Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Ranji Trophy: 3 భారీ సిక్స్‌లు బాది వికెట్ పారేసుకున్న రోహిత్ శర్మ! (వీడియో)

రెడ్ బాల్ క్రికెట్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వైఫల్యం కొనసాగుతోంది. 10 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత రంజీ ట్రోఫీ బరిలోకి దిగిన రోహిత్ శర్మ.. రెండు ఇన్నింగ్స్‌ల్లో దారుణంగా విఫలమయ్యాడు. జమ్మూ కశ్మీర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై తరఫున బరిలోకి దిగిన రోహిత్ శర్మ తొలి ఇన్నింగ్స్‌లో 3 పరుగులే చేసి వెనుదిరిగాడు.

రెండో ఇన్నింగ్స్‌లో 28 పరుగులే చేసి క్యాచ్ ఔటయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో కాస్త మెరుగ్గా కనిపించిన రోహిత్..2 బౌండరీలతో పాటు 3 భారీ సిక్స్‌లు బాది ఫామ్‌లోకి వచ్చినట్లు కనిపించాడు. తనకే సాధ్యమైన ట్రేడ్ మార్క్ సిక్స్‌లతో ఆకట్టుకున్నాడు. తొలి 11 బంతుల్లోనే 21 పరుగులు చేసిన రోహిత్.. తర్వాతి 20 బంతుల్లో ఒకే ఒక పరుగు చేశాడు.

Ranji Trophy Rohit Sharma smashes three big sixes and two fours and then throws his wicket

అయితే యుధ్వీర్ సింగ్, అకీబ్ నబీ కట్టడిగా బౌలింగ్‌ చేసి రోహిత్‌ను చికాకు పెట్టారు. దాంతో సహనం కోల్పోయిన రోహిత్ డిఫెన్స్ చేయబోయి వికెట్ పారేసుకున్నాడు. 38 బంతుల్లో 28 పరుగులు చేసి యుధ్వీర్ సింగ్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌ అయ్యాడు.

కష్టాల్లో ముంబై..
రోహిత్ శర్మతో పాటు యశస్వి జైస్వాల్(51 బంతుల్లో 4 ఫోర్లతో 26), శ్రేయస్ అయ్యర్(17), శివమ్ దూబే(0) కూడా విఫలమయ్యారు. దాంతో 86 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ముంబై 22 ఓవర్లు ముగిసే సమయానికి 5 వికెట్లకు 86 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ అజింక్యా రహానే(12 బ్యాటింగ్) ఉన్నాడు.

అంతకుముందు 174/7 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను కొనసాగించిన జమ్మూ కశ్మీర్ 41.3 ఓవర్లలో 206 పరుగులకు కుప్పకూలింది. ముంబై బౌలర్లలో మోహిత్ అవస్థి(5/52) ఐదు వికెట్లు తీయగా.. శార్దూల్ ఠాకూర్(2/39), శామ్స్ ములానీ(2/61) రెండేసి వికెట్లు పడగొట్టారు. శివమ్ దూబేకి ఓ వికెట్ దక్కింది.

ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 120 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే. శార్దూల్ ఠాకూర్(57 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 51), తనూష్ కోటియన్(36 బంతుల్లో 5 ఫోర్లతో 26) మినహా అంతా విఫలమయ్యారు.

కలవరపెడుతున్న రోహిత్ ఫామ్..
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ కలవరపెడుతోంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 5 ఇన్నింగ్స్‌ల్లో 31 పరుగులే చేసిన రోహిత్.. రంజీ ట్రోఫీలో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 31 పరుగులే చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ సమయానికి రోహిత్ ఫామ్ అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Story first published: Friday, January 24, 2025, 12:45 [IST]
Other articles published on Jan 24, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+