Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సాయి బాబా.. రీఎంట్రీలో పృథ్వీ షా అట్టర్ ఫ్లాప్!

సుదీర్ఘ విరామం తర్వాత మైదానంలోకి అడుగుపెట్టిన టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీ షా దారుణంగా విఫలమయ్యాడు. ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్ టోర్నీ రాయల్ లండన్ వన్డే కప్‌లో తీవ్రంగా గాయపడి గత నాలుగు నెలలు ఆటకు దూరమైన పృథ్వీ షా.. పూర్తి ఫిట్‌నెస్ సాధించి రంజీ ట్రోఫీ 2024‌తో రీఎంట్రీ ఇచ్చాడు.

బెంగాల్‌తో కోల్‌కతా వేదికగా శుక్రవారం ప్రారంభమైన మ్యాచ్‌లో ముంబై తరఫున బరిలోకి దిగిన పృథ్వీ షా మునపటిలా సత్తా చాటలేకపోయాడు. 42 బంతుల్లో 5 ఫోర్లతో 35 పరుగులే చేసి కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. దాంతో అతని పునరాగమనంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్యాన్స్ పృథ్వీ షా ఫామ్‌పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Ranji Trophy 2024: Prithvi Shaw flops on his return after a lengthy injury layoff

గతేడాది ఆగస్టులో ఇంగ్లండ్ వేదికగా రాయల్ వన్డే కప్‌లో నార్తంప్టన్‌షైర్ తరఫున శతకాల మోత మోగించిన పృథ్వీ షా.. ఓ డబుల్ సెంచరీతో పాటు విధ్వంసకర సెంచరీ బాదీ అందరి దృష్టిని ఆకర్షించాడు. అంతలోనే ఫీల్డింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడ్డాడు. మోకాలికి తీవ్ర గాయం కావడంతో గత 6 నెలలుగా మైదానానికి దూరమయ్యాడు.

బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో చికిత్స తీసుకున్న పృథ్వీ షా.. గత రెండు నెలలుగా తీవ్రంగా శ్రమించి పూర్తి ఫిట్‌నెస్ సాధించి మళ్లీ ఆడటం మొదలుపెట్టాడు. కానీ తన రీఎంట్రీ మ్యాచ్‌లో ఆశించిన రీతిలో రాణించలేకపోయాడు. అండర్ 19 ప్రపంచకప్ విజయంతో టీమిండియాలోకి దూసుకొచ్చిన పృథ్వీ షా అంతే వేగంగా జట్టుకు దూరమయ్యాడు. పేలవ ఫామ్, బలహీనమైన బ్యాటింగ్ టెక్నిక్, అనవసర వివాదాలు, ఫిట్‌నెస్ కోల్పోవడం పృథ్వీ షా ఆటను దెబ్బతీసాయి.

మరో సెహ్వాగ్ అవుతాడని దిగ్గజాల ప్రశంసలు అందుకున్న పృథ్వీ షా చివరకు దేశవాళీ స్టార్‌గానే మిగిలిపోయాడు. సాయి బాబాను ఆరాధించే పృథ్వీ షా.. జట్టు సెలెక్షన్ విషయంలో తనకు అన్యాయం జరిగినప్పుడల్లా.. సోషల్ మీడియా వేదికగా సాయి బాబా పేరిట సెలెక్టర్లపై పరోక్షంగా విమర్శలు గుప్పిస్తాడు. ఈ క్రమంలోనే రీఎంట్రీలోపృథ్వీ షా విఫలమవడంతో ఫ్యాన్స్... 'సాయి బాబా.. రీఎంట్రీలో పృథ్వీ షా అట్టర్ ఫ్లాప్'అంటూ కామెంట్ చేస్తున్నారు.

బెంగాల్‌తో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో ముంబై.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 75 ఓవర్లలో 6 వికెట్లకు 330 పరుగులు చేసింది. సుయాన్ష్ షెగ్దే(71), శివమ్ దూబే(72), తనూష్ కోటియన్(55 బ్యాటింగ్) హాఫ్ సెంచరీలతో రాణించారు. గాయంతో ముంబై కెప్టెన్ అజింక్యా రహానే ఈ మ్యాచ్‌కు దూరం కాగా.. వైస్ కెప్టెన్ శివమ్ దూబే తాత్కలిక సారథిగా జట్టును నడిపిస్తున్నాడు.

Story first published: Friday, February 2, 2024, 21:08 [IST]
Other articles published on Feb 2, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+