Ranji Trophy: మైదానంలోకి దూసుకొచ్చి కోహ్లీ కాళ్లు మొక్కిన అభిమాని! (వీడియో)
ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీ 2024-25లో భాగంగా ఢిల్లీ వర్సెస్ సౌరాష్ట్ర మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్ తొలి రోజు ఆటలో ఓ అభిమాని సెక్యూరిటీ కళ్లు గప్పి మైదానంలోకి దూసుకొచ్చాడు. నేరుగా తన ఆరాధ్య క్రికెటర్ విరాట్ కోహ్లీ దగ్గరకు వెళ్లి అతని కాళ్లు మొక్కాడు. ఈ ఊహించని ఘటనతో అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది సదరు అభిమానిని బయటకు లాక్కెళ్లారు.
అనంతరం పోలీసులకు అప్పగించగా వారు తమదైన శైలిలో ఆ అభిమానికి ట్రీట్మెంట్ ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఘటనపై నెటిజన్లు తమదైన శైలిలో బదులిస్తున్నారు. దేశవాళీ క్రికెట్‌లో కూడా కోహ్లీని వదిలిపెట్టరా? మీ అభిమానం తగలెయ్యా?అని కామెంట్ చేస్తున్నారు.

ఇక అందుబాటులో ఉన్న టీమిండియా ఆటగాళ్లంతా దేశవాళీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ ఆల్టిమేటం జారీ చేయడంతో అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు రంజీ ట్రోఫీ ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
దాంతో 12 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత విరాట్ కోహ్లీ రంజీ ట్రోఫీ బరిలో నిలిచాడు. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు అభిమానులు పోటెత్తారు. తమ అభిమాన ఆటగాడిని ప్రత్యక్షంగా చూసేందుకు వేలాదిగా తరలివచ్చారు. తెల్లవారు జామున 3 గంటలకే స్టేడియం బయటన క్యూ కట్టారు. దాంతో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం ప్రేక్షకులతో కిక్కిరిసిపోయింది. విరాట్ కోహ్లీ, ఆర్‌సీబీ నామస్మరణతో స్టేడియం దద్దరిల్లుతోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ ఫీల్డింగ్ ఎంచుకోగా.. బ్యాటింగ్‌కు దిగిన సౌరాష్ట్ర లంచ్ బ్రేక్ సమయానికి 27 ఓవరల్లో 5 వికెట్లకు 87 పరుగులు చేసింది.
KING KOHLI IS AN EMOTION..!!!! 🐐
— Tanuj Singh (@ImTanujSingh) January 30, 2025
- The Moments fan entered the ground and touched Virat Kohli's feet. 🥹❤️ pic.twitter.com/RsSgFKeK2t
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications