శివమ్ దూబే విధ్వంసకర సెంచరీ.. అయ్యర్ ప్లేస్‌కు గురి!
టీమిండియా యువ బ్యాటర్ శివమ్ దూబే విధ్వంసకర శతకంతో చెలరేగాడు. దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నీ రంజీ ట్రోఫీలో ముంబై జట్టు తరఫున బరిలోకి దిగిన శివమ్ దూబే.. 110 బంతుల్లో సెంచరీ నమోదు చేశాడు. ఉత్తరప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శివమ్ దూబే వన్డే తరహా బ్యాటింగ్‌తో చెలరేగాడు.
తద్వారా సుదీర్ఘ ఫార్మాట్‌లో రాణించే సత్తా తనకు ఉందని భారత్ సెలెక్టర్లకు మెసేజ్ ఇచ్చాడు. ఇప్పటికే హార్దిక్ పాండ్యా గైర్హాజరీలతో టీ20ల్లో సత్తా చాటిన శివమ్ దూబే.. అఫ్గానిస్థాన్‌తో ఇటీవల ముగిసిన సిరీస్‌లో దుమ్మురేపాడు. వరుసగా హాఫ్ సెంచరీలు బాదడంతో పాటు బౌలింగ్‌లోనూ కీలక వికెట్లు తీసాడు.

ఇప్పటికే టీమిండియా టెస్ట్‌ల్లో ఓ పేస్ ఆల్‌రౌండర్ లేక ఇబ్బంది పడుతుంది. దాంతో టీమ్ కాంబినేషన్ మేనేజ్‌మెంట్‌కు కష్టంగా మారింది. శివమ్ దూబే.. సుదీర్ఘ ఫార్మాట్‌లో ఇలానే నిలకడగా రాణించి.. బౌలింగ్‌లోనూ సత్తా చాటితే టీమిండియా టెస్ట్ టీమ్‌లోకి కూడా రీఎంట్రీ ఇస్తాడని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై 59 ఓవర్లలో 198 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఉత్తరప్రదేశ్ 324 పరుగులు చేయగా.. ఆ జట్టుకు 126 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.
126 రన్స్ లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ముంబై శివమ్ దూబే విధ్వంసకర సెంచరీతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్లకు 303 పరుగులు చేసింది. ప్రస్తుతం ముంబై ఆధిక్యం 177 పరుగులకు చేరింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications