Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Ranji Trophy Final: విదర్భ భారీ స్కోర్.. పోరాడుతున్న కేరళ!

ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీ 2025 ఫైనల్ రసవత్తరంగా సాగుతోంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 379 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం ఫస్ట్ ఇన్నింగ్స్ ప్రారంభించిన కేరళ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లకు 131 పరుగులు చేసింది. క్రీజులో ఆదిత్య సర్వాటె(120 బంతుల్లో 10 ఫోర్లతో 66 బ్యాటంగ్), సచిన్ బేబీ(7 బ్యాటింగ్) ఉన్నారు.

ఓపెనర్లు అక్షయ్ చంద్రన్(14), రోహన్ కున్నుమ్మల్(0) విఫలమవ్వగా.. అహ్మద్ ఇమ్రాన్(83 బంతుల్లో 3 ఫోర్లతో 37) కాసేపు పోరాడాడు. విదర్భ బౌలర్లలో దర్శన్ నల్కండే(2/22) రెండు వికెట్లు తీయగా.. యశ్ ఠాకూర్ ఓ వికెట్ పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేరళ ఇంకా 248 పరుగుల వెనుకంజలో ఉంది.

Ranji Trophy Final Aditya Sarwate Leads Charge As Kerala Reach 131 3 vs Vidarbha

అంతకుముందు 254/4 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన విదర్భ‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. సెంచరీ హీరో డానిష్ మాలేవర్(283 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్స్‌లతో 153) ఓవర్‌నైట్ స్కోర్‌కు 15 పరుగుల మాత్రమే జోడించి వెనుదిరిగాడు. ఆ తర్వాత మరే బ్యాటర్ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు.

యశ్ ఠాకూర్(25), అక్షయ్ వాడేకర్(23), నచికేత్ భూతే(32) మాత్రమే చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడారు. కేరళ బౌలర్లలో నిదీశ్ మూడు వికెట్లు తీయగా.. ఈడెన్ ఆపిల్ టామ్ 3, నెడుమాన్ కుజి 2, జలజ్ సక్సెనా ఒక వికెట్ తీసారు.

Story first published: Thursday, February 27, 2025, 20:46 [IST]
Other articles published on Feb 27, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+