టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రంజీ మ్యాచ్‌కు అనూహ్య ప్రేక్షకాదరణ లభించింది. 12 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత విరాట్ కోహ్లీ రంజీ బరిలో నిలవగా.. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు అభిమానులు పోటెత్తారు. తమ అభిమాన ఆటగాడిని ప్రత్యక్షంగా చూసేందుకు వేలాదిగా తరలివచ్చారు.
దాంతో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం ప్రేక్షకులతో కిక్కిరిసిపోయింది. విరాట్ కోహ్లీ, ఆర్‌సీబీ నామస్మరణతో స్టేడియం దద్దరిల్లుతోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

గత మూడు నెలలుగా టీమిండియా దారుణంగా విఫలమవుతుండటంతో బీసీసీఐ కఠిన నిబంధనలను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అందుబాటులో ఉన్న టీమిండియా ఆటగాళ్లంతా దేశవాళీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ ఆల్టిమేటం జారీ చేసింది. దాంతో అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు రంజీ ట్రోఫీ ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ ఇద్దరితో పాటు ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు దూరంగా ఉన్న టీమిండియా ఆటగాళ్లు కూడా రంజీ ట్రోఫీ బరిలోకి దిగాల్సి వచ్చింది. ఇప్పటికే స్టార్ ఆటగాళ్లంతా దేశవాళీ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చారు. అయితే మెడ నొప్పితో గత రంజీ మ్యాచ్ ఆడని కోహ్లీ.. గురువారం సౌరాష్ట్రతో ప్రారంభమైన ఆఖరి లీగ్ రంజీ మ్యాచ్‌లో ఢిల్లీ తరఫున బరిలోకి దిగాడు.
ఈ మ్యాచ్‌కు ప్రేక్షకులను అనుమతించడంతో ఫ్యాన్స్ పోటెత్తారు. ఎలాంటి రుసుము లేకుండా ఉచితంగా ప్రవేశం కల్పించడంతో వేలాది సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. ఉదయం 3 గంటల నుంచే స్టేడియం బయట క్యూ కట్టారు. కోహ్లీ, ఆర్‌సీబీ అంటూ నినాదాలు చేస్తున్నారు. ఢిల్లీ స్టేడియంలోని ప్రతీ స్టాండ్ ప్రేక్షకులతో నిండిపోయింది. భద్రతా కారణాలతో కొంత మంది అభిమానులు పోలీసులు అనుమతించలేదని తెలుస్తోంది.
ఓ ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌కు భారీ సంఖ్యలో ప్రేక్షకులు హాజరవ్వడం ఇదే తొలిసారని కామెంటేటర్లు తెలిపారు. స్టేడియానికి భారీ సంఖ్యలో హాజరైన అభిమానులకు విరాట్ కోహ్లీ ధన్యవాదాలు తెలిపాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. కోహ్లీ ఫామ్‌లో లేకపోయినా.. అతనిపై అభిమానం జనాలకు తగ్గలేదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. 'ఏంటయ్యా ఇది.. ఒక మనిషిని ఇంతలా ఆరాధిస్తారా?'అనే మీమ్స్‌ను ట్రెండ్ చేస్తున్నారు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ ఫీల్డింగ్ ఎంచుకోగా.. బ్యాటింగ్‌కు దిగిన సౌరాష్ట్ర 21 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. నవ్‌దీప్ సైనీ ఓ వికెట్ తీయగా.. సిద్దాంత్ శర్మ రెండు వికెట్లు పడగొట్టాడు. కోహ్లీ కోసమే ఈ మ్యాచ్‌ను జియోసినిమా ప్రత్యక్ష ప్రసారం చేస్తుండటం విశేషం. ముందుగా ఈ మ్యాచ్‌కు లైవ్ లేకపోగా.. కోహ్లీ బరిలోకి దిగుతుండటంతో అతని క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు జియో సినిమా ముందుకు వచ్చింది.
THE FANS AT ARUN JAITLEY STADIUM FOR THE BIGGEST SUPERSTAR IN MODERN ERA 🐐
— Johns. (@CricCrazyJohns) January 30, 2025
- This is King Kohli's Kingdom. pic.twitter.com/l2WNCxeFga
Virat Kohli thanking the fans for the Huge support in his home ground 👌
— Johns. (@CricCrazyJohns) January 30, 2025
- Nice gesture by King....!!!! pic.twitter.com/30KAg7IH2D
THE AURA OF KING KOHLI 🥶🔥 pic.twitter.com/2Bi2yrmqOd
— Johns. (@CricCrazyJohns) January 30, 2025
CROWD AT 9 AM ON THURSDAY TO SEE ONE MAN 🤯 pic.twitter.com/BuDUNLvbad
— Johns. (@CricCrazyJohns) January 30, 2025