Ranji Trophy: సెలెక్టర్లపై కోపం.. శతక్కొట్టిన సర్ఫరాజ్ ఖాన్.. వేలు చూపిస్తూ..!

న్యూఢిల్లీ: దేశవాళీ క్రికెట్‌లో టన్నుల కొద్దీ పరుగులు చేస్తున్నా.. ముంబై క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్‌ను సెలెక్టర్లు పట్టించుకోవడం లేదు. గత మూడేళ్లుగా రంజీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్న అతనికి ఆస్ట్రేలియాతో జరగనున్న బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్‌లో అవకాశం కల్పిస్తారని అంతా భావించారు. కానీ చేతన్ శర్మ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ.. సర్ఫరాజ్‌కు మొండి చెయ్యి చూపించింది.
తొలి రెండు టెస్ట్‌లకు ఎంపిక చేసిన 17 మంది సభ్యులతో కూడిన జట్టులో సర్ఫరాజ్‌కు అవకాశం ఇవ్వలేదు. దాంతో ఈ ముంబై క్రికెటర్ తీవ్ర వేదనకు గురయ్యాడు. సెలక్టర్లు బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపిక చేస్తామని చెప్పారని.. కానీ అలా జరగలేదని వాపోయాడు.
ఆదుకున్న సర్ఫరాజ్..
వారం రోజులుగా తీవ్ర మనస్థాపంతో ఉన్న సర్ఫరాజ్ ఖాన్.. సెలెక్టర్లపై ఉన్న కోపాన్ని బంతిపై చూపించాడు. ఢిల్లీతో జరుగుతోన్న రంజీ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగాడు. 16 ఫోర్లు, 4 సిక్సులతో బౌలర్లపై విరుచుకుపడిన సర్ఫరాజ్ 155 బంతుల్లో 125 పరుగులు చేశాడు. సర్ఫరాజ్ ఖాన్ బ్యాటింగ్‌కు వచ్చే సమయానికి ముంబై 62 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
తర్వాత కాసేపటికే కెప్టెన్ అజింక్య రహానే వికెట్ కోల్పోవడంతో ఆ జట్టు కష్టాలు రెట్టింపు అయ్యాయి. ఈ దశలో సర్ఫరాజ్ ఢిల్లీ బౌలర్లకు అడ్డుగా నిలిచాడు. ప్రసాద్ పవార్‌తో కలిసి ఐదో వికెట్‌కు 44 పరుగులు జోడించాడు. శామ్స్ ములాన్ (103 బంతుల్లో 39)తో కలిసి ఆరో వికెట్‌కు 144 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు.
సలాం చేసిన కోచ్..
సర్ఫరాజ్ ఖాన్ సెంచరీతో ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 293 పరుగులు చేయగలిగింది. సెంచరీ చేశాక సర్ఫరాజ్ సంబరాలు జరుపుకున్న తీరును చూస్తే.. సెలెక్టర్లపై అతనికి ఉన్న కోపం స్పష్టంగా తెలిసింది. నా సత్తా ఏంటో చూడండి అంటూ వేలుతో చూపించడం చర్చనీయాంశమైంది.సెంచరీ చేయగానే డ్రెస్సింగ్ రూమ్, కోచ్ అమోల్ మజుందార్ వైపు వేలు చూపిస్తూ.. సర్ఫరాజ్ సంబరాలు చేసుకోగా.. కోచ్ అమోల్ ముజుందార్ తన టోపీ తీసి సర్ఫరాజ్ ఇన్నింగ్స్‌కు సలాం చేశాడు.

23 ఇన్నిం3గ్స్‌లో 10 సెంచరీలు..
సర్ఫరాజ్ ఈ రంజీ సీజన్లోనే కాదు.. గత సీజన్లోనూ సత్తా చాటాడు. 2021-22 సీజన్లో 122.75 యావరేజ్‌తో 982 పరుగులు చేశాడు. అందులో 4 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు ఉండగా.. అత్యధిక స్కోర్ 275. ప్రస్తుత సీజన్లో 107.75 యావరేజ్‌తో 431 పరుగులు చేశాడు. గత మూడు రంజీ సీజన్లలో అతని యావరేజ్ 100కిపైగా ఉండటం గమనార్హం. ఈ సీజన్లో సర్ఫరాజ్ ఖాన్‌కు ఇది మూడో సెంచరీ కావడం గమనార్హం. హైదరాబాద్‌పై 126 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన ముంబై క్రికెటర్.. తమిళనాడుపై 162 పరుగులు చేశాడు. ఈ ముంబై క్రికెటర్ రంజీ ట్రోఫీలో గత 23 ఇన్నింగ్స్‌ల్లో 10 శతకాలు నమోదు చేయడం విశేషం.

అన్‌స్టాపబుల్‌కు అసలైన నిర్వచనం..
సర్ఫరాజ్ అసాధారణ ప్రదర్శనకు అభిమానులు ఫిదా అవుతున్నారు. అన్‌స్టాపబుల్‌కు అసలైన నిర్వచనం సర్ఫరాజ్ ఖాన్ అంటూ ప్రశంసిస్తున్నారు. అతన్ని ఎక్కువ కాలం పక్కనబెట్టడం బీసీసీఐకి సాధ్యం కాదంటున్నారు. దేశవాళీ క్రికెట్లో అతడెంత బాగా రాణిస్తున్నాడో గమనించాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. ఆస్ట్రేలియాతో చివరి రెండు టెస్ట్‌లకు అయినా సర్ఫరాజ్‌ను ఎంపిక చేయాలని కోరుతున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications