Ranji Trophy: అజింక్యా రహానే డబుల్.. హైదరాబాద్ ట్రబుల్! మళ్లీ భారత జట్టులోకి..!

ముంబై: టీమిండియా వెటరన్ ప్లేయర్ అజింక్యా రహానే(261 బంతుల్లో 26 ఫోర్లు, 3 సిక్స్‌లతో 204) డబుల్ సెంచరీ సాధించాడు. పేలవ ఫామ్‌తో టీమిండియాకు దూరమైన ఈ మాజీ వైస్ కెప్టెన్... ప్రస్తుతం ముంబై తరఫున ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీ ఆడుతున్నాడు. హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రహానే ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 26 ఫోర్లు, 3 సిక్సర్లతో హైదరాబాద్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.
అతనికి తోడుగా యశస్వి జైస్వాల్(195 బంతుల్లో 27 ఫోర్లు, సిక్స్‌తో 162), సర్ఫరాజ్ ఖాన్(161 బంతుల్లో 18 ఫోర్లతో 126 నాటౌట్) సెంచరీలు బాదడంతో ముంబై 651/6 పరుగుల భారీ స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. ఈ ముగ్గురికి తోడుగా టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్(80 బంతుల్లో 15 ఫోర్లు, సిక్స్‌తో 90) టీ20 తరహా బ్యాటింగ్‌తో చెలరేగాడు.

హైదరాబాద్ పేలవం..
హైదరాబాద్ బౌలర్లలో కార్తీకేయ మూడు వికెట్లు తీయగా.. శశాంక్ రెండు వికెట్లు పడగొట్టాడు. తనయ్ త్యాగరాజన్‌కు ఓ వికెట్ దక్కింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 50 ఓవర్లలో 6 వికెట్లకు 173 పరుగులు చేసింది. ఇంకా 478 పరుగుల వెనుకంజలో ఉంది. రోహిత్ రాయుడు(137 బంతుల్లో 9 ఫోర్లతో 72 బ్యాటింగ్) ఒంటరి పోరాటం చేస్తుండగా.. త్యాగరాజన్(1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. కెప్టెన్ తన్మయ్ అగర్వాల్(40) మినహా అంతా దారుణంగా విఫలమయ్యారు.
ఓటమి దిశగా...
ముంబై బౌలర్లలో షామ్స్ ములాని(5/76) ఐదు వికెట్లతో హైదరాబాద్ పతనాన్ని శాసించగా.. తుషార్ దేశ్‌పాండే ఓ వికెట్ పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలి ఇన్నింగ్స్‌లో త్వరగా ఆలౌటైతే ఆ జట్టు ఫాలో ఆన్ ఆడాల్సి ఉంటుంది. తిలక్ వర్మ , మహమ్మద్ సిరాజ్ వంటి స్టార్ ఆటగాళ్లు లేకుండా బరిలోకి దిగిన హైదరాబాద్.. మరి పేలవంగా కనిపిస్తోంది.

రహానే మళ్లీ భారత జట్టులోకి..
ఈ ఏడాది దేశవాళీ క్రికెట్‌లో అజింక్యా రహానేకు ఇది రెండో డబుల్ సెంచరీ. సెప్టెంబర్‌లో దులీప్ ట్రోఫీలో నార్త్ జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో వెస్ట్ జోన్ తరఫున రహానే 207 పరుగులు చేశాడు. రెండు డబుల్ సెంచరీలతో సూపర్ ఫామ్‌లో ఉన్న రహానే మళ్లీ టీమిండియాలోకి అడుగుపెడతాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. రంజీ ట్రోఫీలో ఇదే నిలకడైన ప్రదర్శన కనబరిస్తే పుజారా మాదిరి జట్టులోకి వస్తాడని జోస్యం చెబుతున్నారు. రహానే చివరి సారిగా సౌతాఫ్రికా పర్యటనలో టీమిండియా తరఫున ఆడాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications