టీమిండియా పేస్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ సంచలన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీ 2024 సెమీఫైనల్లో శార్దూల్ ఠాకూర్ అసాధారణ బ్యాటింగ్‌తో చెలరేగాడు. తమిళనాడుతో జరుగుతున్న నాకౌట్ మ్యాచ్‌లో ముంబై జట్టు తరఫున బరిలోకి దిగిన శార్దూల్ ఠాకూర్.. 105 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్స్‌లతో 109 పరుగులు చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు.

106 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ జట్టును సంచలన బ్యాటింగ్‌తో శార్దూల్ ఆదుకున్నాడు. 89 బంతుల్లో శతకం పూర్తి చేసుకున్న శార్దూల్ ఠాకూర్.. 91 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద వరుసగా 4, 6 బాది సెంచరీ సాధించాడు. శతకం పూర్తి చేసుకున్న అనంతరం తనదైన శైలిలో సంబరాలు చేసుకున్నాడు. శార్దూల్ ఠాకూర్ కెరీర్‌లో ఇదే తొలి సెంచరీ కావడం విశేషం.

Ranji Trophy Shardul Thakur hits maiden FC hundred in Mumbai vs Tamil Nadu semis

8వ స్థానంలో బ్యాటింగ్ వచ్చిన శార్దూల్ ఠాకూర్.. ధనాధన్ బ్యాటింగ్‌తో 8వ వికెట్‌కు హార్దిక్ తామోర్‌తో కలిసి 105 పరుగులు జోడించాడు. తనుష్ కొటియాన్(38 బ్యాటింగ్) కలిసి 9వ వికెట్‌కు 79 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. చివరకు కుల్దీప్ సేన్ బౌలింగ్‌లో కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు.
క్రీజులోకి వచ్చిన తుషార్ దేశ్‌పాండేతో కలిసి తనుష్ కొటియాన్ ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు.

శార్దూల్ ఠాకూర్ ఫైటింగ్ సెంచరీపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. అభిమానులు, మాజీ, ప్రస్తుత క్రికెటర్లు అతన్ని సోషల్ మీడియా వేదికగా కొనియాడుతున్నారు. రవిచంద్రన్ అశ్విన్ సైతం శార్దూల్‌ను తనదైన శైలిలో ప్రశంసించాడు.

ప్రస్తుతం ముంబై 88 ఓవర్లలో 9 వికెట్లకు 301 పరుగులు చేయగా.. ఆధిక్యం 155 రన్స్‌కు చేరింది. శార్దూల్ ఠాకూర్‌ తర్వాత ముషీర్ ఖాన్(131 బంతుల్లో 6 ఫోర్లతో 55) హాఫ్ సెంచరీతో రాణించాడు. పృథ్వీ షా(5), అజింక్యా రహానే(19), శ్రేయస్ అయ్యర్(3) దారుణంగా విఫలమయ్యారు. తమిళనాడు బౌలర్లలో సాయి కిషోర్(6/88) ఆరు వికెట్లు తీయగా.. కుల్దీప్ సేన్ రెండు, సందీప్ వారియర్ ఓ వికెట్ పడగొట్టాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన తమిళనాడు 146 పరుగులకే కుప్పకూలింది. వాషింగ్టన్ సుందర్(138 బంతుల్లో 5 ఫోర్లతో 43), విజయ్ శంకర్(109 బంతుల్లో 8 ఫోర్లతో 44) రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ముంబై బౌలర్లలో తుషార్ దేశ్‌పాండే(3/24) మూడు వికెట్లు తీయగా.. ముషీర్ ఖాన్, తనూష్ కొటియాన్, శార్దూల్ ఠాకూర్ రెండేసి వికెట్లు పడగొట్టారు. మోమిత్ అవస్తీ ఓ వికెట్ తీసాడు.

Story first published: Sunday, March 3, 2024, 16:49 [IST]
Other articles published on Mar 3, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+