For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

లక్నోపై కోపం.. 100వ మ్యాచ్‌లో 200 కొట్టిన మనీశ్ పాండే!

Ranji Trophy: Manish Pandey cracks special double ton in 100th FC match

న్యూఢిల్లీ: టీమిండియా వెటరన్ బ్యాటర్ మనీశ్ పాండే డబుల్ సెంచరీతో సత్తా చాటాడు. ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీ‌లో గోవాతో జరుగుతున్న మ్యాచ్‌లో కర్ణాటక‌ తరఫున మనీశ్ పాండే(186 బంతుల్లో 14 ఫోర్లు, 11 సిక్స్‌లతో 203 నాటౌట్) అజేయ ద్విశతకం బాదాడు. అతనికి తోడుగా ఓపెనర్ రవికుమార్ సమర్థ్ (140), కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (50), విశాల్ ఓనత్ (91) రాణించడంతో కర్ణాటక 7 వికెట్ల నష్టానికి 607 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.

అర్జున్ టెండూల్కర్ బౌలింగ్‌తో సహా..

అర్జున్ టెండూల్కర్ బౌలింగ్‌తో సహా..

గోవా వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కర్ణాటక కెప్టెన్ మయాంక్ అగర్వాల్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. సమర్థ్ సెంచరీ చేయడంతో.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి కర్ణాటక 3 వికెట్ల నష్టానికి 294 పరుగులు చేసింది. 8 పరుగులతో రెండో రోజు ఆట ప్రారంభించిన మనీష్ పాండే.. అర్జున్ టెండుల్కర్ సహా గోవా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ సీజన్లో తొలి సెంచరీని డబుల్ సెంచరీగా మలవడం ద్వారా పాండే ఫామ్‌లోకి వచ్చాడు. మనీష్‌కు ఇది వందో ఫస్ట్ క్లాస్ మ్యాచ్ కావడం విశేషం.

తొలి ఐపీఎల్ సెంచరీ హీరో..

తొలి ఐపీఎల్ సెంచరీ హీరో..

ఐపీఎల్‌లో సెంచరీ బాదిన తొలి భారత క్రికెటర్‌గా గుర్తింపు పొందిన మనీష్ పాండే.. 2008 సీజన్లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడాడు. తర్వాతి సీజన్లో ఆర్సీబీ తరఫున ఆడిన పాండే.. అదే సీజన్లో సెంచరీ చేశాడు. 2014లో కోల్‌కతా తరఫున ఆడిన పాండే.. ఫైనల్లో పంజాబ్‌పై 94 పరుగులు చేసి నైట్ రైడర్స్‌కు టైటిల్ అందించాడు.

మనీష్ పాండే‌ను 2018‌‌లో రూ.11 కోట్లకు సన్‌రైజర్స్ కొనుగోలు చేసింది. 2022 మెగా వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ అతణ్ని రూ.4.6 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ ఆ సీజన్లో పాండే 6 మ్యాచ్‌ల్లో 88 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో లక్నో అతణ్ని రిలీజ్ చేయగా.. మినీ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ రూ.2.4 కోట్లకు కొనుగోలు చేసింది.

3648 పరుగులతో..

3648 పరుగులతో..

తనను రిలీజ్ చేసే విషయమై లక్నో మేనేజ్‌మెంట్ ముందుగా తనకు సమాచారం ఇవ్వలేదని.. కానీ తనను వేలంలోకి వదిలేయడాన్ని అర్థం చేసుకోగలనని పాండే వ్యాఖ్యానించాడు. ఐపీఎల్‌లో ఇప్పటి వరకూ 160 మ్యాచ్‌లు ఆడిన మనీష్.. 21 హాఫ్ సెంచరీలు, 1 సెంచరీ సాయంతో 3648 పరుగులు చేశాడు. 2014, 2020 సీజన్లలో మాత్రమే 400కిపైగా పరుగులు చేసిన పాండే.. 2017 సీజన్లో 396 పరుగులు, 2019 సీజన్లో 344 రన్స్ చేశాడు.

33 ఏళ్ల పాండే 2015లోనే టీమిండియా తరఫున అరంగేట్రం చేసినప్పటికీ.. జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోలేకపోయాడు.

Story first published: Thursday, December 29, 2022, 10:42 [IST]
Other articles published on Dec 29, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+